pizza
Anil Ravipudi interview (Telugu) about F2
నేను వారి స్థాయిలో లేను - అనిల్‌ రావిపూడి
You are at idlebrain.com > news today >
Follow Us

13 January 2019
Hyderabad

ఈ సినిమాతో నా కోరిక తీరింది - అనిల్‌ రావిపూడి
వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌, తమన్నా, మెహరీన్‌ కౌర్‌ హీరో హీరోయిన్లుగా దిల్‌రాజు సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో శిరీష్‌, లక్ష్మణ్‌ నిర్మాతలుగా రూపొందిన చిత్రం 'ఎఫ్‌2.. ఫన్‌ అండ్‌ ప్రస్టేషన్‌'. జనవరి 12న సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు అనీల్‌ రావిపూడి మాట్లాడుతూ... ఆసనం ఐడియా అలా వచ్చింది..

- సాధారణంగా మనం రకరకాల ఆసనాలు వేస్తుంటాం. అలాంటిది మనలో ఉన్న ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ఒక ఆసనం ఉంటే ఎలా ఉంటుంది. అనే ఆలోచన నుండి ఈ వెంకీ ఆసనం పుట్టుకొచ్చింది. అలాగే వెంకటేష్‌గారికి ఓ మెనరిజమ్‌ పెట్టి.. దాన్ని కథకు లింక్‌ చేస్తు బావుంటుందనిపించి ఈ వెంకీ ఆసనం కనిపెట్టాను. ఆడియెన్స్‌ దాన్ని బాగా ఓన్‌ చేసుకున్నారు. చాలా మంది థియేటర్‌లో ఆ ఆసనాన్ని వేస్తున్నారు. పాపులర్‌ అయ్యింది. వారి స్థాయికి ఇంకా చేరుకోలేదు..

- సంక్రాంతి విన్నర్‌ అంటే పక్క సినిమాలతో పోటీ అనే భావన వచ్చేస్తుంది. అయితే నాకొక ఆలోచన ఉండేది. ఈవీవీగారి సినిమాలు, కృష్ణారెడ్డిగారి సినిమాలు.. జంధ్యాలగారి సినిమాలను చూస్తే.. అన్నీ వర్గాల ప్రేక్షకులు నవ్వుతూనే ఉండేవారు. వారి సినిమాలను బాగా చూసేవాడిని. అలా పూర్తిస్థాయి సినిమాను తీయాలనే కోరిక ఉండేది. అది ఈ సినిమాతో తీరింది. మెమొరబుల్‌ ఎక్స్‌పీరియెన్స్‌. అందరూ పగలబడి నవ్వుతున్నారు. సోషల్‌ మీడియాలో ఈవివిగారు, జంధ్యాలగారితో పోలుస్తూ కొందరు కామెంట్స్‌ కూడా చేశారు. అయితే వారి స్థాయికి నేను ఇంకా చేరుకోలేదు. అయితే ఎక్కడో ఒకచోట వాళ్ల ప్రభావం నాపై ఉంటుందనే మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే వాళ్ల సినిమాలను నేను అలా చూసేవాడిని. వారి స్టయిల్‌ను నా స్టయిల్‌కు తగ్గట్టు మార్చుకుని సినిమాలు చేస్తున్నాను.
వరుణ్‌ చక్కగా చేశాడు...

- వరుణ్‌ కూడా ఇప్పటి వరకు కామెడీ జోనర్‌లో సినిమా చేయలేదు. తను వెంకటేష్‌తో ఎలా కామెడీ టైమింగ్‌లో చేస్తాడోనని కాస్త ఆలోచించాను. తెలంగాణ యాస మాట్లాడుతూ వరుణ్‌ యాదవ్‌ అనే కుర్రాడి పాత్రలో కామెడీ జోనర్‌లో తొలిసారి చాలా చక్కగా నటించాడు. వెంకీగారితో కలిసి తను అద్భుతంగా నటించాడు.
కథాలోచన అక్కడ నుండే వచ్చింది...

- `ప‌టాస్‌` నుండి రాజాది గ్రేట్‌' వరకు కమర్షియల్‌ సినిమాలు చేశాను. అయితే రాజాది గ్రేట్‌ సినిమా చేసేటప్పుడు అసలు ఫైట్‌ లేకుండా ఓ కమర్షియల్‌ సినిమా చేద్దాం అనే ఆలోచన వచ్చింది. దానికి ఎలాంటి బేస్‌ తీసుకుద్దాం. అని ఆలోచన వచ్చింది. పెళ్ళాం చెబితే వినాలి, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి జోనర్‌లో ఈ మధ్య సినిమాలు రాలేదనిపించి ఈ కథను రాసుకున్నాను. సాధారణంగా ఓ సినిమాను పూర్తి చేయడానికి ఏడాది సమయం పడుతుంది. కాబట్టి నాటీం సాయి, ప్రవీణ్‌, నారాయణలతో కథపై నాలుగైదు నెలలు వర్క్‌ చేశాం. సీక్వెల్‌గా చేస్తా...

- హిందీలో గోల్‌మాల్ , హౌస్‌ఫుల్‌ సినిమాల సిరీస్‌ ఉంది. మన తెలుగులో ఇలాంటి జోనర్‌లో సినిమాలు చేయాలని ఉంది. కచ్చితంగా ఎఫ్‌ 2కు సీక్వెల్‌గా ఎఫ్‌ 3 చేస్తాను. వెంకటేష్‌గారికి, వరుణ్‌కి చెప్పేశాను. వాళ్లు ఎప్పుడైనా రెడీ అన్నారు. చర్చల్లో ఉంది...

- వెంకటేష్‌గారికి ఓ లైన్‌ చెప్పాను. ఆయనకు బాగా నచ్చింది. కథా చర్చలు జరుగుతున్నాయి. అది ఎప్పుడు ఓకే అవుతుందో ఇప్పుడే చెప్పలేను. కథను నమ్మారు..

- వెంకటేష్‌గారు కథను బాగా నమ్మారు. డబ్బింగ్‌ చెప్పేటప్పుడు సినిమా అంతా చూసి.. బయటకు వచ్చి 'అదేంటమ్మా అలా చేయించేశావ్‌' డబ్బింగ్‌ ఎంత ఎనర్జీతో చెప్పాలో తెలుసా! రేపు వచ్చి డబ్బింగ్‌ చెబుతాను' అని వెళ్లిపోయారు. చాలా కేర్‌ తీసుకుని డబ్బింగ్‌ చెప్పారు. అక్కడే నుండే ఆ క్యారెక్టర్స్‌...

- సూర్యకాంతంగారి నటనలో, డైలాగ్‌ చెప్పడంలో ఓ స్టయిల్‌ ఉంటుంది. ఆమె డైలాగ్‌ను చాలా అందంగా విరుస్తారు. అలాంటి క్యారెక్టర్‌ మోడ్రన్‌గా ఉంటే ఎలా ఉంటుందో అని ఆలోచించి ప్రగతి క్యారెక్టర్‌ను పెట్టాం. మా అమ్మమ్మ, నాయనమ్మలు ఉండేవారు. ఏ ఫంక్షన్‌కి వచ్చినా మంచంపై కూర్చుని అది.. ఇది అంటూ అందరినీ కామెంట్‌ చేస్తుంటారు. ఆ క్యారెక్టర్స్‌ నాకు బాగా రిజిష్టర్‌ అయ్యాయి. అందువల్ల అలాంటి క్యారెక్టర్స్‌ను అన్నపూర్ణమ్మ, వై.విజయలుగా సినిమాలో చూపెట్టాం.
తదుపరి చిత్రాలు...

- ఇంకా ఏమీ అనుకోలేదు. పండుగకు ఊరెళ్లి ఎంజాయ్‌ చేసి.. మూడు వారాలు రిలాక్స్‌ అయ్యి.. ఓ జోనర్‌లో చేయాలనేది ఆలోచించుకుని చేస్తాను. బాలకృష్ణగారికి కూడా ఓ ఐడయా చెప్పాను. ఈసారి ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ చేయను. అయితే నా సినిమాల్లో ఫన్‌ లేయర్‌ లేకుండా ఉండదు.




Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved