pizza
Anup Rubens interview (Telugu) about Nene Raju Nene Mantri
ప్ర‌తిక్ష‌ణం అప్‌డేట్ అవుతుంటాను - అనూప్ రూబెన్స్
You are at idlebrain.com > news today >
Follow Us

19 August 2017
Hyderabad

అనూప్ రూబెన్స్ ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ మ్యూజిక్ డైర‌క్ట‌ర్‌. ఒక‌వైపు పెద్ద హీరోల చిత్రాలు చేస్తున్నారు. మ‌రోవైపు త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన అవ‌కాశాల‌ను వ‌దులుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌టం లేదు. పైగా ప్ర‌తి ట్యూన్‌లోనూ కొత్తద‌నం ఉండేలా ప్ర‌య‌త్నిస్తున్నారు. తాజాగా ఆయ‌న రానాతో `నేనే రాజు నేనే మంత్రి` చేశారు. బాలకృష్ణ సినిమా `పైసావ‌సూల్‌`కి సంగీతం చేస్తున్నారు. అఖిల్ చిత్రం చేతిలో ఉంది. ఈ క్ర‌మంలో ఆయ‌న శ‌నివారం విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు...

* `నేనే రాజు నేనే మంత్రి` గురించి చెప్పండి?
- చాలా మంచి స్క్రిప్ట్. అనుకున్న‌ట్టుగానే హిట్ అయింది. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ తీస్తున్న‌ట్టు తేజ‌గారు చెప్పారు. నాకేమో ఇలాంటి జోన‌ర్ సినిమా చేయ‌డం తొలిసారి. అందుకే ఎగ్జ‌యిటింగ్‌గా అనిపించింది. మ్యూజిక్ కూడా డిఫ‌రెంట్‌గా చేయాల‌నుకున్నా. చాలా ట్యూన్లు కంపోజ్ చేశా. నేను ఎంత తాప‌త్ర‌యంతో చేసినా, సినిమాకు ఏం కావాలో తేజ‌గారికి చాలా బాగా తెలుసు. అందుకే ఆయ‌న వాటినే ఎంపిక చేసుకున్నారు.

* ఇంత‌కు ముందే చేసిన ట్యూన్ల‌ను ఈ సినిమా కోసం వాడార‌ని తెలిసింది..
- అవునండీ. తేజ‌గారితో ఇంత‌కు ముందే `సావిత్రి` అనే సినిమా చేయాల్సిందే. అది వ‌ర్క‌వుట్ కాలేదు. ఆ సినిమా కోసం అప్ప‌ట్లో ఆరు పాట‌లు చేశాం. వాటిలో రెండిటిని ఈ సినిమా కోసం వాడాం. `జోగేంద్ర‌..`, `దేవుడితో.. `పాట‌లు అలా తీసుకున్న‌వే. తేజ‌గారితో కొన్ని ఏళ్లుగా ట్రావెల్ అవుతున్నా. దాంతోనే.. ఈ సినిమా కంపోజ్ చేయ‌డం ఈజీ అయింది.

* రానాతో తొలిసారి సినిమా చేసిన‌ట్టున్నారు?
- రానాతో ప‌నిచేయ‌డం నాకు ఇది తొలిసారి. రానా నిగ‌ర్వి. హీరో అనే భావ‌నే ఆయ‌న‌లో ఉండ‌దు. ఈ సినిమాకు ప‌నిచేయ‌డం వ‌ల్ల ఆయ‌న ద‌గ్గ‌ర చాలా విష‌యాలు నేర్చుక‌న్నా.

interview gallery

* బాల‌య్య‌తోనూ తొలిసారి ప‌నిచేసిన‌ట్టున్నారు?
- అవునండీ. పూరి సార్‌తో చాలా సినిమాలు చేశాను. ఆ క్ర‌మంలోనే పూరి సార్ `పైసా వ‌సూల్‌`కి పిలిచారు. ఈ సినిమాలో బాల‌య్యగారు ఒక మంచి పాట కూడా పాడారు. చాలా బాగా పాడారు. ఆయ‌న‌తో పాట పాడించాల‌నే ఐడియా నాదీ, పూరిగారిదీ. బేసిగ్గా బాల‌య్య‌గారికి సంగీతం అంటే ఇష్టం. సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ స‌మ‌యంలోనూ ఆయ‌న పాల్గొంటారు.

* ఇప్పుడు ఇంకేం సినిమాలు చేస్తుంటారు?
- అఖిల్ తో కూడా ఓ సినిమా చేస్తున్నాను. అందులోనూ అఖిల్‌తో ఓ సినిమా పాట పాడాను.

* ప్ర‌తి సినిమా.. చేసేట‌ప్పుడు మిమ్మ‌ల్ని మీరు ఎలా అప్‌డేట్ చేసుకుంటారు?
- కొత్త ద‌ర్శ‌కుడితో ప‌నిచేసినా, సీనియ‌ర్ ద‌ర్శ‌కుడితో ప‌నిచేసినా సంగీతం ఎప్పుడూ చాలెంజింగ్ గా ఉంటుంది. ప్ర‌తి ద‌ర్శ‌కుడికీ ఓ స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ లో ట్యూన్ చేయ‌డం ఓ సంగీత ద‌ర్శ‌కుడిగా చాలెంజింగ్‌గా ఉంటుంది. ఇప్పుడొస్తున్న వాళ్ల‌లో చాలా మంది కొత్త థాట్స్ తో వ‌స్తున్నారు. దాని ప్ర‌తిఫ‌ల‌మే ఇప్పుడు కొత్త‌ద‌నం వ‌స్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు నేను కూడా సంగీత‌ప‌రంగా అప్‌డేట్ అవుతున్నాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved