pizza
Howrah Bridge shooting completed
రాహుల్ రవీంద్రన్ హౌరా బ్రిడ్జ్ షూటింగ్ పూర్తి
You are at idlebrain.com > news today >
Follow Us

11 September 2017
Hyderabad

శ్రీ వడ్డేపల్లి సత్యనారాయణ ఆశీర్వచనాలతో ... ఈ ఎమ్ వి ఈ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ బ్యానర్ పై రాహుల్ రవీంద్రన్, చాందినీ చౌదరీ, మనాలీ రాథోడ్ హీరో హీరోయిన్లుగా రేవన్ యాదు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం హౌరా బ్రిడ్జ్. విభిన్నమైన కథలతో దూసుకెళ్తున్న రాహుల్ రవీంద్రన్ మరో ఇంట్రస్టింగ్ స్టోరీతో మనముందుకు వస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆడియో లాంచ్ చేసి... రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. ఫస్ట్ లుక్ టైటిల్ తో సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి.

ఈ సందర్భంగా హీరో రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ... హౌరా బ్రిడ్జ్ అనే టైటిల్ పెట్టడం వెనక పెద్ద రీజన్ ఉంది. కానీ ఇప్పుడు రివీల్ చేయలేం. హ్యూమన్ రిలేషన్స్ కి ఈకథ బ్రిడ్జ్ గా ఉంటుంది. ఇందులో మరో బ్రిడ్జ్ కూడా ఉంటుంది. అది ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. చాందినీ చౌదరి ఇందులో చాలా మంచి క్యారెక్టర్లో నటించింది. మనాలీ రాథోడ్ కి ఈ సినిమా చాలా మంచి పేరు తెస్తుంది. దర్శకుడు రేవన్ చాలా క్లారిటీతో ఉన్నాడు. అధ్బుతమైన విజువల్స్ మిమ్మల్ని వండర్ చేస్తాయి. చిత్ర షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నా కెరీర్లో అందరూ మెచ్చుకునే చిత్రంగా నిలుస్తందనే నమ్మకం ఉంది. అని అన్నారు.

దర్శకుడు రేవన్ మాట్లాడుతూ... ఇది నా రెండో ప్రాజెక్ట్. బూచమ్మ బూచోడు నాకు చాలా మంచి పేరు తెచ్చింది. రాహుల్ రవీంద్రన్ చాలా మంచి పెర్ ఫార్మర్. ఇది బ్రిడ్జ్ నేపథ్యంలో సాగే ఇంట్రస్టింగ్ స్టోరీ. అందుకే హౌరా బ్రిడ్జ్ అని పెట్టాం. సినిమా చాలా బాగా వచ్చింది. చిత్ర షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే గ్రాండ్ గా ఆడియో లాంచ్ చేస్తాం. రిలీజ్ డేట్ ను కూడా త్వరలోనే ప్రకటించబోతున్నాం. ఈ సినిమా అందరికీ మంచి పేరు తెచ్చేదిగా ఉంటుంది. ప్రతీ క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉంటుంది. అని అన్నారు.

నటీనటులు
రాహుల్ రవీంద్రన్
చాందినీ చౌదరి
మనాలీ రాథోడ్
రావ్ రమేష్
అజయ్
ఆలీ
పోసాని కృష్ణ మురళి
ప్రభాస్ శ్రీను,
విద్యుల్లేఖ
జబర్దస్త్ రాకింగ్ రాకేష్ తదితరులు

టెక్నీషియన్స్
శ్రీ వడ్డేపల్లి సత్యనారాయణ ఆశీర్వచనాలతో
మ్యూజిక్ డైరెక్టర్ - శేఖర్ చంద్ర
సినిమాటోగ్రాఫర్ - విజయ్ మిశ్రా
ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాత - ఈ ఎమ్ వి ఈ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్
స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - రేవన్ యాదు


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved