pizza
Heroines about Affair
You are at idlebrain.com > news today >
Follow Us

27 October 2015
Hyderabad

‘మొదట్లో అభ్యంతరం చెప్పినవాళ్లే ఇప్పుడు అభినందిస్తున్నారు’
`‘ఎఫైర్‌’ జంట ప్రశాంతి-గీతాంజలి

తెలుగులో మొట్టమొదటిసారిగా.. ‘ఇద్దరమ్మాయి ప్రేమకథ’గా తెరకెక్కిన ‘ఎఫైర్‌’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 6న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శ్రీరాజన్‌ దర్శకత్వంలో భీమవరం టాకీస్‌ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ‘ఇద్దరమ్మాయిులు’గా ప్రశాంతి-గీతాంజలి నటించారు. ఈ చిత్రం విడుదలను పురస్కరించుకొని ఈ ఇద్దరు భామలు మీడియాతో ముచ్చటించారు. ముందుగా ప్రశాంతి మాట్లాడుతూ.. ‘ఈ చిత్ర దర్శకుడు శ్రీరాజన్‌ నాకు మంచి మిత్రుడు. తను నాకు ఈ స్టోరి నేరేట్‌ చేసినప్పుడు కొంచెం సంశయించాను. ఆ తర్వాత.. ధైర్యం కూడగట్టుకొని ఈ సినిమా చేసాను. ఓ అమ్మాయి ప్రేమలో పడే మరో అమ్మాయి పాత్రను ‘ఎఫైర్‌’లో నేను పోషిస్తున్నానని తెలిసినప్పుడు అందరూ అభ్యంతరం వ్యక్తం చేసారు. కానీ.. ఇప్పుడు వాళ్ళే అభినందిస్తున్నారు. సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులు కూడా అభినందిస్తారనే నమ్మకం ఉంది. ముఖ్యంగా రాంగోపాల్‌వర్మగారు ఈ సినిమా రష్‌ చూసి.. నాకు ఫోన్‌ చేయడం నేనెప్పటికీ మర్చిపోలేను. ఇంగ్లీషు, లేక హిందీలో మాత్రమే ఇటువంటి బోల్డ్‌ సబ్జెక్ట్స్‌తో సినిమాలు ఎందుకు రావాలి? మన తెలుగులో ఎందుకు రాకూడదన్న పట్టుదలతో ఈ సినిమా చేసాం’ అంది.

మరో కథానాయకి గీతాంజలి మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు నేను చేసినవి కొద్ది సినిమాలే అయినా.. వాటన్నిటిలో అబ్బాయితో మాత్రమే రొమాంటిక్‌ సీన్స్‌ చేసాను. కానీ.. ‘ఎఫైర్‌’ సినిమాలో మరో అమ్మాయితో ‘ఎఫైర్‌’ పెట్టుకొనేదానిగా నటించడం (నవ్వుతూ) ముందు కొంచె ఇబ్బంది అనిపించినా.. ఇప్పుడు మాత్రం చాలా ధ్రిల్లింగ్‌ ఉంది. ఆడియన్స్‌ కూడా చాలా వెరయిటీగా ఫీలవుతారు. అలా అని ఈ చిత్రంలో ఎక్కడా అసభ్యత అనేది ఉండదు. నా క్యారెక్టర్‌ ఇలా ఉంటుందని తెలిసి.. మొదట్లో నన్ను చాలామంది భయపెట్టారు. కానీ.. ఇప్పుడు ఈ సినిమా ‘టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ’ అయ్యాక అందరూ అభినందిస్తున్నారు. మా నిర్మాత రామసత్యనారాయణగారికి, మా దర్శకులు శ్రీరాజన్‌గారిని ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అన్నారు!!


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved