pizza
Hollywood stunt masters for Varun Tej - Sankalp Reddy Film
వరుణ్ తేజ్, సంకల్ప్ రెడ్డి సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్
You are at idlebrain.com > news today >
Follow Us

5 June 2018
Hyderabad

హీరో వరుణ్ తేజ్, దర్శకుడు సంకల్ప్ రెడ్డి కాంినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, ఆడితిరావు హైదరీ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేం ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో హాలీవుడ్ తరహా స్టంట్స్ ఉండబోతున్నాయి. స్వయంగా హాలీవుడ్ నుంచి వచ్చిన స్టంట్ టీం ఆధ్వర్యంలో ఈ చిత్ర షూటింగ్ జరిగింది. హీరో వరుణ్ తేజ్ చేత వీరు కొన్ని అద్భుతమైన స్టంట్స్ చేయించడం జరిగింది. ఆ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తి కావడంతో హాలీవుడ్ స్టంట్ యూనిట్ తో వరుణ్ తేజ్ చివరి రోజు గడిపిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాళ్ళతో కలసి పనిచేయడం మధురమైన అనుభూతి అని వరుణ్ తేజ్ తెలిపారు.

ఈ చిత్రం కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ జిబెక్, టోడోర్ లాజరవ్ (జూజి), మరియు రోమన్ వర్క్ చెయ్యడం జరిగింది. హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ అధితి రావ్ హైద్రి పై 3డి స్కాన్ చెయ్యడం జరిగింది. సినిమాకు ఈ టెక్నాలజీ మరింత హెల్ప్ కానుంది. గతంలో వీరు ఎక్ష్పపాండబుల్స్2, ట్రాయ్, జీరో డార్క్ థట్టి, హీర్సులేస్, ది ఇంవీసిబుల్, లొవింగ్ పాబ్లో, రీబార్న్, స్నిప్పెట్, మార్కో పోలో, గేమ్ అఫ్ త్రోన్స్ వంటి హాలివుడ్ చిత్రాలకు వీరు పని చేసారు. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ స్టంట్స్ డూప్స్ లేకుండా ఒరిజినల్ గా చెయ్యడం జరిగింది.

నటీనటులు:
వరుణ్ తేజ్, అదితిరావ్ హైదరీ, లావణ్య త్రిపాఠి, సత్యదేవ్, రాజా, అవసరాల శ్రీనివాస్, రెహ్మాన్ (రఘు) తదితరులు.

సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: సంకల్ప్ రెడ్డి.
నిర్మాతలు: రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి
కెమెరా:జ్ఞానశేఖర్ వి.ఎస్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
ప్రొడక్షన్ డిజైనర్స్: రామకృష్ణ సబ్బాని- మౌనిక నిగొత్రే సబ్బాని
సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారీ
డైలాగ్స్: కిట్టు విస్సాప్రగడ
కాస్ట్యూమ్స్: అశ్వంత్ బైరి
స్టంట్స్: టోడోర్ లాజారోవ్, సి.జి: రాజీవ్ రాజశేఖరన్
ఎస్.ఎఫ్.ఎక్స్: మైష్ త్యాగి
పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్

 

 

 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved