pizza
మిర్రర్ మీడియా కొత్త చిత్రం "ఇదేదో బాగుంది "
You are at idlebrain.com > news today >
Follow Us

09 September 2014
Hyderabad

ఇటీవలే టాలీవుడ్ సూపర్ హీరోయిన్ కాజల అగర్వాల్ చేతుల మీదుగా ఆడియో విడుదలయ్యి సూపర్ సక్సెస్ అయ్యిన "పిచ్చేక్కిస్తా.." సినిమా నిర్మాత నటరాజ్ కొట్టూరి నిర్మాతగా , మిర్రర్ మీడియా పతాకం పై , స్వీట్ మిర్చిస్ స్టూడియోస్ సమర్పణలో మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు . ఆ చిత్రం పేరు "ఇదేదో బాగుంది " .. ఈ చిత్రం లో సూర్య శ్రీనివాస్ హీరో గా పరిచయం అవుతున్నాడు, ఈ చిత్రానికి స్.స్ .సాహిత్ దర్శకత్వం చేస్తున్నారు

ఈ సందర్భం గా నిర్మాత మాట్లాడుతూ" మా బ్యానర్ మిర్రర్ మీడియా లో నిర్మించిన "పిచ్చేక్కిస్తా.." చిత్రాన్ని అక్టోబర్ లో విడుదల చేస్తున్నాము, మా మరో చిత్రం "ఇదేదో బాగుంది " అనే సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో ప్రముఖ కమెడియన్ విలక్షణమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం లో సూర్య శ్రీనివాస్ హీరోగా చేస్తుండగా , శివాని సింగ్ ని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాము స్.స్.సాహిత్య దర్శకుడిగా గా పరిచయమవుతున్నాడు . ప్రముఖ సంగీత దర్శకుడు గంటశాల విశ్వనాద్ సంగీత సారధ్యం లో పాటల రికార్డింగ్ పూర్తయ్యింది . సినిమా ని అతి త్వరలో సెట్స్ మీదకి తీసుకువేళతాము " అని తెలిపారు.

 

 


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved