pizza
Anasuya Bharadwaj interview about Kshanam
టీవీ కంటే సినిమా రంగంలో నటించడం చాలా సులువు - అనసూయ
You are at idlebrain.com > news today >
Follow Us

20 February 2016
Hyderaba
d

స్టేజ్ యాంకర్ గానే కాకుండా ఈటీవీలో ప్రసారితమయ్యే జబర్ దస్త్ కామెడి షో సక్సెస్ లో తన వంతు పాత్రను పోషించిన జబర్ దస్త్ అనసూయగా పేరు తెచ్చుకున్న అనసూయ సోగ్గాచే చిన్నినాయనా చిత్రంతో వెండితెరపై చిన్న పాత్రలో మెరిసి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇప్పుడు పివిపి బ్యానర్ పై రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రూపొందిన క్షణం చిత్రంలో ప్రధానపాత్రలో నటించింది. క్షణం సినిమా సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని పిభ్రవరి 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా అనసూయతో ఇంటర్వ్యూ....

గుర్తింపు తెచ్చిన టీవీ రంగాన్ని విడిచిపెట్టను.....
-నేను సినిమాల్లోకి రాకముందు టీవీ ద్వారానే అందరికీ దగ్గరయ్యాను. సినిమాల్లో అవకాశం వస్తుంది కదా అని టీవీని వదులుకునేది లేదు. ఎందుకుంటే నాకు గుర్తింపు టీవీ రంగం వల్లే వచ్చింది.

‘క్షణం’ కోసం ఈగర్ గా...
-క్షణం సినిమా నా తొలి సినిమా కావాల్సింది. అయితే చిన్న రోల్ చేసిన సోగ్గాడేచిన్ని నాయనా ముందుగా విడుదలై, మంచి పేరు తీసుకొచ్చింది. క్షణం సినిమాలో మంచి రోల్ చేశాను. ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్. ఈ సినిమాతో నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

సినిమాలో అవకాశం.....
-శేష్ నేను అమెరికాలో ఉన్నప్పుడు సినిమా చేయాలని అన్నారు. అయితే నేను అప్పుడు అమెరికాలో ఉన్నందువల్ల కుదరలేదు. ఇండియా రాగానే కథ విన్నాను. ముందు ఆదాశర్మ క్యారెక్టర్ కోసం అనుకున్నాను. కానీ జయా భరద్వాజ్ అనే పోలీస్ పాత్ర అని తెలిసింది. అయితే ఈ చిత్రంలో ఎక్కడా ఖాకీ డ్రెస్ లో కనపడను. మొదట ఈ పాత్రలో నేను చేయగలనా..? అనుకున్నాను. షూటింగ్ టైంకి నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. మంచి పాత్ర. అయితే ఈ పాత్ర కోసం ఎవరినీ అనుకరించలేదు. కానీ చాలా పోలీస్ సినిమాలను చూశాను.

ఆయన వల్లే ఆ సినిమా చేశాను....
-నేను చేసే పాత్రల విషయంలో చాలా క్లారిటీతో ఉంటాను. అది టీవీ రంగమైనా, సినిమా రంగమైనా అయినా సరే. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో రెండు సీన్స్, ఒక సాంగ్ అనగానే ముందు చేయకూడదని అనుకున్నాను. కానీ నాగార్జునగారు నా అభిమాన నటుడు. అందుల్లే సినిమా చేయడానికి ఒప్పుకున్నాను.

Anasuya Bharadwaj interview Gallery

స్వార్ధంతో సినిమాలకు దూరమయ్యాను..
-టెలివిజన్ షోస్ లో నేనే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్. కాని సినిమాల్లో అలా ఉండదు. ఆ స్వార్ధంతోనే నేను సినిమాలకు దూరమయ్యాను. కాని అవకాశాలు రావడంతో నటిస్తున్నాను.

నేను దాని గురించే ఆలోచిస్తాను......
-బాలీవుడ్ లో చాలా మంది పెళ్ళైన హీరోయిన్స్ ఉన్నారు. అక్కడ వారు స్క్రీన్ మీద ఎంటర్టైన్ చేస్తున్నారా..? లేదా..? అనే చూస్తారు. నాకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో.. అంతే మంది హేటర్స్ కూడా ఉన్నారు. కాని నేనెవరిని పట్టించుకోను. స్క్రీన్ మీద ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే నాకు ముఖ్యం. నేను దాని గురించే ఆలోచిస్తాను.

సినిమానే సులువు..
-నాకు టెలివిజన్ కు, సినిమాకు పెద్ద తేడా కనిపించలేదు. టీవీలోనే ఇంకా డిసిప్లైండ్ గా ఉండాలి. సినిమాల్లో నటించడం నాకు సులువుగా అనిపించింది.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..
-ప్రస్తుతానికి క్షణం రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. వేరే సినిమా ఏదీ ఒప్పుకోలేదు.


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved