pizza
Allu Sirish interview about Srirastu Subhamastu
`శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు` అంద‌రికీ న‌చ్చుతుంది - అల్లు శిరీష్‌
You are at idlebrain.com > news today >
Follow Us

03 August 2016
Hyderaba
d

`గౌర‌వం`, `కొత్త‌జంట‌` చిత్రాల త‌ర్వాత అల్లు శిరీష్ చేసిన సినిమా `శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు`. త‌మ‌న్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాట‌లు ఇప్ప‌టికే శ్రోత‌ల‌ను రంజింప‌జేస్తున్నాయి. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఆగస్ట్ 5న విడుద‌ల కానుంది. ఈ సినిమా గురించి అల్లు శిరీష్ బుధ‌వారం హైద‌రాబాద్‌లో విలేక‌రుల‌తో మాట్లాడారు.

* చాలా రోజుల త‌ర్వాత తెర‌మీద‌కు వ‌స్తున్నారు?
- అవునండీ. `కొత్త జంట` త‌ర్వాత నా మోకాలు ఆప‌రేష‌న్ జ‌రిగింది. దాంతో కొంత రెస్ట్ తీసుకోమ‌ని డాక్ట‌ర్లు చెప్పారు. అందువ‌ల్ల విశ్రాంతి తీసుకున్నా.

* శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు ఎలా స్టార్ట‌యింది?
- ప‌ర‌శురామ్‌తో ప‌నిచేయాల‌ని నాకు ఎప్ప‌టి నుంచో కోరిక ఉండేది. ఆయ‌న `సోలో`, `ఆంజ‌నేయులు` సినిమాలంటే నాకు బాగా ఇష్టం. కామెడీ టైమింగ్ ఉంటుంది. ఫ్యామిలీ ఎమోష‌న్స్ బావుంటాయి. సో నేను బాగా క‌నెక్ట్ అయ్యేవాడిని. ఓ సారి ఆయ‌న‌తో క‌లిసి ఈ విష‌యాన్నే చెప్పాను. ఆయ‌న కూడా నాతో ప‌నిచేయాల‌ని ఉంద‌నే విష్‌ను వ్య‌క్తం చేశారు. సో ఈ సినిమా స్టార్ట‌యింది.

* ఇందులో క‌థ ఎలా ఉంటుంది?
- సింగిల్ లైన్‌లో చెబితే పెద్ద‌గా ఏమీ అనిపించ‌దు. ఎందుకంటే ఒక‌మ్మాయి, ఒక‌బ్బాయి ప్రేమించుకున్నారు. వారి ప్రేమ‌ను ఇంట్లో వాళ్లు ఒప్పుకోక‌పోతే ఏం చేశారు?... సింపుల్‌గా క‌థ‌గా విన‌డానికి ఇంతే ఉంటుంది. కానీ ప‌ర‌శురామ్ చేసిన స్క్రీన్‌ప్లే, డ్రామా చాలా బాగా ఉంటుంది.

* లావ‌ణ్య త్రిపాఠి గురించి చెప్పండి?
- నేను ఇప్ప‌టిదాకా ప‌నిచేసిన హీరోయిన్ల‌తో పోలిస్తే ద మోస్ట్ ప్రొఫెష‌న‌ల్‌. త‌ను ఆయా సీన్ల‌లో న‌టించిన‌ట్టు క‌నిపించ‌దు. చాలా ల‌వ్లీగా రియాక్ట్ అయిన‌ట్టే ఉంటుంది. ఈ సినిమాలో చాలా బాగా చేసింది.

* సీనియ‌ర్ ఆర్టిస్టుల‌తో న‌టించ‌డం ఎలా అనిపించింది?
- ఈ సినిమాలో ఓ షెడ్యూల్లో దాదాపు అంద‌రు న‌టీన‌టులతో షెడ్యూల్ చేశాం. అప్పుడు చిన్నా పెద్దా తేడా లేకుండా షాట్ గ్యాప్‌ల‌లో అంద‌రం క‌లిసి కూర్చుని క‌బుర్లు చెప్పుకునేవాళ్లం. ఎవ‌రూ తాము గొప్ప‌ని, ఇంకోరు చిన్న ఆర్టిస్టుల‌నే తేడాను చూపించేవారు కాదు. ప్ర‌కాష్‌రాజ్‌గారితో ఇంత‌కు ముందే చేశాను. కానీ రావుర‌మేష్‌గారితో చాలా కొత్త ఎక్స్ పీరియ‌న్స్ క‌నిపించింది. ఆయ‌న ఇన్ని సినిమాలు చేసిన‌ప్ప‌టికీ ద‌ర్శ‌కుడు సీన్‌ను వివ‌రిస్తున్నంత సేపూ ఆయ‌న చూపించే శ్ర‌ద్ధ‌, ప‌డే త‌ప‌న నాకు చాలా బాగా న‌చ్చాయి.

Allu Sirish interview gallery

* ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేశార‌ట క‌దా?
- లేదండీ. మోకాలు ఆప‌రేష‌న్ అని చెప్పాను క‌దా. ఆ త‌ర్వాత కాస్త ఖాళీ స‌మ‌యం ఉంటే సిక్స్ ప్యాక్ చేశాను. ఈ సినిమాలో విల‌న్లే లేరు. యాక్ష‌న్ ఎక్క‌డి నుంచి ఉంటుంది? సిక్స్ ప్యాక్ చూపించే అవ‌కాశం ఎక్క‌డుంటుంది? అదేమీ లేదండీ.

* ఇంత‌కీ మోకాలు ఆప‌రేష‌న్ ఎందుకు జ‌రిగింది?
- గౌర‌వం సినిమా చేస్తున్న‌ప్పుడు మోకాలు బెణికిన‌ట్టు అనిపించింది. అప్ప‌ట్లో నొప్పిని నిర్లక్ష్యం చేశా. కానీ కొత్త‌జంట త‌ర్వాత ఆ నొప్పి మ‌రింత ఎక్కువైంది. అందువ‌ల్ల ఎండోస్కోపీ చేస్తే చిన్న ఆప‌రేష‌న్ చేయాల‌ని చేశారు.

* శ్రీర‌స్తు శుభ‌మ‌స్తులో మీ పాత్ర ఎలా ఉంటుంది?
- అప్పుడే కాలేజీ అయిపోయిన కుర్రాడిగా క‌నిపిస్తా. లావ‌ణ్య ఇంకా కాలేజీలోనే ఉండే అమ్మాయిగా న‌టించింది. ఆ వ‌య‌సుకు త‌గ్గ ప్రేమ‌క‌థ‌. ఫ్యామిలీ విలువ‌లు మెండుగా ఉంటాయి. ఇప్ప‌టి వ‌ర‌కు నేను చేసిన అన్ని పాత్ర‌ల్లోకీ నా రియ‌ల్ లైఫ్‌కి కాసింత ద‌గ్గ‌ర‌గా ఉండే పాత్ర‌.

* అంటే ఎలా ఉంటుంది?
- పెద్ద ఫ్యామిలీ నుంచి వ‌చ్చినా ఆ బ్యాగేజీ ఏమీ లేకుండా అంద‌రితో క‌లిసిపోతాన‌ని, అంద‌రినీ ఒకేలా చూస్తాన‌ని నా ఫ్రెండ్స్ ఎప్పుడూ అంటూ ఉంటారు. అలాగే ఈ సినిమాలో హీరో కూడా పెద్ద ఫ్యామిలీ వ్య‌క్తి అయిన‌ప్ప‌టికీ అంద‌రితో క‌లిసిపోతుంటాడు. స‌ర‌దాగా ఉంటాడు. ఒక్క మాట‌లో చెప్పాలంటే బావుంటాడు.

* శిరీష్ అన‌గానే అంద‌రూ ప్రొడ్యూస‌ర్ అంటారు. మ‌రి మీరు హీరో ఎందుకు కావాల‌నుకున్నారు?
- నాకు ఆ ప‌ని బోర్ కొట్టిందండీ. న‌న్ను ఎగ్జ‌యిట్ చేయ‌లేదు. నేను మ‌నీ ప‌ర్స‌న్‌ని కాదు. నిద్ర‌లేచిన‌ప్ప‌టి నుంచి డ‌బ్బులు లెక్కేయ‌డం త‌ప్ప ఇంకోటి ఉండ‌దు. కానీ నాకు క్రియేటివ్ వ‌ర్క్ ఇష్టం. స్టోరీ డిస్క‌ష‌న్స్ ఇష్టం. క్రియేటివ్‌గా ఉండ‌టం ఇష్టం. అందుకే న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న సినిమాల్లో న‌టిస్తే బావుంటుంద‌నిపించి మొద‌లుపెట్టా. థ్రిల్ల‌ర్‌లు, హార‌ర్ కామెడీలు నాకు న‌చ్చ‌వు. యాక్ష‌న్ చేయ‌డ‌మంటే ఇష్టం. కానీ క‌థ‌లో లేకుండా కావాల‌ని యాక్ష‌న్‌ని ఇరికించ‌డం కూడా నాకు న‌చ్చ‌దు. అంతెందుకు ఈ సినిమాలో ఐదు పాట‌లు పెట్టాల‌నుకున్నాం. కానీ ఇరికించిన‌ట్టు ఉంటుంద‌నిపించి మూడు పాట‌ల‌తోనే స‌రిపెట్టాం. రేపు క్రిటిక్స్ ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించ‌కూడ‌ద‌ని.

* విమ‌ర్శ‌ల‌ను న‌మ్ముతారా?
- నాకు కొంత‌మందిమీద న‌మ్మ‌కం ఉంటుంది. గౌర‌వం ఉంటుంది. వారికి నా విష‌యాల‌ను చెప్పి స‌ల‌హా అడుగుతాను. స‌ద్విమ‌ర్శ ఎవ‌రు చేసినా నేను తీసుకుంటాను. విమ‌ర్శ అనేది వ్య‌క్తిగ‌తంగా ఉండ‌కూడ‌దు. వృత్తిప‌రంగా ఎద‌గ‌డానికి నేనెప్పుడూ విమ‌ర్శ‌ల‌ను ఆహ్వానిస్తాను.

* శ్రీర‌స్తు శుభ‌మ‌స్తుకి లుక్ ప‌రంగా తీసుకున్న జాగ్ర‌త్త‌లు ఏంటి?
- చాలా జోయ్‌ఫుల్‌గా ఉంటాను. చెక్డ్ ష‌ర్ట్ లు వేసుకున్నా. హెయిర్ స్టైల్ కూడా మార్చా.

* మీ త‌ర్వాతి సినిమా గురించి చెప్పండి?
- వేణు ద‌ర్శ‌క‌త్వంలో ఉంటుంది. 700-800 ఏళ్ల నాటి ప్రేమ‌క‌థ‌. నా మార్కెట్‌కి త‌గ్గ బ‌డ్జెట్‌లోనే తీస్తాం. ఓ ద‌ర్బార్ సెట్ ఉంటుంది. అందులో గౌత‌మ్ అనే పాత్ర‌లో న‌టిస్తాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved