pizza
Arun Pawar interview (Telugu) about Vajrakavachadhara Govinda
`వజ్రకవచధర గోవింద` మంచి కామెడీ క‌మ‌ర్షియ‌ల్ చిత్ర‌మే కాదు.. సినిమాలో మంచి ఎమోష‌న్స్ కూడా ఉన్నాయి - దర్శకుడు అరుణ్‌ పవార్‌
You are at idlebrain.com > news today >
Follow Us

10 June 2019
Hyderabad

స్టార్‌ కమెడియన్‌ సప్తగిరి, యంగ్‌ డైరెక్టర్‌ అరుణ్‌ పవార్‌ కాంబినేషన్‌ లో వచ్చిన 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' ఎంతటి ఘ‌న విజయాన్ని సాధించిందో మనందరికీ తెలుసు. ప్రస్తుతం వీళ్లిద్దరి కాంబినేషన్‌లో శివ శివమ్‌ ఫిలిమ్స్‌ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం 'వజ్రకవచధర గోవింద'. జూన్‌ 14న గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతున్న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ బ్రహ్మయ్య విడుదలచేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు అరుణ్‌ పవార్‌ ఇంటర్వ్యూ. ...

మీ గురించి చెప్పండి?
- మాది నెల్లూరు జిల్లా. నేను ఇంటర్మీడియట్‌ అయిపోగానే విజువల్‌ ఎఫెక్ట్ కోర్సు నేర్చుకున్నాను. నేను గత 10 సంవత్సరాలుగా చాలా మంది దర్శకులతో కలిసి పనిచేశాను. ముఖ్యంగా స్టార్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ గారి దగ్గర 'అతడు' సినిమా నుండి 'అఆ' వరకు దాదాపు అన్ని సినిమాలకు పని చేశాను. ఒక సినిమాకు విజువల్‌ ఎఫెక్ట్‌ చేయడమంటే సెట్‌లోకి వెళ్లి.. దర్శకుడి విజన్‌కి తగ్గట్లుగా ఆ సినిమాకు గ్రాఫిక్స్‌ అందివ్వడం. అలా చాలా మంది దర్శకులతో పని చెయ్యడంతో నాకు దర్శకత్వం మీద అవగాహన ఏర్పడింది. ఒక దర్శకుడు ఎలా ఆలోచిస్తారు. అతనికి ఎం కావాలి అనే విషయాలు తెలుసుకుని ఒక షార్ట్‌ ఫిలిం తీశాను. దానికి మంచి కాంప్లిమెంట్స్‌ వచ్చాయి. తరువాత 'బెస్ట్‌ యాక్టర్స్‌' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాను.

`సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌` సినిమా తీసే క్రమంలోనే ఈ సినిమా అనుకున్నారా?
- సప్తగిరితో నేను తీసిన `సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌` సినిమాకు డబ్బుతో పాటు మంచి ప్రశంసలు వచ్చాయి. అలాగే అప్పుడు డీమానిటైజేషన్‌ టైంలో కూడా డిస్ట్రిబ్యూటర్స్‌ ఫోన్‌ చేసి అభినందించారు. ఆ సినిమా చేస్తున్న సమయంలోనే ఈ కాన్సెప్ట్ అనుకున్నాను. 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' సినిమా విడుదలై మంచి హిట్‌ సాధించిన తరువాత మళ్ళీ సప్తగిరిగారు నా కంఫర్ట్‌ జోన్‌ అని ఈ సినిమా చేయడం జరిగింది.

ఈ ప్రాజెక్టులోకి మహేంద్ర ఎలా ఇన్వాల్వ్‌ అయ్యారు?
- మహేంద్ర గారు సప్తగిరికి మంచి ఫ్రెండ్‌. నేను ఆయనతో కలిసి ఒక ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ మూవీ చేద్దాం అనుకుంటున్న సమయంలో మహేంద్రగారు ఈ స్టోరీని సప్తగిరి తగ్గట్లు మౌల్డ్‌ చేసి ఆడియన్స్‌కి పూర్తి స్థాయి వినోదాన్ని అందించే విధంగా ఈ సినిమాను తెరకెక్కించాను.

`వజ్రకవచధర గోవింద` టైటిల్‌ జస్టిఫికేషన్‌ ఏంటి?
- ఈ సినిమాలో సప్తగిరి క్యారెక్టర్‌ పేరు గోవింద్‌. అతను ఒక వజ్రానికి ఎలా కవచంలా నిలబడ్డాడు అనేది కాన్సెప్ట్‌. అందుకే ఆ టైటిల్‌ అని పెట్టాం. అలాగే 'వజ్రకవచధర గోవింద' అనేది వేంకటేశ్వరుని సహస్ర నామాల్లో ఒకటి. అలా టైటిల్‌ కొంచెం లెంగ్తీ అయినా ఎన్ని సార్లు తలచుకుంటే అంతమంచిది అని ఆ టైటిల్‌నే కన్ఫర్మ్‌ చేశాం.

ఈ సినిమాలో ఒక స్పెషల్‌ సాంగ్‌ ఉంది కదా దాని గురించి చెప్పండి?
- కథానుగుణంగా ఈ సినిమా క్లైమాక్స్‌లో హీరో గతం మర్చి పోయి పిచ్చివాడిలా ప్రవర్తిస్తూ ఉంటాడు. వారిలో జబర్దస్త్‌ ఆర్టిస్టులు మొత్తం కలిసి అతనికి గతాన్ని గుర్తుచేసే క్రమంలో ఈ సాంగ్‌ వస్తుంది. ఆ జబర్దస్త్‌ బ్యాచ్‌కి లీడర్‌గా శ్రీనివాస్‌ రెడ్డి నటించారు. ఈ సాంగ్‌ రైట్స్‌ని చైనా నుండి తీసుకోవడం జరిగింది. ఆ సాంగ్‌ ఆడియన్స్‌ నుండి మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

సప్తగిరి క్యారెక్టరైజేషన్‌ గురించి?
- ఈ సినిమాలో సప్తగిరి ఒక దొంగ. వాళ్ళ ఊరిలో ఒకరి ద‌గ్గ‌ర మోసపోయి..ఆ ఊరు వదిలేసి బయటకి వచ్చి ఎలాగైనా డబ్బు సంపాదించి ఆ ఊరును బాగుచేయాలని దొంగలా మారతాడు. ఆ దారిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అలా మనం చేసే పని గొప్పదైన వెళ్లే దారి కూడా మంచిది అయితేనే ఆ దేవుడి అనుగ్రహం ఉంటుంది అని తెలుసుకొని మంచివాడిలా మారతాడు. ఆ క్యారెక్టర్‌కి సప్తగిరి తన బెస్ట్ పెర్‌ఫామెన్స్‌ ఇచ్చారు. తనతో నాకు కంఫర్ట్‌ ఉంది. తనతో కలిసి మళ్ళీ వర్క్‌ చెయ్యాలి అనుకుంటున్నాను.

ట్రైలర్‌ చూస్తుంటే సప్తగిరిని కమెర్షియల్‌ హీరోగా రిజిస్టర్‌ చేసారు అనిపించింది?
- అలాంటిదేం లేదు. ఈ సినిమాలో సప్తగిరి కామెడీ హీరోగానే కనిపిస్తారు. కమర్షియల్‌ లెవెల్లో మాస్‌ ఎలివేషన్స్‌ ఉన్నా కూడా అవి కామెడీ పంథాలోనే ఉంటాయి. కామెడీతో పాటు సెకండ్‌ హాఫ్‌లో మంచి సెంటిమెంట్‌ కూడా ఉంటుంది. అది థియేటర్‌లో ఆడియన్స్‌ని తప్పకుండా కంటతడి పెట్టిస్తుంది.

కర్నూల్‌ గుహలు చాలా డేంజరస్‌ కదా.. అక్కడ షూటింగ్‌ చేయడానికి ప్రత్యేకమైన కారణం ఏదయినా ఉందా?
- లేదు. అది కేవలం బడ్జెట్‌లో తెరకెక్కించడం కోసం ఆలా రిస్క్‌ చేసాం. ఆ సీక్వెన్స్‌ సీజీలో చేస్తే బడ్జెట్‌ ఐదు రేట్లు పెరిగే అవకాశం ఉంది. మనం విజువల్‌ ఎఫెక్ట్‌ ఎప్పుడు వాడతాం అంటే రియల్‌గా చేసిన దానికంటే తక్కువ ఖర్చు అయితే వాడతాం. అందుకనే రియల్‌ లొకేషన్స్‌లో షూట్ చేశాం

ఈ సినిమాను తెలుగు రాష్టాల్లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ బ్రహ్మయ్య విడుదల చేస్తున్నారు..
- అవునండి! ఈ సినిమా టీజర్‌ చూసి బ్రహ్మయ్య మా ప్రొడ్యూసర్స్‌ని కాంటాక్ట్‌ అయ్యారు. అలాగే సినిమా చూసి ప్యానీ రేటుతో ఈ సినిమా విడుదల హక్కులు తీసుకున్నారు. ఆయన చాలా పెద్ద సినిమాలను డిస్ట్రిబ్యూట్‌ చేశారు. ఆయన మా సినిమా రైట్స్‌ తీసుకోవడం చాలా హ్యాపీ. ఆయనకు ఈ సినిమా మంచి లాభాలు తెచ్చిపెడుతుంది అనే నమ్మకం ఉంది.

మీ నెక్స్ట్‌ ప్రాజెక్ట్స్‌?
- ఈ సినిమా తరువాత ఒక మంచి లవ్‌స్టోరీని సిద్ధం చేసి కె ఎస్‌ రవీంద్ర(బాబి)గారికి చెప్పాను. ఆయనకు నచ్చడంతో నిర్మించ‌డానికి ముందుకు వచ్చారు. హీరో కోసం చూస్తున్నాం. ఫైనలైజ్‌ అయ్యాక ఆ వివరాలు మీకు వెల్లడిస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు డైరెక్టర్‌ అరుణ్‌ పవార్‌.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved