pizza
Adah Sharma interview about Kshanam
‘క్షణం’లో చాలా టఫ్ క్యారెక్టర్ చేశాను - ఆదాశర్మ
You are at idlebrain.com > news today >
Follow Us

22 February 2016
Hyderaba
d

టాలీవుడ్ నిర్మాణ రంగంలో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి బ్యానర్ రియలిస్టిక్ కాన్సెప్ట్ మూవీస్ నిర్మించే దిశగా అడుగులు వేస్తుంది. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ తో కలిసి నిర్మించిన సస్పెన్స్ డ్రామా ‘క్షణం’. అడవిశేష్, ఆదాశర్మ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ సరికొత్త పాత్రలో కనపడుతుంది. ఈ సినిమా ఫిభ్రవరి 26న విడుదల అవుతుంది. ఈ సందర్భంగా ఆదాశర్మతో ఇంటర్వ్యూ....

క్యారెక్టర్ గురించి...
-'1920' సినిమా తర్వాత అలాంటి కష్టమైన క్యారెక్టర్ చేసిన సినిమా ‘క్షణం’. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ చేస్తానని నేను ఇమేజినేషన్ చేయలేదు. చాలా టఫ్ క్యారెక్టర్ చేశాను. రెండు షేడ్స్ ఉంటుంది. మ్యారేజ్ కు ముందు ఒక పాత్ర ఉంటే, పాప పుట్టిన తల్లిలాంటి మరో క్యారెక్టర్ చేశాను. ఆడియెన్స్ కు క్యారెక్టర్ కనెక్ట్ కావడానికి చాలా కష్టపడ్డాను.

Adah Sharama interview

మదర్ క్యారెక్టర్ గురించి...
-‘క్షణం’ సినిమాలో మదర్ క్యారెక్టర్ చేశానా? లేదా? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. అంటే ఈ నెల 26వరకు వెయిట్ చేయాల్సిందే. అందుకే ట్రైలర్ లో శ్వేతా నీకు అసలు కూతురు ఉందా? అనే చిన్న ట్విస్ట్ ఇచ్చాం. అది తెలుసుకోవాలంటే సినిమా తప్పకుండా చూడాల్సిందే. చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. ఏం జరుగుతుందో ఎక్స్ పెక్ట్ చేయని విధంగా సాగే సబ్జెక్ట్. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కాదు, డ్యాన్సులు, ఐటెంసాంగ్స్ ఏవీ లేవు. తెలుగు ప్రేక్షకులకు డిఫరెంట్ మూవీ అవుతుందని కచ్చితంగా చెప్పగలను.

ఇన్ స్పిరేషన్ మూవీ కాదు...
-ఏ ఇతర సినిమా షేడ్స్ లేవు. బాలీవుడ్ మూవీ ‘కహనీ’ షేడ్స్ ఉన్నాయంటున్నారు, కానీ అలా ఏం ఉండదు. సినిమా చూస్తే అవగతమవుతుంది. అయితే రెండు సినిమాలు థ్రిల్లర్ మూవీస్, అంతే తప్ప క్షణం వేరే సినిమాలను ఇన్ స్పిరేషన్ గా తీసుకుని చేయలేదు.

రీసెర్చ్ ఏమీ చేయలేదు....
-దర్శకుడు రవికాంత్ పేరెపును కలిసినప్పుడు తను నా క్యారెక్టర్ ఎలా ఉండాలో ఎక్స్ ప్లెయిన్ చేశాడు. లుక్ పరంగా శ్రద్ధ తీసుకున్నాను. కానీ ఎటువంటి రీసెర్చ్ చేయలేదు. కాలేజ్ లో బబ్లీగా ఉండే పాత్ర అయితే, ప్రెజంట్ లో బబ్లీగా కనపడను. రెండు డిఫరెంట్ షేడ్స్. ప్రెజెంట్ పోర్షన్ ను ముందుగా షూట్ చేశాం. ఇలాంటి రోల్ నాకు ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు, శేష్ కు థాంక్స్. దర్శకుడు రవికాంత్ సినిమాకు ముందు ప్రతి పాత్ర గురించి అందరితో బాగా డిస్కస్ చేయడంతో అడివిశేష్, సత్య సహా అందరూ చాలా నేచురల్ గా చేశారు.

నిర్మాతలు గురించి...
-పివిపి బ్యానర్ ఇలాంటి సినిమాను బ్యాకింగ్ గా నిలవడం మా లక్ అనాలి. ఇలాంటి పెద్ద బ్యానర్ ఈ సినిమాకు బ్యాకింగ్ ఉండబట్టే ఈ సినిమా చేయడానికి కారణమని చెప్పాలి.

అనసూయతో కలిసి నటించడం గురించి...
-అనసూయ చాలా బ్యూటిఫుల్ తన పాత్ర పరంగా చాలా చక్కగా యాక్ట్ చేసింది. తను రియల్లీ టాలెంటెడ్ పర్సన్. ఈ సినిమా విషయానికి వస్తే చాలా కీలకపాత్ర చేసింది. ఇది నార్మల్ మూవీ కాదు. ప్రతి పాత్రకు గుర్తింపు ఉంటుంది. నేను, అనసూయ కలిసి యాక్ట్ చేయలేదు.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved