pizza
Bhanushankar Chowdary interview about Ardhanaari
ప్రయోగాలు చేయడానికి పెద్ద హీరోలు ముందుకు రావడం లేదు – భానుశంకర్ చౌదరి
You are at idlebrain.com > news today >
Follow Us

29 June 2016
Hyderaba
d

అర్జున్ య‌జ‌త్‌మౌర్యాని హీరో హీరోయిన్లుగా భ‌ర‌త్ రాజ్ స‌మ‌ర్ప‌ణ‌లో  ప‌త్తికొండ సినిమాస్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం `అర్ధ‌నారి`. భానుశంక‌ర్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో ర‌వికుమార్‌.ఎమ్ నిర్మాత‌గా ఈ సినిమా తెర‌కెక్కింది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 1న విడుదలవుతుంది. ఈ సందర్బంగా దర్శకుడు భానుశంకర్ చౌదరితో ఇంటర్వ్యూ....

అర్ధనారి అంటే....
- `అర్ధనారిఅంటే సగం ఆడ‌స‌గం మ‌గ‌ఆర్ధ‌నారీశ్వ‌ర తత్వం. అందుక‌నే ఓ హిజ్రా గెట‌ప్‌ను తీసుకుని చేశాం. ఆ గెట‌ప్‌లో హీరో త‌న ల‌క్ష్యాల‌ను ఎలా సాధించాడ‌నేదే క‌థ‌. ఇది రివేంజ్ డ్రామా కాదు. ఇందులో అంద‌రూ కొత్త న‌టీన‌టులే. 55 మంది కొత్తవారిని ప‌రిచ‌యం చేస్తున్నాను. కొత్త‌వాళ్లైన‌ప్ప‌టికీ చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు.

ఈ సినిమా చేయ‌డానికి కార‌ణం...
అంద‌రూ ఎంట‌ర్‌టైన్మెంట్ అంటే కామెడి కాబ‌ట్టి క‌మెడియ‌న్స్ అవ‌ర‌స‌మ‌ని భావిస్తున్నారు. వారు లేకుంటే సినిమాలు ఆడ‌వ‌ని అనుకుని వారి వెనుక ప‌రిగెడుతున్నారు. కానీ నా ఫీలింగ్ చెప్పాలంటే ఓ ఎమోష‌న్ ఉంటే సినిమా ఆడ‌దాఒక‌ప్పుడు రేప‌టి పౌరులుప్ర‌తిఘ‌ట‌న‌దేశంలో దొంగ‌లు ప‌డ్డారు ఇలాంటి ఎమోష‌న‌ల్ పాయింట్స్ ఉన్న చిత్రాలు స‌క్సెస్ అయ్యాయి. క‌దామ‌రిప్పుడు మనం అలాంటి ఎమోష‌నల్ సినిమాల‌ను ప‌క్కన పెట్టేశాం. ఇప్పుడు ఆ ప‌ద్ధ‌తిలో సినిమా తీస్తే ఎలా ఉంటుంద‌ని ఆలోచించి దానికి పెట్ర్యియాటిజ‌మ్‌ను మిక్స్ చేసి తీసిన ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌.

సినిమాను ఆ ప‌రిస్థితికి తెచ్చేశారు...
క‌మెడియ‌న్ ఉంటేనే ఎంట‌ర్‌టైన్మెంట్ అనే ప‌రిస్థితికి సినిమాను తీసుకొచ్చేశారు. కానీ  దానికి భిన్నంగా కొత్త‌గా చేసిన సినిమాయే `అర్ధ‌నారి`. ఈ క‌థను ముందుగా చాలా మంది నేమ్ ఉన్న ఆర్టిస్ట్‌ల‌కు చెప్పాను. ఆ గెట‌ప్ కాస్తా డిఫ‌రెంట్‌గా ఉంద‌ని ఆలోచించి వ‌ద్ద‌న్నారు. దాంతో నేను కొత్త‌వారితో సినిమా చేశాను.

ఈ సినిమా ఉద్దేశం అది కాదు...
ఇంత‌కు హిజ్రాల‌పై వ‌చ్చిన కాన్సెప్ట్ అనేది లింగ బేదాల‌పై తీసిన సినిమాలు. కానీ ఇది అలాంటి సినిమా కాదు. అర్ధ‌నారి అయిన ఓ వ్య‌క్తి స‌మాజం కోసం ఏ చేశాడ‌నేదే సినిమా. అదేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.   

ట్రైనింగ్ ఇచ్చాం...
- హీరో అర్జున్ య‌జ‌త్ ఇందులో హిజ్రా పాత్ర‌ధారిగా క‌నిపిస్తాడు. అందుకోసం హిజ్రాల బాడీ లాంగ్వేజ్‌ను మ‌నం చాలా చోట్ల గ‌మ‌నించే ఉంటాం కాబట్టి అందుకు త‌గిన విధంగా త‌న‌కు ట్రైనింగ్ ఇచ్చాం. త‌ను ఎక్స‌లెంట్‌గా న‌టించాడు. ఒక క‌మ‌ల్ హాస‌న్‌ఓ ర‌జ‌నీకాంత్ వంటి అద్భుత‌మైన న‌టుడ‌ని చెప్ప‌గ‌ల‌ను. ఓ క‌మ‌ల్ హాస‌న్‌గారోర‌జ‌నీకాంత్ గారో చేయాల్సిన సినిమా ఇది. ఈ క‌థ‌ను ముందుగా పెద్ద  హీరోల‌కు చెప్పిన‌ప్పుడు హిజ్రా గెట‌ప్‌లో హీరోను ఆడియెన్స్ అంగీక‌రిస్తారా అని అడిగారు. ప్ర‌యోగం చేయ‌డానికి పెద్ద‌ హీరోలు అంగీక‌రించ‌డం లేదు. చిన్న‌వాళ్ళ‌తో చేస్తే వ్యాపారం ఉండ‌టం లేదు. కానీ నేను ధైర్యం చేసి 95 రోజుల షూటింగ్ చేశాను. కొత్త‌వాళ్ల‌తో సినిమా అని ఇన్నిరోజులు షూటింగ్ ఏంట‌ని అడిగిన వాళ్లు కూడా ఉన్నారు. అయితే సినిమాకు న్యాయం చేయాలంటే అన్ని రోజులు షూటింగ్ చేయాలనిపించి చేశాను.

మెసేజ్ చిత్రాలకు కొత్తవాళ్లు పనికిరారా?...
- ఒక `బారతీయుడువంటి యాక్ష‌న్ సినిమామెసేజ్ ఉన్న సినిమా ఎమోష‌న‌ల్ సినిమాను కొత్త వాళ్ల‌తో చేస్తారాఎవ‌రు చేయ‌రు. ఎందుకంటే కొత్త‌వాళ్ల‌తో అలాంటి సినిమా చూస్తే చూడ‌రు అనే దృక్ప‌థంతో సినిమాలు చేస్తున్నారు. ఒక‌ప్పుడు ప్ర‌తిఘ‌ట‌న వంటి గొప్ప సినిమాల‌న్నీ కొత్త వాళ్ల‌తో తీసిన‌వే.

అదే సినిమా కాన్సెప్ట్‌..
- బాధ్య‌త లేనివాడికి భార‌త‌దేశంలో బ్ర‌తికే హ‌క్కు లేదు అనేదే ఈ సినిమా  కాన్సెప్ట్‌. కొత్త‌వాళ్ల‌తో కొత్త ప్ర‌యోగం చేస్తున్నావ్ వ్యాపారం అవుతుందా అని అడిగారు కూడా. 20-30 కోట్ల వ్యాపారం ఉండే హీరో సినిమా విడుద‌ల‌య్యే అంత సంఖ్య‌లో  కానీ ఈరోజు నా సినిమా 300 థియేట‌ర్స్‌లో రిలీజ్ కానుంది.ఇండ‌స్ట్రీలోని టాప్ డిస్ట్రిబ్యూట‌ర్స్ సినిమా చూసి ఉద్వేగానికి లోనై లేచి నిల‌బ‌డి క్లాప్స్ కొట్టారు. నా సినిమా విడుద‌ల‌కు అండ‌గా నిల‌బ‌డ్డారు.

నేను ఇలా మాట్లాడుతున్నానంటే కార‌ణం వారే...
- నేను ఇంత ధైర్యంగా సినిమా గురించి మాట్లాడుతున్నానంటే కార‌ణం నిర్మాత‌లే. సినిమా తెర‌కెక్కించ‌డంలో నాకు ఎంతో స‌పోర్ట్ చేశారు.

త‌దుప‌రి చిత్రాలు...
`అర్ద‌నారి సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఈ సినిమా త‌ర్వాత నా త‌దుప‌రి సినిమాపై నిర్ణ‌యం తీసుకుంటాను. 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved