pizza
Anupama Parameswaran interview (Telugu) about Hello Guru Premakosame
ఆ విష‌యంలో ఇంకాస్త జాగ్ర‌త్త తీసుకుంటా - అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌
You are at idlebrain.com > news today >
Follow Us

20 October 2018
Hyderabad

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ `అ..ఆ`తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మ‌ల‌యాళ భామ‌. వ‌రుస‌గా తెలుగు సినిమాలు చేస్తున్నారు. ఆమె న‌టించిన `హ‌లో గురు ప్రేమ‌కోస‌మే` ఇటీవ‌ల విడుద‌లైంది. ఈ సినిమా గురించి అనుప‌మ చెప్పిన విశేషాలు..

* `హ‌లో గురు ప్రేమకోస‌మే` స్పంద‌న ఎలా ఉంది?
- చాలా బావుందండీ. అంద‌రూ ఫోన్ చేసి బావుంద‌ని అంటున్నారు. పండుగ సినిమా అని అంటున్నారు.

* మీ గ‌త సినిమాలు 2,3 పెద్ద బాగా ఆడ‌లేదు క‌దా..
- `తేజ్ ఐ ల‌వ్యూ`.. `కృష్ణార్జున యుద్ధం` ఇంత‌కు ముందు విడుద‌లైన‌వి. అంద‌రూ చెప్పిన‌ట్టు.. నేను నా పాత్ర‌ను బాగా చేస్తాను. నా పాత్ర‌ను బాగా చేయ‌డం త‌ప్ప‌, సినిమా హిట్ కావ‌డానికి అంత‌క‌న్నాబాగా ఏం చేయాలో నాకు తెలియ‌దు. క‌రుణాక‌ర‌న్‌గారు ఎక్స్ పీరియ‌న్స్డ్ డైర‌క్ట‌ర్‌. ఆయ‌న‌తో తేజ్ ఐ ల‌వ్యూ చేశాను. ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా న‌చ్చ‌క‌పోతే నేనేం చేయ‌ను. కాక‌పోతే ఒక‌టి.. ఇక‌పై భ‌విష్య‌త్తులో ఇంకాస్త కేర్‌ఫుల్‌గా ఉండాల‌ని థాట్ వ‌చ్చింది. నా ఫాల్ట్స్ గురించి ఎవ‌రైనా క్రిటిసైస్ చేస్తే.. వాటిని కూడా దృష్టిలో పెట్టుకుంటా.

* అంటే ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు?
- స్పెష‌ల్‌గా స్క్రిప్ట్ ల గురించి తీసుకుంటా. ఇప్పుడు వింటున్న స్క్రిప్ట్ ల‌లోనూ చాలా కేర్ తీసుకుంటున్నా. `హ‌లో గురు ప్రేమ‌కోస‌మే` త‌ర్వాత నేను ఇంకే సినిమాకూ సంత‌కం చేయ‌లేదు. `అ..ఆ..` నుంచి కూడా నేను స్క్రీన్ స్పేస్ గురించి ఎప్ప‌డూ బాధ‌ప‌డ‌లేదు. కాక‌పోతే కేర‌క్ట‌ర్ బావుండాలి. ఆ కేర‌క్ట‌ర్ ఆ సినిమాకు ఎంత వ‌ర‌కు హెల్ప్ అవుతుంద‌నేది ఆలోచిస్తానంతే.

* స్క్రిప్ట్ మీరే ఫైన‌లైజ్ చేస్తారా?
- అమ్మా నాన్న‌ల‌తో క‌లిసి డిస్క‌స్ చేస్తాను. కాక‌పోతే నేనే వింటాను.

* బెస్ట్ క్రిటిక్ ఎవ‌రు మీకు?
- ఒక్క‌ర‌నేం కాదు. నాకు చాలా మంది కాల్ చేసి చెబుతారు. ఇండ‌స్ట్రీ నుంచి డైర‌క్ట‌ర్లు, యూనిట్ మెంబ‌ర్లు, ఆర్టిస్టులు.. అమ్మా నాన్నా చూస్తే వాళ్లు.. ఇలా చాలా మంది చెబుతారు. ఈ సారి `హ‌లో గురూ..` స‌మ‌యంలో నాతో పాటు మా త‌మ్ముడు ఉన్నాడు. అక్క‌డ బాలేదు.. ఇంకా బాగా చేయాలి అని అనే వాడ‌ల్లా `చాలా బావుంది. చాలా మంచి ఎంట‌ర్‌టైన‌ర్‌. ఇలాంటి సినిమాలో కేర‌క్ట‌ర్ చేయ‌డం బావుంది` అని అన్నాడు. చిన్న వాడైనా త‌ను అలా చెప్పినందుకు చాలా ఆనందంగా అనిపించింది.

* ఈ సినిమాలో కాస్త వెయిట్ పెరిగిన‌ట్టు కూడా అనిపించారు?
- మీక‌నిపించిందా? నాకు అంత‌లా అనిపించ‌లేదు.

interview gallery



* టీజ‌ర్ విడుద‌లైన త‌ర్వాత ట్రాల్స్ కూడా వ‌చ్చాయి మీ మీద‌..
- నేను ట్రోల్స్ చూడ‌లేదు కానీ, నేను స్కిన్నీ కాదు.. జీరో సైజ్ కాదు. కూర్చున్న‌ప్పుడు.. వెనుక నుంచి ఎవ‌రు చూసినా అలా అనిపిస్తుందేమో. ఏమో కాస్త లావ‌య్యానేమో... మీరంటున్నారుగా నిజ‌మేనేమో.

* ప్ర‌కాష్‌రాజ్‌గారితో ప‌నిచేయ‌డం ఎలా అనిపించింది?
- ఆయ‌న‌తో నేను రెండోసారి ప‌నిచేస్తున్నా. శ‌త‌మానం భ‌వ‌తి చేశా. అందులో మా గ్రాండ్ ఫాద‌ర్‌. ఇందులో ఫాద‌ర్‌. నెక్స్ట్ బోయ్ ఫ్రెండ్‌గా చేస్తారేమో. హ‌లో గురూ ప్రేమ‌కోస‌మేలో నాకు ముందు నుంచీ నాకు ప్ర‌కాష్‌రాజ్‌గారి పాత్ర ఇష్టం. రామ్ పాత్ర చాలా ఇష్టం. వాళ్ల ఇద్ద‌రితో అను అనే పాత్ర ఎంత‌లా క‌నెక్ట్ అయింద‌నేది కీల‌కం. ప్ర‌కాష్‌రాజ్‌గారి నుంచి మ‌నం ఎంతైనా నేర్చుకోవచ్చు. అలాగే రామ్ నుంచి కూడా. వాళ్లిద్ద‌రూ ఉన్నప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా చేసేదాన్ని. వాళ్లంద‌రూ ఒన్ టేక్‌, రెండు టేకుల్లో చేసేసేవారు. కానీ నా వ‌ల్ల‌నే టేకులు ఎక్కువ‌య్యేవి.

* మీకు, ప్ర‌కాష్‌రాజ్‌కి మ‌ధ్య ఏదో గొడ‌వ‌లున్నాయ‌ని వార్త‌లొచ్చాయే?
- కంటిన్యుయ‌స్ షూటింగ్ చేశాక నేను ఒక‌రోజు అనారోగ్యం పాల‌య్యాను. హాస్పిట‌ల్‌కి వెళ్లొచ్చాను. వ‌చ్చిన మ‌రుస‌టి రోజు అనుకుంటా ఇలాంటి వార్త‌లు వ‌చ్చాయి.. ఇదేంటి? ఇలా రాశారు అని అనుకున్నా. ఆయ‌న‌కు దీంతో ఏ సంబంధ‌మూ లేదు.

* రియ‌ల్ లైఫ్‌లో మీ ఫాద‌ర్‌కీ, ఆయ‌న‌కీ ఎలాంటి వ్య‌త్యాసాలుంటాయి?
- నాకు తెలియ‌దండీ. ఇలాంటి సిట్యువేష‌న్స్ లో మా నాన్న ఎలా ఉంటారో నాకు తెలియ‌దు. కానీ స్క్రీన్ మీద ఫాద‌ర్ ఓపెన్ మైండెడ్‌, బ్రాడ్ మైండెడ్‌..

* రామ్‌తో రెండో సినిమా చేయ‌డం..
- నాకు చాలా ఇష్టం రామ్ అంటే. ఉన్న‌దొకటే జింద‌గీ చేసిన‌ప్పుడు త‌ను గిటార్ నేర్చుకుని వ‌చ్చి చేశారు. అంత ప్రొఫెష‌న‌ల్‌గా ఉంటారు. లైన్స్ నేర్చుకుంటారు. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటారు. నాకు ఏదైనా డౌట్ ఉంటే, నేను రామ్‌ని అడ‌గ‌వ‌చ్చు. అందుకే నేను అత‌న్ని అడిగేదాన్ని. ఎందుకంటే ప్ర‌తి పాత్రా అత‌నికి తెలుస్తుంది. ఉన్న‌దొక‌టే జింద‌గీలో త‌న పాత్ర వేరు. ఇందులో సంజు పాత్ర వేరు. ఇందులో క్యూట్‌గా, హైప‌ర్ యాక్టివ్‌గా ఉంటారు. త‌న‌తో రెండో సారి పనిచేయ‌డం వ‌ల్ల నాకు కంఫ‌ర్ట్ లెవ‌ల్ ఉంది.

* ఈ సినిమాలో రామ్ మిమ్మ‌ల్ని టీజ్ చేస్తుంటారు..
- ఏ అమ్మాయికైనా ఎవ‌రైనా టీజ్ చేస్తే చిరాకే వ‌స్తుంది. వ్య‌క్తిగ‌తంగా నాకైనా అంతే. అబ్బాయిలు కూడా వాళ్ల‌మ్మ గురించి, వాళ్ల చెల్లెళ్ల‌ను గురించి ఆలోచించాలి. అలా ఆలోచించిన వాళ్లు ఇలాంటివి చేయ‌రు.

* మీ టూ గురించి చాలా మంది చెబుతున్నారు. మీరేమంటారు?
- అలా చెప్పిన‌వారు అలా బ‌య‌ట‌కు వ‌చ్చి చెప్ప‌డం మంచిదే. దాని వ‌ల్ల చాలా మందిలో అవ‌గాహ‌న వ‌స్తుంది. జ‌న‌ర‌ల్‌గా అది చాలా మంచి విష‌య‌మే. నాకు ప‌ర్స‌న‌ల్‌గా అలాంటి అనుభ‌వాలు ఏమీ లేవు. ఒక‌వేళ వ‌చ్చినా చెప్ప‌డానికి నాకేం ఇబ్బంది లేదు.

* త్రినాథ‌రావుగారి గురించి చెప్పండి?
- ఆయ‌న డైర‌క్ట‌ర్ మాత్ర‌మే కాదు.. అన్నీ. ప్ర‌తి సీన్‌నీ, చాలా కేర్‌ఫుల్‌గా చూసుకుంటారు. బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్టుల‌ను కూడా అలాగే చూసుకుంటారు. ఆయ‌న చాలా మంచి వ్య‌క్తి. మ‌రిన్ని హిట్లు రావాలి.

* మీ త‌ర్వాత క‌న్న‌డ‌ సినిమా ఎంత వ‌ర‌కు వ‌చ్చింది?
- న‌ట‌సార్వ‌భౌమ క‌న్న‌డ‌లో నా తొలి సినిమా. మ‌ల‌యాళం, త‌మిళ్‌, తెలుగు బాగానే వ‌చ్చు. కానీ క‌న్న‌డ నాకు తెలియ‌దు. అందులోనూ నేను తొలిసారి లాయ‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తున్నా. లాయ‌ర్ అంటే ఎంత మాట్లాడాలో మీకు అందరికీ తెలుసు క‌దా. అందుకే ఎక్స్ ప్రెష‌న్ ప్ర‌యార‌టీ అని పునీత్‌సార్ చాలా సాయం చేశారు. ఎన్ని టేకులైనా చాలా హెల్ప్ చేశారు. ఆయ‌న ఎంతో డౌన్ టు ఎర్త్ గా ఉన్నారు. నేను క‌న్న‌డ‌లో డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డం లేదు. ట్రై చేస్తే వ‌స్తుందేమో.. కానీ నా డ‌బ్బింగ్ వ‌ల్ల సినిమాకు ఇబ్బంది ఉండ‌కూడ‌దు. షూటింగ్ ఉండ‌టం వ‌ల్ల `తేజ్ ఐ ల‌వ్యూ`లోనూ నేను డ‌బ్బింగ్ చెప్ప‌లేదు.

* గ‌ర్ల్ నెక్స్ట డోర్ పాత్ర‌లే చేస్తున్నారు. అందులో నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని అనుకుంటున్నారా?
- నాకు వ‌చ్చిన పాత్ర‌ల్లో బెస్ట్ అనిపించిన‌వాటిని నేను ఎంపిక చేసుకుంటున్నా. గ‌ర్ల్ నెక్స్ట్ డోర్ అనే ఇమేజ్ గురించి నేనేమీ ఇబ్బంది ప‌డ‌టం లేదు. కానీ సేమ్ ఎక్స్ ప్రెష‌న్స్ కాకుండా, డిఫ‌రెంట్‌గా చేయాల‌ని నాక్కూడా ఉంది. అలాంటి వైవిద్య‌మైన పాత్ర‌ల కోసం ఎదురుచూస్తున్నా. ఇప్పుడు కొన్ని స్క్రిప్ట్ లు వింటున్నా. ఇంకా ఏమీ డిసైడ్ చేయ‌లేదు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved