pizza
Anil Ravipudi interview about Supreme
మా హీరో కారువేగంతో దూసుకుపోతాడు - అనిల్ రావిపూడి
ou are at idlebrain.com > news today >
Follow Us

4 May 2016
Hyderaba
d

`ప‌టాస్‌` విజ‌యం సాధించిన త‌ర్వాత అనిల్ రావిపూడిపై మ‌రింత బాధ్య‌త పెరిగింది. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తాజా సినిమా సుప్రీమ్ ఈ గురువారం విడుద‌ల కానుంది. శిరీష్ నిర్మించిన ఈ సినిమాను దిల్‌రాజు స‌మ‌ర్పిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా అనిల్ రావిపూడి విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు..

* సుప్రీమ్ గురించి చెప్పండి?
- సుప్రీమ్ అన‌గానే అంద‌రూ హీరో పేరు అని అనుకుంటారు. కానీ ఇది హీరో పేరు కాదు. ఈ సినిమాలో హీరో వాడే కారు పేరు సుప్రీమ్‌. ఇందులో హీరో పేరు బాలు. హీరోయిన్ పేరు బెల్లం శ్రీదేవి. శిరీష్‌గారు నిర్మించారు. ఖ‌ర్చుకు ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదు.

* సాయిధ‌ర‌మ్‌తేజ్ గురించి చెప్పండి?
- చాలా ఎన‌ర్జిటిక్ హీరో. అటు పాట‌ల నుంచి ఇటు ఫైట్ల వ‌ర‌కు ప్ర‌తి విష‌యంలోనూ చాలా ఈజ్‌తో చేస్తాడు. క‌ష్ట‌ప‌డ‌టానికి ఎప్పుడూ ముందుంటాడు.

* బెల్లం శ్రీదేవి పాత్రకు స్ఫూర్తి ఉందా?
- హీరోయిన్ పాత్ర పోలీస్ అనే అనుకున్నాం. అయితే క‌ర్త‌వ్యంలో విజ‌య‌శాంతిగారి త‌ర్వాత ఇలాంటి పాత్ర‌ను మ‌ర‌లా ఎవ‌రూ చేయ‌లేదు. కాక‌పోతే ఆ సినిమాలో ఆవిడ సీరియ‌స్‌గా ఉంటుంది, ఇందులో హీరోయిన్ చాలా బాగా న‌వ్విస్తుంది.

* అందం హిందోళం పాట మీ ఛాయిసేనా?
- నేను 80ల్లో పుట్టాను. అప్ప‌ట్లో సినిమాల ప్ర‌భావం నాపై చాలా ఉంటుంది. అలాంటి పాట‌లు ఇప్పుడు వినిపిస్తే ఇంకా బావుంటుంద‌ని పెట్టాం. చిరంజీవిగారు, రాధ‌గారు వేసిన స్టెప్పులు ఇంకా గుర్తుంటాయి. వాటికి మ్యాచ్ అయితే చాల‌నుకున్నాను కానీ వాటిని దాటి పాట‌ను తీయాల‌ని మాత్రం అనుకోలేదు.

Anil Ravipudi interview gallery

* రీమిక్స్ చేసేట‌ప్పుడు భ‌య‌ప‌డుతుంటారా?
- త‌ప్ప‌కుండా భ‌యం ఉంటుంది. ఆ భ‌యంతోనే చేస్తాం. అందం హిందోళం పాట‌ను రీమిక్స్ చేసేట‌ప్పుడు తేజ్‌, రాశీఖ‌న్నా, నేనూ అందరం చాలా భ‌య‌ప‌డ్డాం.

* ఇందులో హైలైట్స్ ఏంటి?
- చాలా ఉన్నాయండీ. ఈ సినిమాకూ రామాయ‌ణానికి ఒక లింకు ఉంది. అక్క‌డ రాముల‌వారి ఆజ్ఞ ప్ర‌కారం హ‌నుమంతుడు వాయువేగంతో వెళ్తాడు. ఇక్క‌డ కారు వేగంతో వెళ్తాడు. ఈ చిత్రంలో ర‌వికిష‌న్‌గారి కేర‌క్ట‌ర్ కూడా చాలా బాగా ఉంటుంది.

* అంటే ఇక్క‌డ రాముడు ఎవ‌రు?
- రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారా, సాయికుమార్‌గారా, రాశీఖ‌న్నానా? మ‌రెవ‌రు అనేది మీరు తెర‌మీదే చూడాలి.

* సినిమాను చూశారా?
- చూశామండీ. అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. త‌ప్ప‌కుండా స‌క్సెస్ కొడ‌తాం. అయితే అది ఏ రేంజ్ అనేది చూడాలి.

* ద్వితీయ విఘ్నం గురించి భ‌యం లేదా?
- లేదండీ. ప్రాజెక్ట్ చాలా బాగా వ‌చ్చింది.

 

.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved