pizza
Allari Naresh interview (Telugu) about Meda Meedha Abbayi
'మేడ మీద అబ్బాయి`...ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ - అల్లరి నరేష్‌
You are at idlebrain.com > news today >
Follow Us

07 September 2017
Hyderabad

అల్లరి నరేష్‌ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం 'మేడమీద అబ్బాయి'. ప్రజిత్‌ దర్శకత్వం వహించారు. నిఖిలా విమల్‌ కథానాయిక. జాహ్నవి ఫిల్మ్స్‌ పతాకంపై బొప్పన చెంద్రశేఖర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 8న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో అల్లరి నరేష్‌తో ఇంటర్వ్యూ...

కొత్తగా ట్రై చేశాను...
- 'మేడ మీద అబ్బాయి' సినిమాకు మాతృక 'ఒరు వడక్కిల్‌ సెల్ఫీ' సినిమా చూశాను. చాలా బాగా నచ్చింది. ఇప్పటి వరకు కామెడీ సినిమాలే ఎక్కువగా చేస్తూ వచ్చాను. కామెడీలో హారర్‌ మిక్స్‌ అయిన సినిమాలు, స్పూఫ్‌ కామెడీ సినిమాలు చేశాను. కామెడీలో లిమిటెడ్‌ క్యారెక్టరైజేషన్స్‌ ఉంటాయి. దాంట్లో వేరియేషన్‌ చూపాలంటే కొత్తదనం ఉండాలి. సాధారణంగా నాకు థ్రిల్లర్‌ జోనర్‌ సినిమాలంటే కాస్తా భయం. 'ఒరు వడక్కిల్‌ సెల్ఫీ' సినిమా చూసినప్పుడు కామెడీతో పాటు థ్రిల్లర్‌ కూడా మిక్స్‌ అయ్యి ఉండటం గమనించాను. ఈ రెండింటి కాంబినేషన్‌లో సినిమాలు రేర్‌గా ఉంటాయి. మలయాళంలో సినిమా సోల్‌ బావుంటుంది. సినిమాను రీమేక్‌ చేస్తున్నప్పుఉడు సినిమాలో సోల్‌ను చక్కగా ఉండేలా హ్యాండిల్‌ చేసుకుంటే సరిపోతుందనిపించింది. అందుకనే మలయాళ మాతృకను డైరెక్ట్‌ చేసిన ప్రజీత్‌నేే ఈ సినిమాకు డైరెక్టర్‌గా తీసుకున్నాం.

క్యారెక్టర్‌ గురించి...
- లైఫ్‌ గురించి పెద్ద సీరియస్‌నెస్‌ కనపడని అబ్బాయి పాత్ర చేశాను. 24 పేపర్స్‌ పెండింగ్‌లో ఉంటాయి. సినిమాలకు వెళ్లి నేనైతే సినిమాను ఇలా తీసేసేవాడిని అంటూ రివ్యూలు రాసేస్తుంటాడు. ఓ షార్ట్‌ ఫిలిం చేసేసి పేరు సంపాదించేస్తే, రాజమౌళిలా తనకు గుర్తింపు వస్తుందని ఎవరో ఒకరు సినిమా అవకాశం ఇస్తారని భావిస్తుంటారు. సినిమా డైరెక్షన్‌ ఈజీ అనుకుంటూ కలలు కంటూ నిజానికి దూరంగా బ్రతుకుతుంటాడు. అలాంటి యువకుడు తెలియకుండా ఓ సమస్యలో ఇరుక్కుంటాడు. ఆ సమస్యను పరిష్కరించే సందర్భంలో అతనికి జీవితం విలువ తెలుస్తుంది. గాలిశీను స్టయిల్లో నా పాత్ర ఉంటుంది. సినిమా మొత్తంగా ఓ ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌.

మూడేళ్ల క్రితం అనుకున్న టైటిల్‌...
- కృష్ణ భగవాన్‌గారు మూడేళ్ల క్రితం నాకు ఓ హారర్‌ కామెడీ కథ చెప్పారు. ఆ సినిమా కోసం మేడ మీద అబ్బాయి అనే టైటిల్‌ను అనుకున్నాం. అయితే ఆ ప్రాజెక్ట్‌ ఆలస్యం కావడంతో కృష్ణ భగవాన్‌గారిని నేను మేడ మీద అబ్బాయి అనే టైటిల్‌ రిజిష్టర్‌ చేయించుకుంటానని అడిగాను. ఆయన కూడా సరేనన్నారు. 2012 నుండి ఈ టైటిల్‌ నా దగ్గరే ఉంది. ఈ టైటిల్‌కు తగ్గ కథ కోసం వెయిట్‌ చేశాను. ఈ సినిమా కథకు ఈ టైటిల్‌ సూట్‌ అవుతుందనిపించింది.

Allari Naresh interview gallery

నిర్మాత గురించి...
- కెవ్వు కేక సినిమా నుండి బొప్పన చంద్రశేఖర్‌గారు 'సార్‌ మీరు కెరీర్‌ ప్రారంభంలో గమ్యం, శంభో శివ శంభో' 'నేను' వంటి సినిమాలు చేశారు. తర్వాత కామెడీ సినిమాలే చేశారు' అన్నారు. ఓ సందర్భంలో ఆయన ఈ సినిమా మలయాళ మాతృక చూడండి సార్‌..నేను రైట్స్‌ కొందామని అనుకుంటున్నాను అన్నారు. అప్పటికే నేను ఒరు వడక్కిల్‌ సెల్ఫీ సినిమాను ఓ ఆడియెన్‌లా చూసేశాను. చంద్రశేఖర్‌గారు అడగంతో రెండోసారి చూశాను. నచ్చి సినిమా చేద్దామని అనుకోగానే డైరెక్టర్‌ ఎవరు? అసలు నెటివిటీలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలి? అని ఆలోచించాం. అయితే మలయాళ మాతృకలో సోల్‌ బావుంటుంది కదా, కొత్తగా ఎక్స్‌పెరిమెంట్‌ ఎందుకు అనిపించింది. అందుకనే ప్రజీత్‌నే దర్శకుడిగా ఎంచుకున్నాం.

హైపర్‌ ఆది, అవసరాల శ్రీనివాస్‌ క్యారెక్టర్స్‌ గురించి...
- హైపర్‌ ఆది ఇందులో వెటకారం ఉండే నా ఫ్రెండ్‌ క్యారెక్టర్‌లో కనపడతాడు. సెకండాఫ్‌లో నా సైడ్‌ నుండి కామెడి ఫోర్స్‌ తగ్గుతుంది. దాన్ని బేలన్స్‌ చేయడానికి హైపర్‌ ఆది కార్యరెక్టర్‌ను ఎంచుకున్నాం. అలాగే అవసరాల శ్రీనివాస్‌ క్యారెక్టర్‌ అంటే కాస్తా ఫన్నీగా ఉంటూ, నెగటివ్‌ టచ్‌ ఉండే పాత్ర. అవసరాలగారైతే ఆ పాత్రకు న్యాయం చేయగలుగుతారని భావించి ఆయన్ను తీసుకున్నాం.

తదుపరి చిత్రాలు?
- రెండు సినిమాలు చేస్నున్నాను. అక్టోబర్‌లో ఓ సినిమా ప్రారంభం కానుంది. సెప్టెంబర్‌ 20 తర్వాత ఈ సినిమాలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తాను. ప్రస్తుతం తెలుగు సినిమాలపైనే కాన్‌సన్‌ ట్రేషన్‌ చేస్తున్నాను'' అన్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved