pizza
Gouti Harinath to help Chennai flood Victims
చెన్నై సహాయార్ధం "గౌటి హరినాధ్" ముందడుగు
You are at idlebrain.com > news today >
Follow Us

07 December 2015
Hyderabad

ప్రస్తుతం తెలుగులో అగ్రకథానాయికలుగా కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్, ప్రియమణి, రేజీనా వంటి హీరోయిన్లతోపాటు యువ కథానాయకుడు సందీప్ కిషన్ మరియు జగపతిబాబు వంటి సెన్సేషనల్ యాక్టర్ డేట్స్ మేనేజర్ గా చిత్ర పరిశ్రమకు అత్యంత సన్నిహితుడైన గౌటి హరినాధ్.. చెన్నైలో అధిక వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమిళులకు తనవంతు సహాయంగా 5000 మందికి సరిపడా ఆహార పదార్ధాలు మరియు ప్రస్తుతం వర్షాల కారణంగా నీళ్లు నిలిచిపోవడంతో దోమల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనాల కోసం "మస్కిటో రిపెల్లెంట్స్" సమకూర్చుతున్నారు.

తనవలె మరింత మంది చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తులు సహృదయంతో ముందుకొచ్చి చెన్నై వాసులకు తోడుగా నిలవాలని గౌటి హరినాధ్ కోరారు. తాను డేట్స్ మేనేజ్ చేస్తున్న ఆర్టిస్టుల నుంచి కూడా కొంత మొత్తాన్ని కలెక్ట్ చేసి.. త్వరలోనే తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు!

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved