pizza
Bharat Margani interview (Telugu) about Oy Ninne
`ఓయ్ నిన్నే`తో అంద‌రూ క‌నెక్ట్ అవుతారు!
You are at idlebrain.com > news today >
Follow Us

4 October 2017
Hyderabad

`ఓయ్ నిన్నే`తో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మ‌వుతున్న రాజ‌మండ్రి కుర్రాడు భ‌ర‌త్ మార్గాని. ఎస్వీ కే సినిమా ప‌తాకంపై రూపొందుతున్న చిత్రం `ఓయ్ నిన్నే`. స‌త్యం చ‌ల్ల‌కోటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 6న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర హీరో బుధ‌వారం హైద‌రాబాద్‌లో విలేక‌రుల‌తో ముచ్చ‌టించారు. ఆ విశేషాలు..

* మీ గురించి చెప్పండి?
- మాది రాజ‌మండ్రి. చిన్న‌త‌నంలో ఊటీ షెప‌ర్డ్ కాన్వెంట్‌లో చ‌దువుకున్నా. ఆ త‌ర్వాత రాజ‌మండ్రిలోనూ చ‌దివా. హైద‌రాబాద్‌లో డిగ్రీ చేశాను. యు.ఎస్‌.లో ఎంబీఏ చేశా.

* మ‌రి సినిమాల్లోకి ఎలా వ‌చ్చారు?
- నేను చూడ్డానికి సినిమా హీరోలాగా ఉన్నాన‌ని, సినిమాల్లో ట్రై చేయ‌మ‌ని మా వాళ్లు అంద‌రూ చెప్పేవారు. దాంతో అప్ప‌టి నుంచే సినిమాల మీద ఆస‌క్తి పెరిగింది.

* అమ్మానాన్న కూడా అలాగే అనేవారా?
- వాళ్లు త‌ప్ప మిగిలిన వారంద‌రూ అనేవారు. బేసిగ్గా బిజినెస్ ఫ్యామిలీ కాబ‌ట్టి బిజినెస్ చూసుకుంటే బావుంటుంద‌ని వాళ్ల ఆలోచ‌న‌. మాకు రాజ‌మండ్రిలో సీఓ2 ఇండ‌స్ట్రీలు, చేప‌ల చెరువులు, క‌న్‌స్ట్ర‌క్ష‌న్ బిజినెస్‌లు ఉన్నాయి.

* మ‌రి సినిమాల్లోకి ఎలా వ‌చ్చారు?
- నేను కాలేజీ రోజుల నుంచే మోడ‌లింగ్ చేసేవాడిని. యు.ఎస్‌లో ఉన్న‌ప్పుడు ఓ షార్ట్ ఫిల్మ్ కూడా చేశా. ల్యాక్మీ ఫ్యాష‌న్ వీక్స్ లో ర్యాంప్ వాక్ కూడా చేశా. ఆ అనుభ‌వంతో మిస్ రాజ‌మండ్రి, మిస్ వైజాగ్‌, మిస్ ఏపీకు న్యాయ నిర్ణేత‌గా వ్య‌వ‌హ‌రించేవాడిని. అలా ఓసారి నిర్మాత వంశీ కృష్ణ శ్రీనివాస్‌ను క‌లిశా. ఆయ‌న ఈ సినిమా క‌థ చెప్పి, న‌టించ‌మ‌న్నారు.

* ఇంట్లో వాళ్లు అంగీక‌రించారా?
- మంచి అవ‌కాశం కావ‌డంతో అంగీక‌రించారు. వెంట‌నే వైజాగ్ స‌త్యానంద్ మాస్ట‌ర్‌గారి ద‌గ్గ‌ర శిక్ష‌ణ ఇప్పించారు. దాంతో సినిమాలో న‌టించ‌డం తేలికైంది.

* అంత‌కు ముందు చేసిన మోడ‌లింగ్ ఏమైనా ఉప‌యోగ‌ప‌డిందా?
- చాలా ఉప‌యోగ‌ప‌డింది. కెమెరా ఫియ‌ర్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి నాకు ఉప‌యోగప‌డింది మోడ‌లింగే.

* `ఓయ్ నిన్నే` క‌థ ఎలా ఉంటుంది?
- ప‌ల్లెటూళ్లో సాగే సినిమా అండీ. కొడుకు ప‌నికిరాని వాడ‌నుకునే తండ్రి.. ఆ తండ్రీ కొడుకుల మ‌ధ్య చిన్న చిన్న అంశాలు.. త‌న ఇంట్లో వ‌చ్చి కూర్చుని, త‌న క‌న్నా బాగా త‌న వారి ఆద‌ర‌ణ పొందుతున్న మ‌ర‌ద‌లిని చూసి కుళ్లుకునే ఆ కొడుకు.. ఇలా ఆద్యంతం చాలా బాగా సాగుతుంది.

* మీ రియ‌ల్ లైఫ్ గుర్తొచ్చిందా?
- రియ‌ల్ లైఫ్లో మ‌ర‌ద‌ళ్లు ఉన్నారు కానీ, మా ఇంట్లోకి వ‌చ్చి ఉన్న మ‌ర‌ద‌ళ్లు లేరు. ఇక తండ్రీ కొడుకుల అనుబంధం అంటారా.. అచ్చం మా ఇంట్లో మా నాన్న‌కు, నాకు మ‌ధ్య ఉన్న‌ట్టే అనిపించింది.

* `ఓయ్ నిన్నే` టైటిల్ గురించి చెప్పండి?
- సినిమాలో ఒక‌టీ, రెండు సార్లు నేను హీరోయిన్‌ని పిలుస్తాను. హీరోయిన్ న‌న్ను పిలుస్తుంది. అది గ‌మ‌నించిన ద‌ర్శ‌కుడు ఈ టైటిల్ పెట్టిన‌ట్టు ఉన్నారు.

* హైలైట్స్ ఏమి ఉంటాయి?
- గోదావ‌రి జిల్లాల యాస‌తో సినిమా సాగుతుంది. పాట‌లు ఇప్ప‌టికే ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందాయి. అన్నీ సంద‌ర్భానుసారంగా వ‌చ్చేలా ఉంటాయి. ఈ త‌రం వారికి త‌ప్ప‌క న‌చ్చే సినిమా.

* మీకు ఏ న‌టుడంటే ఇష్టం?
- నాగార్జున‌గారి మేన‌రిజ‌మ్స్, న‌ట‌న నాకు చాలా ఇష్ట‌మండీ.

* మీకు సినిమా రంగంలో ఎవ‌రైనా తెలిసిన‌వారున్నారా?
- మా అమ్మ‌గారి నాన్న‌గారు.. అంటే మా తాత‌గారు రాజ‌మండ్రిలో ఓ క‌ళామంట‌పం కూడా క‌ట్టించారండీ. ఆయ‌న‌కు న‌ట‌నానుభ‌వం ఉంది. ఇప్పుడు ప‌రిశ్ర‌మ‌లో కొంద‌రు తెలిసిన‌వారున్నారు.

* ఇంకే సినిమానైనా అంగీక‌రించారా?
- ఇంకో చిత్రం ఉందండీ. త్వ‌ర‌లోనే వివ‌రాలు చెబుతాను.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved