pizza
Aadhi Pinisetty interview about Sarrainodu success
విలన్ గా కూడా నటించడానికి సిద్ధమే – ఆది పినిశెట్టి
You are at idlebrain.com > news today >
Follow Us

23 April 2016
Hyderaba
d


ఒక విచిత్రం చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తర్వాత వైశాలి అనే ద్విభాషా చిత్రంతో తెలుగు, తమిళంలో సక్సెస్ అందుకున్నాడు యంగ్ హీరో ఆది పినిశెట్టి. రీసెంట్ గా మలుపుతో మరో సక్సెస్ ను కైవసం చేసుకున్నాడు. తెలుగు, తమిళంలో బిజీగా ఉన్న ఈ హీరో ఇప్పుడు బన్ని, బోయపాటి కాంబినేషన్ లో విడుదలైన సరైనోడులో విలన్ గా నటించాడు. ఆది పినిశెట్టి నటనను ఇటు ప్రేక్షకులు, అటు అభిమానులు అందరూ బావుందని ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్ లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆది పినిశెట్టి సినిమా గురించి, తన పాత్ర గురించి ముచ్చటించారు....

విలన్ అయినా సిద్ధమే...
కథ బావుండి, పెర్ ఫార్మెన్స్ కు స్కోప్ ఉంటే హీరోగానే చేయాలనేం లేదు. నేను విలన్ గా కూడా నటించడానికి సిద్ధమే. ఎందుకంటే సినిమాల్లో మంచి సినిమా, చెడ్డ సినిమా తప్ప పెద్ద బడ్జెట్, చిన్న బడ్జెట్ సినిమాలు లేవు. సరైనోడు విషయంలో అరవింద్ గారు ఫోన్ చేసి కథ విని నచ్చితేనే యాక్ట్ చేయమని చెప్పారు. నేను 25 నిమిషాల పాటు కథ వినగానే యాక్ట్ చేయగానే ఒప్పుకున్నాను.

తమిళంలో కూడా...
సరైనోడు చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, తమిళనాడులో సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా, కమర్షియల్ సినిమా అయినా చాలా గ్రాండ్ ఉందని, తనీ ఒరువన్ సినిమాలో అరవింద్ స్వామి రోల్ లా ఉందని అక్కడున్న నా మిత్రులు ఫోన్ చేసి అభినందించారు.

బోయపాటిగారిని ఫాలో అయ్యానంతే....
నేను ఇప్పటి వరకు హీరోగానే చేశాను. విలన్ గా ఎలా చేయాలో అని ఆలోచించాను. ప్రాక్టీస్ చేశాను. అయితే షూటింగ్ స్పాట్ కు వెళ్లగానే బోయపాటిగారి మైండ్ లోని విలన్ ఇంకా పవర్ ఫుల్ గా కనిపించాడు. దాంతో నేను ప్రాక్టీస్ చేసిందంతా మరచిపోయి, ఆయన్ను ఫాలో అయ్యానంతే.

Aadhi Pinisetty interview gallery

బన్నికి బాగా నచ్చింది....
నాకు, బన్నికి మధ్య ఆరోగ్యకరమైన డిస్కషన్స్ జరిగేవి. బన్నికి నా రోల్ బాగా నచ్చింది. వేరే లాంగ్వేజ్ లో సినిమాను రీమేక్ చేస్తే అందులో విలన్ నటిస్తానన్నాడు.

బన్ని హార్డ్ వర్క్ ..
సరైనోడు విషయంలో బన్ని చాలా హార్డ్ వర్క్ చేశాడు. విలన్ కంటే హీరోయే ఎక్కువగా కష్టపడాలి. డ్యాన్సులు, ఫైట్స్ అన్నీ చేయాలి. ఈ సినిమాను బన్ని తన భుజాలపై మోశాడు.

అదే బెస్ట్ కాంప్లిమెంట్...
సినిమా చూసిన తర్వాత ఇండస్ట్రీ నుండి చాలా మంది ఫోన్ చేశారు. వినాయక్ గారు ఫోన్ చేసి అభినందించారు. అయితే చిరంజీవిగారు ఫోన్ చేసి అభినందించారు. నా లుక్, స్టయిల్, డైలాగ్స్ ఇలా అన్నింటి గురించి మెచ్చుకున్నారు. ఆయన అప్రిసియేషనే బెస్ట్ కాంప్లిమెంట్ గా భావిస్తున్నాను.

పెళ్లి గురించి...
(నవ్వుతూ)త్వరలోనే జైలు కెళ్లబోతున్నాను...అదేనండీ పెళ్లి చేసుకోబోతున్నాను. ఇంట్లో పెళ్లి ప్లాన్స్ జరుగుతున్నాయి. తెలుగమ్మాయినే పెళ్లి చేసుకుంటా, అది కూడా ఎరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటాను.

నెక్ట్స్ మూవీస్...
అన్నయ్య సత్య ప్రభాస్ తో సినిమా చేయాలనుంది. అలాగే రెండు సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. సినిమాలో మంచి కాన్సెప్ట్ తో పాటు, కమర్షియల్ ఎలిమెంట్ ఉండేలా చూసుకుంటాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved