pizza
Head Constable Venkatramaiah release for Sankranthi
సంక్రాంతి బ‌రిలోకి పీపుల్స్ స్టార్ ఆర్.నారాయ‌ణ‌మూర్తి `హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య‌`
You are at idlebrain.com > news today >
Follow Us

11 December 2016
Hyderaba
d

శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలిమ్స్ తెర‌కెక్కిస్తున్న చిత్రం `హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య‌`. పీపుల్స్ స్టార్ ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి, స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి నిర్మాత‌. చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ సినిమాను సంక్రాంతికి విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా...

స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ మాట్లాడుతూ - ``ప్రారంభంలో శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర పిలిమ్స్ బ్యాన‌ర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సినిమాలు చేశాను. చాలా గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ వారి బ్యాన‌ర్‌లో న‌టిస్తుండ‌టం ఆనందంగా ఉంది. ఈ సినిమాను చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావుగారు డైరెక్ట్ చేయ‌డం ఇంకా సంతోషంగా ఉంది. ఒక మంచి క‌థ‌ను రాసుకుని అందుకు త‌గిన విధంగా నారాయ‌ణ‌రావు, న‌న్ను, చ‌ల‌ప‌తిరావు వంటి న‌టీన‌టుల‌ను ఎంపిక చేసుకున్న చ‌దల‌వాడ శ్రీనివాస‌రావుగారు న‌టీన‌టుల నుండి ఆయ‌న‌కు కావాల్సిన అవుట్‌పుట్‌ను చ‌క్క‌గా రాబ‌ట్టుకుంటున్నారు. త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ఐడెండిటీని క్రియేట్ చేసుకున్న ఆర్‌.నారాయ‌ణ‌మూర్తిగారితో క‌లిసి న‌టిస్తున్నాను. సినిమా చాలా బాగా వ‌స్తుంది. ప్ర‌స్తుతం స‌మాజంలో ఉన్న కీల‌క‌మైన స‌మ‌స్య‌ను ఆధారంగా చేసుకుని తీస్తున్న ఈ సినిమా త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చేలా రూపొందుతోంది`` అన్నారు.

పీపుల్స్ స్టార్ ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి మాట్లాడుతూ - ``నాకు మ‌హాన‌టి సావిత్రిగారంటే చాలా ఇష్టం. అలాంటి మ‌హాన‌టి త‌ర్వాత నాకు స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ‌రాంటే అంత గౌర‌వం ఉంది. అలాంటి గొప్ప న‌టితో కలిసి ఈ సినిమాలో న‌టిస్తుండ‌టం నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్ర‌స్తుతం డిమానిటైజేష‌న్‌, న‌గ‌దు లావాదేవీలు త‌దిత‌ర అంశాల‌తో ఈ సినిమా ఉంటుంది. దీని గురించి ఒక సంవ‌త్స‌రం క్రిత‌మే చ‌ద‌ల‌వాడ‌గారు ఆలోచించి క‌థ రాసుకున్నారంటే ఆయ‌న ఆలోచ‌నా శ‌క్తికి హ్యాట్సాఫ్‌. మొదటిసారి డైరెక్ట్ చేస్తున్నా ఒక అనుభ‌వ‌మున్న డైరెక్ట‌ర్‌లా ప్ర‌తి సీన్‌ను చ‌క్క‌గా తీస్తున్నారు. అలాగే క్వాలిటీ విష‌యంలోఎక్క‌డా కాంప్ర‌మైజ్ కావ‌డం లేదు. సినిమాను మ‌రో టి.కృష్ణ‌లా ఆలోచించి అద్భుతంగా తెర‌కెక్కిస్తున్నారు`` అన్నారు.

ద‌ర్శ‌కుడు చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు మాట్లాడుతూ - ``దాంప‌త్యం అనే సినిమాను మొద‌టి సినిమాగా చేసిన‌ప్పుడు అందులో ఎ.ఎన్‌.ఆర్‌గారు, జ‌య‌సుధ‌గారు న‌టించారు. అప్ప‌టి నుండి జ‌య‌సుధ‌గారితో మా సంస్థ‌కు మంచి అనుబంధం కొన‌సాగుతుంది. అదే న‌మ్మ‌కంతో మా బ్యాన‌ర్‌లో రూపొందుతోన్న హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య చిత్రంలో న‌టిస్తున్నందుకు ఆమెకు థాంక్స్‌. టైటిల్ పాత్ర‌లో ఆర్‌.నారాయ‌ణ‌మూర్తిగారు న‌టిస్తుండ‌టం హ్యాపీగా ఉంది. ఇప్ప‌టికి సినిమా 80 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను సంక్రాంతికి విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.

ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి, జ‌య‌సుధ‌, సునీల్ శ‌ర్మ‌, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, త‌నికెళ్ల భ‌ర‌ణి, చ‌ల‌ప‌తిరావు, వెన్నెల కిశోర్‌, వై.విజ‌య‌, స‌మీర్‌, విజ‌య భాస్క‌ర్‌, విజ‌య్‌, పార్వ‌తి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ సినిమాకు సంగీతం: వందేమాత‌రం శ్రీనివాస్‌, డైర‌క్ట‌ర్ ఆఫ్ ఫోటోగ్ర‌ఫీ: కె.సుధాక‌ర్ రెడ్డి, ఎడిట‌ర్‌: మోహ‌న రామారావు, నృత్యాలు: శివ‌సుబ్ర‌హ్మ‌ణ్యం, ఫైట్స్: స‌తీష్ మాస్ట‌ర్‌, స‌మ‌ర్ప‌ణ‌: చ‌ద‌ల‌వాడ తిరుప‌తిరావు, నిర్మాత‌: చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి, క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved