pizza
Ashok interview (Telugu) about Darshakudu
'దర్శకుడు' సినిమా బ్యాక్‌డ్రాప్‌లో సాగే అందమైన ప్రేమకథ - అశోక్‌
You are at idlebrain.com > news today >
Follow Us

31 July 2017
Hyderabad

సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకంపై బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్‌, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలిసి సుకుమార్‌ నిర్మిస్తున్న చిత్రం 'దర్శకుడు'. హరి ప్రసాద్‌ జక్కా దర్శకుడు. అశోక్‌, ఇషా జంటగా నటిస్తున్నారు.ఈ చిత్రం ఆగస్ట్‌ 4న గ్రాండ్‌ రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా హీరో అశోక్‌తో ఇంటర్వ్యూ విశేషాలు..

జర్నీ అలా మొదలైంది...
- నేను 'వన్‌ నేనొక్కడినే' సినిమాకు సుకుమార్‌గారి దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాను. హరిప్రసాద్‌గారు, సుకుమార్‌గారు మంచి స్నేహితులు. హరిప్రసాద్‌గారు ఈ 'దర్శకుడు' సినిమా కథను తయారు చేసుకుని సుకుమార్‌గారికి వినిపించారు. ఆయన నెరేషన్‌ నచ్చడంతో హరిప్రసాద్‌గారినే డైరెక్ట్‌ చేయమని అన్నారు. అలా 'దర్శకుడు' సినిమా ప్రారంభం అయ్యింది. సినిమా చేయాలనుకోగానే హరిప్రసాద్‌గారు అశోక్‌తో ఈ సినిమా చేస్తానని అనగానే ముందు సుకుమార్‌గారు షాకయ్యారు. 'వాడు కొత్త వాళ్ల ముందు నిలబడాలంటేనే సిగ్గుపడతాడు..వాడితో ఎందుకులే కొత్తవాళ్లతో చేద్దాం' అని సుకమార్‌గారు అంటే హరి ప్రసాద్‌గారు 'లేదు, నేను అశోక్‌తోనే ఈ సినిమా చేస్తాను. నేను తనతో చేయించుకుంటాను' అనడంతో హీరోగా నా జర్నీ మొదలైంది.

ఆయనపై నమ్మకంతో సరేనన్నాను...
- సుకుమార్‌గారు నా దగ్గరకు వచ్చి 'నేను, హరిప్రసాద్‌గారు నిన్ను హీరోగా పెట్టి సినిమా చేస్తున్నాం' అని అన్నారు. నేను ఓ రోజు టైం కావాలని అడిగి ఆలోచించాను. నాకు ఇప్పుడు వచ్చిన అవకాశం కూడా సినిమాకు సంబంధించే కావడం, అవకాశం వెతుక్కుని రావడంతో హీరోగా చేయాలని నిర్ణయించుకున్నాను. అయితే హరిప్రసాద్‌గారిని కలిసి 'నాకు కాస్తా మోహమాటం ఎక్కువ. మీరు నాతో చేయించుకుంటాననే నమ్మకం ఉంటే నేను కూడా చేస్తాను' అని అన్నాను. నువ్వు ఓకే అంటే నేను చూసుకుంటానని హరిప్రసాద్‌గారు చెప్పడంతో నేను కూడా సరేనని చెప్పేశాను.

interview gallery

వాళ్లను ఫాలో అయిపోతానంతే...
- హీరోగానే కొనసాగుతానా.., దర్శత్వం వైపు అడుగులేస్తానా... అని ఇప్పుడే చెప్పలేను. సుకుమార్‌, హరిప్రసాద్‌గారితో ట్రావెల్‌ అవుతున్నాను కాబట్టి వారేం చెబితే అది ఫాలోఅయిపోతానంతే. కాకపోతే ఎప్పటికైనా దర్శకత్వం చేస్తాను.

కథ గురించి..
- సినిమా బ్యాక్‌డ్రాప్‌లో సాగే అందమైన ప్రేమకథ. హీరోయిన్‌ ఈషా ప్యాషన్‌ డిజైనర్‌. ఇద్దరి మధ్య సాగే ప్రేమకథలో సినిమా షూటింగ్‌ సీన్స్‌ ఉంటాయి.

బాగా చేశానని మెచ్చుకున్నారు..
- సినిమా చాలా వచ్చింది. డైరెక్టర్‌ హరిప్రసాద్‌గారికి ఏం కావాలో దాన్ని చేసేశాను. సినిమా ఫస్ట్‌ కాపీ చూసేటప్పుడు నేను కూడా బాగా చేసేశాననిపించింది. సుకుమార్‌గారు సినిమా చూశారు...హ్యాపీ. 'నాకు ఫోన్‌ చేసి బాగానే చేశావ్‌ రా, వాయిస్‌ కూడా బావుంది' అని అన్నారు.

ఇష్టమైన దర్శకుడు, హీరో..
- ఇప్పుడున్న దర్శకుల్లో నాకు సుకుమార్‌గారంటే పర్సనల్‌గా ఇష్టం. సుకుమార్‌గారు కాకుండా రాజమౌళిగారంటే ఇష్టం. హీరోల్లో చిరంజీవిగారంటే ఇష్టం.

డైరెక్టర్‌ హరిప్రసాద్‌ గురించి..
- నటన పరంగా నేనేమీ గొప్ప‌గా చేయలేదు. దర్శకుడు హరి ప్రసాద్‌గారిని ఫాలో అయ్యానంతే. నేను బాగా చేసినా, చేయకపోయినా క్రెడిట్‌ అంతా ఆయనకే దక్కుతుంది. సీన్‌ పేపర్‌ ఇచ్చేసేవారు. మమ్మల్ని యాక్ట్‌ చేయమనేవారు. ఆయనకు కావాల్సిన అవుట్‌పుట్‌ వస్తే సరి, లేకుంటే ఆయనే చేసి చూపించేవారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved