pizza
Beeram Sudhakar Reddy interview (T) about Subrahmanyapuram
`సుబ్ర‌హ్మ‌ణ్యపురం` ఓ డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ - బీరం సుధాక‌ర రెడ్డి
You are at idlebrain.com > news today >
Follow Us

5 December 2018
Hyderabad

సుమంత్‌, ఈషా రెబ్బా హీరో హీరోయిన్‌గా న‌టించిన చిత్రం `సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం`. సంతోష్ జాగ‌ర్ల‌పూడి ద‌ర్శ‌కుడు. సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బీరం సుధాకర్‌రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం డిసెంబ‌ర్ 7న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా నిర్మాత బీరం సుధాక‌ర రెడ్డి మాట్లాడుతూ

క‌థ న‌చ్చ‌డంతో....
- మాఇంటి కుల దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మా పూర్వికులు కర్నూల్‌ జిల్లా నంద్యాల దగ్గర సుబ్రహ్మణ్యేశ్వరపుతూర్‌ అనే గ్రామంలో సుబ్రమణేశ్వరస్వామి ఆలయం కట్టించారు. అప్పట్లో వారే ఆ ఆలయ ధర్మకర్తలుగా ఉండేవారు. ఈ సినిమా కూడా సుబ్రమణేశ్వర స్వామి పేరుతో ఉండడం, ఈ చిత్ర దర్శకుడు సంతోష్‌ ఈ సినిమా స్టోరీని వేరే ప్రొడ్యూసర్‌ కి చెప్పడం నేను విన్నాను. ఈ కథ నాకు బాగా నచ్చడంతో ఈ సినిమాను నేనే ప్రొడ్యూస్‌ చెయ్యాలని నిర్ణయించుకున్నాను.

కొత్త స‌బ్జెక్ట్‌...
- మా సినిమా 'కార్తికేయ' సినిమాకు పూర్తి బిన్నంగా ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తప్ప ఈ సినిమాలో కామన్‌ పాయింట్‌ ఉండదు. కొత్త డైరెక్టర్‌ అయినా ఈ సినిమాను చాలా బాగా హ్యాండిల్‌ చేశాడు.

స్టోరీ లైన్ ...
- ఈ సినిమా 'మానవ మేధస్సు గొప్పదా -దైవశక్తి గొప్పదా' అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా చూసిన తరువాత దైవాన్ని నమ్మని వాళ్ళు కూడా దైవం ఉంది అని నమ్మేవిధంగా ఈ సినిమాను దర్శకుడు సంతోష్‌ తెరకెక్కించడం జరిగింది. సినిమా మంచి డివోషనల్‌ థ్రిల్లర్‌ను సైంటిఫిక్‌ వేలో చూపించడం జరిగింది. పూర్వకాలం,సెకండ్‌ వరల్డ్‌ వార్‌ టైం నుండి దైవం యొక్క గొప్పతనం ఈ సినిమాలో చూపించడం జరిగింది. వాటితో పాటు ఆడియన్స్‌ కోరుకునే అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఈసినిమాలో ఉంటాయి.

స్పెష‌ల్ రీజ‌న్ లేదు...
- స్పెషల్‌ రీజన్‌ అంటూ ఏమి లేదండి! ఆ రోజు పోలింగ్‌ తరువాత వరుసగా మూడు రోజులు హాలిడేస్‌ ఉన్నాయి. అదే విధంగా కార్తీక మాసం చివరి రోజు కావడంతో మా సినిమా కూడా కుటుంబసమేతంగా చూడగలిగిన సినిమా అని ఆ రోజునే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం.

ఈ సినిమాలో సుమంత్‌ మీ చాయిసేనా?
ఈ స్టోరీకి సుమంత్‌ గారైతే యాప్ట్‌గా ఉంటుంది అని డైరెక్టర్‌ గారు ముందే చెప్పడం జరిగింది. తరువాత నాకు కూడా సుమంత్‌ అయితే బాగుంటుంది అని ఆయనను సంప్రదించడం జరిగింది.

థ్రిల్లర్‌ సినిమా అనగానే గ్రాఫిక్స్‌కు చాలా ఇంపార్టెన్స్‌ ఉంటుంది కదా! ఈ సినిమాలో గ్రాఫిక్స్‌ గురించి?
- ఈ సినిమాలో గ్రాఫిక్స్‌ చేసింది బాహుబలి లాంటి గొప్ప చిత్రాలకు పనిచేసిన అన్నపూర్ణ వాళ్లు. ఈ సినిమాలో కూడా కథకు అనుగుణంగా గ్రాఫిక్స్‌కు మంచిప్రాధాన్యం ఉంటుంది.

డైరెక్ట‌ర్ రించి...
- సంతోష్‌ ఈ సినిమా స్టోరీ నెరేట్‌ చేసే విదానం చాలా బాగా నచ్చింది. ఆ తరువాత అతను షార్ట్‌ ఫిలిమ్స్‌ చేసాడు అని తెలిసింది. సంతోష్‌ ఈ సినిమాను తనుచెప్పిన దానికంటే చాలా బాగా తీశాడు. సుమంత్‌ గారు 90 శాతం అని చెప్పారు కానీ నా వరకు సంతోష్‌ ఈ సినిమాను 100 శాతం అనుకున్న‌ట్లు తీశాడు.

వ‌రుస సినిమాలు చేస్తా..
- ఈ సినిమా తరువాత 2019 నుండి వరుసగా సినిమాలు చెయ్యాలని అనుకొంటున్నాను. కొన్ని స్టోరీస్‌ కూడా వింటున్న వాటిని ఫైనలైజ్‌ చేసి వివరాలు తెలియచేస్తాను.

నిర్మాతగా ఏమైనా ఇబ్బందులు లేవు..
- నాకు డైరెక్టర్‌కు మొదటి సినిమా కావడంతో సుమంత్‌ గారు కూడా ఈ సినిమాకు చాలా బాగా కోఆపరేట్‌ చేశారు. నేను నిర్మాతగా వారికి కావాల్సింది మాత్రమే ఏర్పాటు చేశాను. మిగతా ఆర్టిస్టులు కూడా అవుట్‌ డోర్‌ షూటింగ్‌ కోసం చాలా దూరం ప్రయాణం చేశారు. వారందరి కష్టానికి ఈ సినిమా ద్వారా మంచి ఫలితం లభిస్తుంది అని నమ్ముతున్నాను.

 

 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved