pizza
Ido Prema Lokam re-recording completed
రీ-రికార్డింగ్ పూర్తి చేసుకున్న 'ఇదో ప్రేమ లోకం'
You are at idlebrain.com > news today >
Follow Us

8 December 2016
Hyderaba
d

శ్రీ శ్రీనివాసా ఫిలింస్‌ బ్యానర్‌లో ఎస్‌.పి. నాయుడు నిర్మాతగా సెన్సేషనల్‌ దర్శకుడు కోడిరామకృష్ణ శిష్యుడైన టి. కరణ్‌రాజ్‌ దర్శకత్వంలో అశోక్‌చంద్ర(నూతనపరిచయం), రాజా సూర్యవంశీ, తేజారెడ్డి, కారుణ్య హీరోహీరోయిన్లుగా రూపుదిద్దుకున్న చిత్రం 'ఇదో ప్రేమ లోకం'. ఈ చిత్రం ప్రస్తుతం రీ-రికార్డింగ్ పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు టి. కరణ్‌రాజ్‌ మాట్లాడుతూ..ఇదో అందమైన ప్రేమకథ. ప్రియుడికి ఇచ్చిన మాటకోసం తన వాళ్ళను వదులుకుని, ఓ రాతి మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ఓ మేఘమాల కథ. నేను రాసుకున్న కథను నమ్మి..ఈ కథను చిత్రంగా మలిచేందుకు నిర్మాత ఎస్‌.పి. నాయుడు గారు ఎంతగానో సహకరించారు. ఖర్చుకు వెనకాడకుండా అందమైన లోకేషన్లలో చిత్రాన్ని తీర్చిదిద్దేందుకు ఆయన ఎంతగానో తోడ్పడ్డారు. అలాగే ఈ ప్రేమలోకానికి నటీనటులు, టెక్నిషియన్లు ఇచ్చిన సహకారం మర్చిపోలేనిది. తప్పకుండా ప్రేక్షకులు మెచ్చే ఓ మంచి ప్రేమకథా చిత్రంగా ఈ చిత్రం ఉంటుంది..అని అన్నారు.

నిర్మాత ఎస్‌.పి. నాయుడు మాట్లాడుతూ.. దర్శకుడు కరణ్‌రాజ్‌ ఓ మంచి కథా చిత్రాన్ని మా బ్యానర్‌ ద్వారా ఇవ్వబోతున్నందుకు సంతోషంగా ఉంది. ప్రత్యేకపాత్రలో నటించిన సుమన్‌ మరియు నరేష్‌ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వందేమాతరం శ్రీనివాస్‌ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ప్రస్తుతం రీ-రికార్డింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. న్యూ ఇయర్ మొదటి వారం లో ఆడియోని, అలాగే జనవరి ఎండింగ్ లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము. తప్పకుండా ప్రేక్షకులు మెచ్చే ఓ మంచి చిత్రంగా 'ఇదో ప్రేమ లోకం' ఉంటుందని తెలుపుతున్నాము..అని అన్నారు.

అశోక్‌చంద్ర(నూతనపరిచయం), రాజా సూర్యవంశీ, తేజారెడ్డి, కారుణ్య, సుమన్‌, నరేష్‌, భగవాన్‌, మెల్కోటి, దేవిశ్రీ, ప్రభావతి, ఎస్‌.పి. నాయుడు, బాలనటుడు టి. చంద్రమహేష్‌, టి. అశోక్‌కుమార్‌ మొదలగువారు నటించిన ఈ చిత్రానికి సంగీతం: వందేమాతరం శ్రీనివాస్‌, ఎడిటింగ్‌: నందమూరి హరి, కెమెరా: కె. శివ, కో-డైరెక్టర్‌: దుర్గేష్‌, నిర్మాత: ఎస్‌.పి. నాయుడు, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: టి. కరణ్‌రాజ్‌


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved