pizza
Bellamkonda Srinivas interview (Telugu) about Saakshyam
సాక్ష్యం..ఓ కొత్త ప్రయత్నం - బెల్లం కొండ శ్రీనివాస్‌
You are at idlebrain.com > news today >
Follow Us

02 January 2018
Hyderabad

బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా శ్రీవాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ''సాక్ష్యం''. పూజా హెగ్డే హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత అభిషేక్‌ నామా నిర్మిస్తున్నారు. రేపు బెల్లంకొండ శ్రీనివాస్‌ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో..

'సాక్ష్యం' సినిమా గురించి..
మంచి కాన్సెప్ట్‌తో 'సాక్ష్యం' సినిమా చేస్తున్నాను. కథాబలం ఉన్న సినిమా. 60 రోజులుగా ఈ సినిమా కోసం పీటర్‌ హెయిన్స్‌ పనిచేస్తున్నారంటే సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. న్యూ ఏజ్‌ మేకింగ్‌. చాలా కొత్తగా ఉంటుంది. రేపు సినిమా చూస్తే..కొత్త ప్రయత్నమని మీరే అంటారు.

ఇండియన్‌ స్క్రీన్‌పై రాని యాక్షన్‌ సీన్స్‌..
- ఇప్పటి వరకు ఇండియన్‌ స్క్రీన్‌ పైన రాని స్టంట్స్‌ ఫ్లై బోర్డింగ్‌, జెట్‌స్కీస్‌ వంటి వాటిని దుబాయ్‌కు వెళ్లి స్పెషల్‌గా ట్రైనింగ్‌ తీసుకుని వాటిని తెరపై నేనే స్వయంగా చేశాను. 10 రోజులు ట్రైనింగ్‌ తీసుకున్న తర్వాత 25 రోజులు షెడ్యూల్‌ చిత్రీకరించాం. బిఎంఎక్స్‌ రైడింగ్‌ అనే కొత్త సైక్లింగ్‌ను ఈ సినిమా చూపిస్తున్నాం. బిఎంఎక్స్‌ సైక్లింగ్‌ అంటే సైకిల్‌పై కూర్చోకుండా నడపాలి. అలాగే ఈ సినిమాలో 5 మేజర్‌ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఉంటాయి. పంచభూతాలు మీద వచ్చే ఫైట్స్‌ ఇంటర్‌లింక్‌గా కాన్సెప్ట్‌ బేస్‌డ్‌గా ఉంటాయి.

పాత్ర గురించి..
- ఈ సినిమాలో అమెరికాలో పుట్టి పెరిగిన ఇంటర్నెట్‌ గేమ్‌ను తయారు చేసే డైౖరెక్టర్‌ పాత్రలో కనపడతాను. సినిమా దాదాపు 70 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ జనవరిలో క్లైమాక్స్‌ చిత్రీకరిస్తాం. తర్వాత న్యూయార్క్‌ షెడ్యూల్‌ ఉంటుంది. తర్వాత మూడు పాటల చిత్రీకరణతో సినిమా పూర్తవుతుంది.

యూనిక్‌ పాయింట్‌తో...
- సాధారణంగా కథల్లో మూడు రకాల కథలుంటాయి. ప్రేమ, ప్రతీకారం, త్యాగం అనే ముఖ్యమైన అంశాలుగా తీసుకునే కథను తయారు చేస్తారు. ఈ సినిమా విషయానికి వస్తే..ఇది ప్రతీకారానికి సంబంధించిన కథ. ఇప్పటి వరకు రివేంజ్‌లో మనం చూడని స్టయిల్లో ఉండే కథ. యూనిక్‌ కాన్సెప్ట్‌. శ్రీవాస్‌గారు లక్ష్యం తర్వాత తయారు చేసుకున్న కథ ఇది. ఆయన మేకింగ్‌ స్టయిల్‌ చాలా బావుంటుంది. నా వయసుకు తగట్టు ఉండే కథ.

అది అంత సులువు కాదు...
- నేను చేస్తున్న సాక్ష్యం నాకు నాలుగో సినిమా. అన్ని సినిమాలు పెద్ద దర్శకులతోనే పనిచేశాను. అయితే ప్రతి సినిమా కోసం చాలా హార్డ్‌ వర్క్‌ చేశాను. 'జయజానకి నాయక' సినిమా కోసం ఆరు నెలల్లో 20 కిలోల బరువు పెరిగాను. అలా చేయడం చెప్పినంత సులువు కాదు. అలాగే 'సాక్ష్యం' కోసం బరువు తగ్గాను. విదేశాల నుండి ఇండియాకు వచ్చిన యువకుడి పాత్రలో కనపడతాను.

కథ బావుంటే చాలు..
- నేను పర్టికులర్‌గా ఇలాంటి సినిమాల్లోనే నటించాలని అనుకోవడం లేదు. మంచి కథ ఉంటే యాక్షన్‌ సన్నివేశాలు లేకున్నా, నటిస్తాను.

తదుపరి చిత్రం గురించి..
- ప్రస్తుతం సాక్ష్యం సినిమాపైనే ఫోకస్డ్‌గా ఉన్నాను. తదుపరి సినిమా ఏదనేది ఇంకా నిర్ణయించుకోలేదు. సాక్ష్యం సినిమాను వేసవిలో విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నాం

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved