pizza
Happy Life movie coming soon
"హ్యాపీ లైఫ్"గా పేరు మార్చుకున్న "నా పెళ్ళాం.. నా ఇష్టం"
You are at idlebrain.com > news today >
Follow Us

18 March 2016
Hyderaba
d

పోసాని కృష్ణ మురళి-సుహాసిని (జూనియర్) జంటగా నటించిన "నా పెళ్ళాం.. నా ఇష్టం" చిత్రం పేరు "హ్యాపీ లైఫ్"గా మార్చారు. రామకృష్ణ వీర్నాల దర్సకత్వంలో.. శ్రీ గౌరీదేవి సినీచిత్ర పతాకంపై ఎన్.దేవీచరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్సకత్వం వహించడంతో పాటు.. ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషించిన రామకృష్ణ వీర్నాల మాట్లాడుతూ.. "నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలు, ముఖ్యంగా వారు ఎదుర్కొంటున్న గృహ హింస నేపధ్యంలో.. మెసేజ్ ఓరియంటెడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన చిత్రం ఇది.

పోసాని, సుహాసినిల పెర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. "నా పెళ్ళాం నా ఇష్టం" టైటిల్ పై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో "హ్యాపీ లైఫ్" అనే టైటిల్ పెట్టాం. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు. కృష్ణ భగవాన్, విశ్వేశ్వర రావు, రామకృష్ణ వీర్నాల ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా; వెంకీ, సంగీతం: రమేష్, నిర్మాత: ఎన్.దేవీచరణ్, కథ-స్క్రీన్ ప్లే-డైలాగ్స్-దర్సకత్వం: రామకృష్ణ వీర్నాల !!


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved