pizza
Anup Rubens interview about Padesave
అదే మా అమ్మగారు ఇచ్చే చివరి గిఫ్ట్ అవుతుందనుకోలేదు – అనూప్ రూబెన్స్
You are at idlebrain.com > news today >
Follow Us

18 February 2016
Hyderaba
d

అయాన్ క్రియేషన్స్ బ్యానర్ పై కార్తీక్ రాజు, నిత్య శెట్టి, సామ్ ప్రధాన పాత్రల్లో చునియా దర్శక నిర్మాణంలో రూపొందిన చిత్రం పడేసావే. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 26న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ తో ఇంటర్వ్యూ..

అందుకే సినిమా చేశా....
పడేసావే ఓ మ్యూజికల్ మూవీ. ఆరు సాంగ్స్ , ఓ బిట్ సాంగ్ ఉంది. కథ విన్నప్పుడు నేను మ్యూజిక్ కంపోజ్ చేయడానికి సినిమాలో ఉండే సిట్యుయేషన్స్ నచ్చాయి. ఈ సినిమాకు నాగార్జున గారు అసోసియేట్ అయ్యారని నేను ఈ సినిమాకు వర్క్ చేయలేదు. 'మనం' సినిమాతో నాగ్ సర్ తో మంచి రిలేషన్ ఏర్పడింది. ఆ సినిమాకు పనిచేసేటప్పుడు చునియా గారు పరిచయమయ్యారు. చునియా చెప్పిన కథ విన్నప్పుడు ఫ్రెష్ నెస్ కనపడింది. అందుకే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.

‘పడేసావే’ మూవీ గురించి...
‘పడేసావే’ ఫుల్ ప్యాకేజ్డ్ మూవీ. స్నేహం, ప్రేమ రెండింటి గురించి డిఫరెంట్ వేలో చునియా ప్రెజంట్ చేసింది. ఈ సినిమాలో ఉంటాయి. స్నేహం కోసం ఏదైనా చేయొచ్చని సినిమాలో చూపించాం.

Anup Rubens interview Gallery

డైరెక్టర్స్ లో తేడా అదే....
మ్యూజిక్ విషయంలో మేల్ డైరెక్టర్స్ తో వర్క్ చేసినా.. ఫిమేల్ డైరెక్టర్స్ తో వర్క్ చేసినా ఒకటే. అయితే లేడీ డైరెక్టర్స్ లో సెన్సిటివిటీ కనపడుతుంది.

నాగార్జునగారు అప్రిసియేషన్ చేశారు...
చిన్న సినిమా అని కమర్షియల్ గా ఆలోచించకుండా మంచి పని చేస్తున్నావ్ వెరీ గుడ్ అనూప్ అని నాగ్ సార్ అభినందించారు. ఆయన సినిమా మొత్తం చూశారు. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బావుందని అప్రిసియేట్ చేశారు.

అమ్మ ఇచ్చిన చివరి గిఫ్ట్ ....
మ్యూజిక్ డైరెక్టర్ గా నా కెరీర్ మొదలవ్వక ముందు నుండి నా పుట్టినరోజు వరకు నా లైఫ్ లో జరిగిన ప్రతి ఇంటర్వ్యూని పదిల పరిచి ఒక ఫైల్ చేసి 2015లో నా పుట్టిన రోజున అమ్మగారు ప్రెజంట్ చేశారు. కానీ అదే గిఫ్ట్ అమ్మ ఇచ్చే చివరి గిఫ్ట్ అని అసలు అనుకోలేదు.

చిన్న సినిమాలకు వర్క్ చేయడంలో...
స్టార్స్ ఉండే సినిమాలనకు వర్క్ చేయడం అంటే వారి ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని వర్క్ చేయాల్సి ఉంటుంది. కొన్ని నిబంధనలు ఉంటాయి. అదే చిన్న సినిమాలకు పనిచేసే టప్పుడు కొంత ఫ్రీడం ఉంటుంది. నాకు కొన్ని సౌత్ మెలోడీస్ చేయాలనిపిస్తుంది. అలాంటి అవకాశాలు చిన్న సినిమాల్లో దొరుకుతాయి.

స్వంత ఆల్బం చేస్తా..
నా సొంత ఆల్బం చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. కాని హెక్టిక్ షెడ్యూల్స్ వలన చేయడం కుదరట్లేదు. ఈ సంవత్సరంలో ఆల్బం చేయాలనుకుంటున్నాను. కెరీర్ పరంగా తృప్తిగా లేదు. నేను చేసింది ఒక్క శాతం మాత్రమే. చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఖచ్చితంగా చేస్తాను. టైం కూడా దానికి సహకరించాలి.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..
సుశాంత్ హీరోగా నటిస్తోన్న సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. మరో రెండు ప్రాజెక్ట్స్ ప్రొడక్షన్ లో ఉన్నాయి.

 

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved