pizza
Aadhi Pinisetty interview (Telugu) about Rangasthalam
`రంగ‌స్థ‌లం` బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డానికి చ‌ర‌ణ్‌, సుకుమార్‌లే కార‌ణం - ఆది పినిశెట్టి
You are at idlebrain.com > news today >
Follow Us

3 April 2018
Hyderabad

రామ్‌చరణ్‌, సమంత జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, సివిఎం(మోహన్‌) నిర్మించిన చిత్రం 'రంగస్థలం'. సినిమా మార్చి 30న విడుదలైంది. సినిమాలో కుమార్‌ బాబు అనే కీలక పాత్రలో నటించి ఆది పినిశెట్టి 'రంగస్థలం' సినిమా గురించి పాత్రికేయులతో మాట్లాడుతూ ......

అదే కారణం...
- మా ఫ్యామిలీకి చెందిన ఫంక్షన్‌ ఒకటి అటెండ్‌ కావాల్సి వచ్చింది. అలాగే ఓ ఫోటో షూట్‌ కూడా ఉండటంతో 'రంగస్థలం' థాంక్స్‌ మీట్‌కు అటెండ్‌ కాలేకపోయాను. ఓ సినిమా మంచి సక్సెస్‌ సాధించిన తర్వాత నేను స్పందించాల్సిన అవసరం ఉందనిపించి ఈరోజు నేను హైదరాబాద్‌కు వచ్చాను.

ప్రేక్షకుల రెస్పాన్స్‌ భయాన్ని పెంచుతుంది...
- 'సరైనోడు' సినిమా నుండి నేను చేస్తున్న ప్రతి రోల్‌కి ట్రెమెండస్‌ రెస్పాన్స్‌ వస్తుంది. అలాగే నిన్నుకోరి, అజ్ఞాతవాసి.. ఇప్పుడు రంగస్థలంలో కుమార్‌బాబు రోల్‌కు వస్తున్న రెస్పాన్స్‌ చూసి నటుడిగా చాలాహ్యాపీగా అనిపించింది. ఒక నటుడికి ఇంత కంటే ఏం కావాలనిపిస్తుంది. ఈ రెస్పాన్స్‌ నాలో భయాన్ని పెంచుతుంది. దాని వల్ల ఇంకా ఎక్కువ జాగ్రత్తగా, బాధ్యతగా ఉండేలా చేస్తుంది.

రివ్యూవర్స్‌ నా టీచర్స్‌...
- ప్రతి రివ్యూను నేను చాలా జాగ్రత్తగా చదువుతాను. ఎందుకంటే రివ్యూవర్స్‌ అనేవారిని టీచర్స్‌గా ఫీలవుతాను. వారు చెప్పే విషయాలను గమనించి నా తదుపరి సినిమాలో సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాను. కుమార్‌బాబు క్యారెక్టర్‌ బాగా చేశానని అందరూ అంటుంటే..రివ్యూవర్స్‌ చెప్పిన కారణాలతో నాలో తప్పులను సరిదిద్దుకుంటూ వస్తున్నాను.

కథ విన్న వెంటనే....
- సాధారణంగా ఏ దర్శకుడైనా కథను కష్టపడి తయారు చేసుకుంటాడు. కాబట్టి కథ విన్న వెంటనే బావుంది.. బాగాలేదు అని చెప్పకుండా ఓరోజు సమయం తీసుకుని.. ఆలోచిస్తాను.. నేను ఆ క్యారెక్టర్‌కు ఎంత వరకు న్యాయం చేస్తానని ఆలోచిస్తాను. ఇక రంగస్థలం సినిమా విషయానికి వస్తే.. ఈ కథను సుకుమార్‌గారు రెండు గంటల పాటు సుకుమార్‌గారు నాకు కథను నెరేట్‌ చేశారు. కథ విని టైం తీసుకోకుండా.. సార్‌! నేను సినిమా చేస్తున్నానని చెప్పేస్తాను.

బెస్ట్‌ డైరెక్టర్‌...
- ఈ మధ్య కాలంలో చాలా మంచి సినిమాలు వస్తున్నాయి. కాదనను!.. అయితే నిజాయితీ కలగలిసిన సినిమా వచ్చి.. చాలా కాలమవుతుంది. మనం థియేటర్‌లో కూర్చుని సినిమాలో ఇన్‌వాల్వ్‌ అయ్యి ఏడవటం అనే ఎమోషన్స్‌ ఫేస్‌ చేసి చాలా కాలమవుతుంది. సుకుమార్‌గారు స్క్రిప్ట్‌ చెప్పడం ఒక ఎత్తు.. స్క్రిప్ట్‌ను సినిమాగా తీయడం మరో ఎత్తు. సుకుమార్‌గారితో తొలిసారి పనిచేస్తున్నప్పుడు చాలా విషయాలు నా మెదడులో రన్‌ అవుతుండేవి. నేను చేసినవి.. కొన్ని సినిమాలే అయినా.. నేను పనిచేసిన దర్శకుల్లో బెస్ట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌గారు. కథ చెప్పిన దగ్గర నుండి సినిమా రిలీజ్‌ అయ్యి కలెక్షన్స్‌ వచ్చే వరకు ఆయనలో ఓ చిన్న టెన్షన్‌ ఉంటుంది. ఫిలిం మేకర్‌లో ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆయనలో చూసి.. సినిమాలంటే ఎంత ప్యాషన్‌గా ఉండాలో నేర్చుకున్నాను. సినిమాలో చరణ్‌, నేను, జగపతిబాబు సహా అందరం బాగా నటించామంటే అందుకు కారణం సుకుమార్‌గారు మాత్రమే. ఆయన చెప్పినట్లు చేసుకుంటూ వెళ్ళిపోయాను.

చరణ్‌ను తప్ప మరొకరికి ఊహించుకోలేను...
- చిట్టిబాబు క్యారెక్టర్‌లో చరణ్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేక పోతున్నాను. చరణ్‌ చేసినంత ఈజ్‌తో, డెప్త్‌తో మరో నటుడిని ఊహించ లేకపోతున్నాను. చిట్టిబాబు క్యారెక్టర్‌ను చేయడం అంత సులువు కాదు. పాక్షికంగా చెవుడు ఉండి కామెడీ చేస్తూ..ఎమోషన్స్‌ను క్యారీ చేస్తూ.. ఇలా అన్నింటినీ కరెక్ట్‌గా బాలెన్స్‌ చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుందంటే అందుకు కారణం చరణ్‌, సుకుమార్‌లే కారణం. సినిమా అంతటినీ తన భుజాలపై మోసినందుకు చరణ్‌కు హ్యాట్సాఫ్‌. నా ఫ్యామిలీలో నేను, అన్నయ్య ఉంటాం.. నాకు ఓ చిన్న తమ్ముడు ఉంటే బావుండేదనిపించింది. ఈసినిమాతో నాకు ఓ తమ్ముడు దొరికినట్టు అయ్యింది.

interview gallery



మంచి టీం వర్క్‌...
- సమంత ఇప్పటి వరకు చూడని నెటివిటీ యాంగిల్‌లో నటించింది. చాలా అందంగా, స్థిరత్వంలో పెర్ఫామెన్స్‌ చేసింది. అలాగే జగపతిబాబుగారు, అనసూయగారు సహా ప్రతి ఒక్కరూ అద్భుతంగా చేశారు. ఇక సినిమాలో సంగీతం, సినిమాటోగ్రఫీ, ఆర్ట్‌ వర్క్‌, ఎడిటింగ్‌ ఇలా అన్ని డిపార్ట్‌మెంట్స్‌ చాలా బాగా కష్టపడ్డాయి. విలేజ్‌ను రత్నవేలుగారు చాలా అందంగా చూపించారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్‌ 1980 ఇన్‌ట్రుమెంట్స్‌తో ఇచ్చిన సంగీతం ఇప్పటి ప్రేక్షకులను మెప్పించారు. మంచి టీం కలిసి చేసిన మంచి ప్రయత్నం. మైత్రీ మూవీ మేకర్స్‌ బెస్ట్‌ ప్రొడక్షన్‌ హౌస్‌. పీరియాడికల్‌ మూవీ చేయాలంటే ఓపికుండాలి. వాళ్లు ఎంతో కాన్ఫిడెంట్‌ ఇవ్వడం వల్లనే సినిమా యూనిట్‌ అంతా ముందుకెళ్లాం. సీనియర్‌ నరేశ్‌, రోహిణి ప్రతి ఒక్కరూ ఇన్‌వాల్వ్‌మెంట్‌ అయ్యి నటించారు.

అమ్మ నాన్నకు చెప్పలేదు...
- 'రంగస్థలం' సినిమాలో కుమార్‌బాబు అనే క్యారెక్టర్‌ చనిపోతుందని నా అమ్మనాన్నలకు చెప్పలేదు. ముందుగానే చెప్పి ఉంటే వాళ్లు వద్దని అనేవాళ్లు. నిజానికి నేను కుమార్‌బాబుని ఓ క్యారెక్టర్‌గానే చూశాను. నన్ను ఎక్కడా ఇన్‌ఫ్లూయెన్స్‌ చేయదనిపించింది. అలాగే నేను ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్‌కు దగ్గరగా లేని ఓ క్యారెక్టర్‌ అది. ఇప్పటి వరకు చేయని రోల్‌. పెర్ఫామెన్స్‌కు స్కోప్‌ ఉండే రోల్‌.

ఆ తేడా చూడను...
- మనం చేసే క్యారెక్టర్‌ బావుందా? లేదా? అనే చూస్తాను. అది నెగిటివ్‌గా ఉందా.. పాజిటివ్‌గా ఉందా? అని ఆలోచించను. ఒక నటుడిగా నా జాబ్‌కు ఎంత వరకు న్యాయం చేశానని ఆలోచిస్తాను. అది హీరో కావచ్చు.. మరేదైనా క్యారెక్టర్‌ కావచ్చు. నేను అన్ని రోల్స్‌ చేస్తున్నాను. మంచి రోల్స్‌ వచ్చినప్పుడు ఎందుకు వదుకోవాలనే చిన్న సార్ధపు ఆలోచన కూడా ఉంది. కొన్ని లిమిట్స్‌ పెట్టుకుని ఉండుంటే మంచి పాత్రలు చేసుండేవాడిని కాను.

తదుపరి చిత్రాలు..
- నేను, తాప్సీ, రితిక సింగ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా చేస్తున్నాను. అలాగే రెండు ద్విభాషా చిత్రాలు చేస్తున్నాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved