pizza
B Jaya interview about Vaisakham
నేను ఎంతో కష్టపడి, ఇష్టపడి తీసిన సినిమా 'వైశాఖం' - డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి.
You are at idlebrain.com > news today >
Follow Us

11 July 2017
Hyderabad

Dynamic lady director Jaya.B who is a specialist in delivering superhit films like 'Chantigadu', 'Gundamma Gaari Manavadu','Lovely' is now coming with a love and Family entertainer, 'Vaisakham'. Harish, Avantika played as hero, heroines of the film Produced by B.A. Raju under his RJ Cinemas banner. Film has been made as a cute love story involving family emotions with a backdrop of urban apartment culture. 'Viasakham' is all set to release worldwide on july 21st. Dynamic lady director Jaya.B shared her journey with 'Vaisakham'.

About Journey with 'Vaisakham'
I can say that this is a vary tough journey. I have gone through many ups and downs. A lot of things need to fall in place in order to get the exact output i wanted. I worked very hard for that. For example it is very hard to go to Kazkhstan even as a tourist. At a place like that our unit of 23 people used to travel carrying luggage weighing 400 kgs for 15 days to picturise songs. It took 3 months to process passports. It is very tough to shoot in Kazakhstan. We must the procedure of stamping the passports for every three days. Otherwise we may land in jail there.

About Film's Release On July 21st
For the last two months everyone i know is asking about the release date of this film. Finally we fixed the date. Like everyone else I am also eagerly waiting for the release date to watch the film along with audience in theatres. I am travelling with this film since one year. I have taken extra care and put all my efforts in crafting each and every frame of this film. This film will be completely different from my earlier films. I used to make films within a particular looking after budget so that to lessen the burden on Producers. But, for this film I was not hurried to finish it. I took my own time and worked with patience, commitment till i get what I want. You can find this difference in Trailers itself.

About Hero, Heroine Performance
All artists performed very well. Especially Hero, Heroine will impress the audience with their performance. They will get very good name, fame with this film. Our Hero is producer's hero. He is very well mannered and did very well in the film. You don't even get a feeling like you are watching a new Hero and Heroine while watching the film.

About Sai Kumar's Character
Saikumar garu played a very important character in this film. His character is main turning point in the film.

About Audience's Connect With The Film
At a stage, audience will forget that they are watching a film. They will feel that they are following real life. They will travel along with the characters. I can definitely say this. I am very confident that audience will connect with this film. I always want to introduce new talent. There are a lot of new faces in this film too. Everyone did great in their roles. Film came out very well. This is not my word, everyone who watched the songs and censor screening expressed the same. Censor officer himself said that he liked the film and appreciated us. He even said that he faced many situations in his life shown in the film. They certified our film with 'U/A'. When we asked for a 'U' as ours is a family film, He replied with a smile that there is an ample dosage of romance too. This film has a romantic song and some romantic scenes too. This is a very intense love story. Film passed censor without a single cut. We spent the last one year working very hard for this film. We didn't compromised even for a single frame. Cinematographer Vaalisetty Venkata Subba Rao garu took special care to ensure perfect D.I., C.G. output.

About Budget
I must agree that the budget of the film went a bit higher. We took this film as a challenge and prestigious project. We want audience and industry to speak about the grandeur of the film. So, we didn't compromised till we get the quality, output we want.

About Music In The Film
When I preferred Vasanth as music director, everyone around me suggested to work with previous music directors. But, I proceeded with Vasanth. I wanted the songs to be very grand. I listened to the song 'Country Chilaka' written by Ramajogayya Sastry for ten days. I even got confused about using the song in our film or not. The song is so grand and massy which is to be picturised on Big Stars like Mahesh, NTR. We were doubtful about picturising such a lavish song on new hero, heroine. But, we decided to do the song and we picturised it very lavishly. It will be a visual treat for audience. Shekhar master choreographed the song. He was shocked after listening to the song for the first time. He took up this song as a challenge. He conducted practice sessions of 8 hours per day for 15 days with hero, heroine. They worked very hard for the song. Audio is a big hit. Each and every song received unanimous response from listeners. Credit goes to Vasanth. I am confident that audience too will enjoy the songs from July 21st in theatres.

Reason Behind Apartments Backdrop
There are no joint families nowadays. Apartment culture is spreading in rural areas too. Most of the people are preferring apartments only. Apartments has different kinds of people. We tried to showcase the relations and clashes among the people living in apartments in a close to reality manner.

Who Is Behind The Richness Of The Film ?
Main reason is Raju garu. I strongly decided to make this film in a grand manner. I don't want to do a project which will be wrapped up in three, four months. I wanted to make a film which will be loved by all.

Reason Behind Turning Into Editor
I worked as editor for my previous film 'Lovely' too. This is my story, my screenplay, most of the dialogues were written by me. Characterisation, Framing, camerawork everything designed by me. I have an idea how this film should be. I feel more comfortable to do the editing work by myself.

About Co-Operation From Producer/Husband
He is always co-operative in any matter regarding the film. I used to worry whenever budget gets exceeded. But, He always says that we shouldn't compromise on anything costing the film. It is only because of Raju garu being a Producer I was able to picturise the songs in Kazakhstan. Any other Producer doesn't want me to shoot there.

About Films With Big Stars
It is not in our hands to do a film with a Star. Naga Chaitanya watched 'Vaisakham' songs and appreciated the visuals. He even expressed his consent to do a film with me in our banner if we find good story. Everything must fall in place. I will decide about my future projects after 'Vaisakham's success only.

నేను ఎంతో కష్టపడి, ఇష్టపడి తీసిన సినిమా 'వైశాఖం' - డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి.

'చంటిగాడు', 'గుండమ్మగారి మనవడు', 'లవ్‌లీ' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను రూపొందించి మహిళా దర్శకురాలుగా తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. తాజాగా హరీష్‌, అవంతిక జంటగా ఆర్‌.జె.సినిమాస్‌ బేనర్‌పై బి.ఎ.రాజు నిర్మాతగా జయ బి. రూపొందించిన లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'వైశాఖం'. అపార్ట్‌మెంట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో క్యూట్‌ లవ్‌స్టోరీతోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌ని కూడా సమపాళ్ళలో ఎలివేట్‌ చేస్తూ రూపొందిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూలై 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి.తో జరిపిన ఇంటర్వ్యూ.

'వైశాఖం' జర్నీ ఎలా వుంది?
- ఇది చాలా టఫ్‌ జర్నీ అనే చెప్పాలి. చాలా అప్‌ అండ్‌ డౌన్స్‌ చూశాను. నేను అనుకున్నది అనుకున్నట్టు రావాలంటే చాలా విషయాలు కలవాలి. అలా జరగడం కోసం చాలా కష్టపడ్డాను. ఉదాహరణకి కజక్‌స్తాన్‌ టూరిస్ట్‌గా వెళ్ళడమే కష్టం. అలాంటిది 23 మంది యూనిట్‌తో 400 కేజీల లగేజ్‌తో 15 రోజులు ట్రావెల్‌ చేసి సాంగ్స్‌ తీశానంటే ఎలా వుంటుందో ఊహించుకోండి. కేవలం ప్రాసెస్‌ అయి పాస్‌పోర్టులు రావడానికే మూడు నెలలు పైన పట్టింది. అక్కడ షూట్‌ చెయ్యడం చాలా కష్టం. మూడు రోజులకోసారి పాస్‌పోర్ట్‌ స్టాంపింగ్‌ చేయించుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే మూడునెలలు జైలు తప్పదు.

ఈనెల 21న సినిమా రిలీజ్‌ అవుతోంది. మీకెలా అనిపిస్తోంది?
- గత రెండు నెలలుగా సినిమా ఎప్పుడు రిలీజ్‌ అని అందరూ ఎంతో ఆసక్తిగా అడుగుతున్నారు. ఫైనల్‌గా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అయింది. మీలాగే నేను కూడా సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా? ప్రేక్షకుల మధ్యలో కూర్చొని ఎప్పుడు చూడాలా? అనే ఆతృత నాక్కూడా వుంది. దానికి కారణం వుంది. గత సంవత్సరంగా ఈ సినిమాతో నేను ట్రావెల్‌ చేశాను. ప్రతి ఫ్రేమ్‌ చాలా కమాండింగ్‌, ఇంట్రెస్టింగ్‌గా రావాలని చాలా కేర్‌ తీసుకున్నాను. ఇంతకుముందు సినిమాలకు, ఈ సినిమాకి చాలా డిఫరెన్స్‌ వుంటుంది. ఆ సినిమాలకు టైమ్‌ చూసుకునేదాన్ని. తొందరగా బడ్జెట్‌లో సినిమా తీసేసి ఇంట్రెస్ట్‌ పెరగకుండా, ప్రొడ్యూసర్‌కి బర్డెన్‌ అవ్వకుండా చెయ్యాలనే ఆతృత వుండేది. ఈ సినిమా విషయంలో చాలా కమిటెడ్‌గా, కూల్‌గా వర్క్‌ చేశాను. అది మీకు ట్రైలర్స్‌ చూస్తేనే అర్థమై వుంటుంది.

హీరో, హీరోయిన్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఎలా వుంటుంది?
- సినిమాలో నటించిన ఆర్టిస్టులంతా ఎంతో బాగా చేశారు. ముఖ్యంగా హీరో, హీరోయిన్లు. చాలా మంచి పేరు తెచ్చుకుంటారు. ఇండస్ట్రీకి చాలా హెల్ప్‌ అవుతారు. మా హీరో నిర్మాతల హీరో. మంచి బిహేవియర్‌ వున్న వ్యక్తి. చాలా బాగా చేశాడు. కొత్త హీరో, హీరోయిన్‌లను చూస్తున్నామన్న ఫీలింగ్‌ మీకు ఎక్కడా రాదు.

సాయికుమార్‌ క్యారెక్టర్‌ ఎలా వుంటుంది?
- సాయికుమార్‌గారు చాలా ఇంపార్టెంట్‌ క్యారెక్టర్‌ చేశారు. ఆయన క్యారెక్టరే కథని మలుపు తిప్పుతుంది.

'వైశాఖం' ఆడియన్స్‌కి ఎలాంటి అనుభూతిని కలిగిస్తుంది?
- ఒక సినిమా చూస్తున్నామన్న ఫీలింగ్‌ ఆడియన్స్‌ ఒక స్టేజ్‌లో మర్చిపోతారు. జీవితాన్ని, రియల్‌ లైఫ్‌ని ఫాలో అవుతున్నాం అనుకుంటారు. క్యారెక్టర్స్‌తో పాటు మీరూ ట్రావెల్‌ అవుతారు. అది మాత్రం నేను ఖచ్ఛితంగా చెప్పగలను. ఎప్పుడూ కొత్తవారిని ఇంట్రడ్యూస్‌ చెయ్యడానికి ఇంట్రెస్ట్‌ చూపిస్తాను. ఈ సినిమాలో కూడా కొత్తవారు వున్నారు. ఫైనల్‌గా సినిమా బాగా వచ్చింది. బాగా వచ్చిందనేది నేను చెప్పడం కాదు. పాటలు చూసినవారు, సినిమాను చూసిన సెన్సార్‌ వారు చెప్పారు. సినిమా చాలా బాగుంది. రియల్‌ లైఫ్‌లో ఇలాంటి సంఘటనలు చాలా ఫేస్‌ చేశాము అని సెన్సార్‌ ఆఫీసర్‌గారు చెప్పడమే కాకుండా ఇంత మంచి సినిమా తీసినందుకు మమ్మల్ని అప్రిషియేట్‌ చేశారు. మా సినిమాకి యు/ఎ సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఇది మంచి ఫ్యామిలీ సినిమా. యు ఇవ్వమని అడిగాము. మీ మిగతా సినిమాలకన్నా ఈ సినిమాలో రొమాన్స్‌ ఎక్కువ దట్టించారు. కాబట్టి యు/ఎ ఇవ్వాల్సిందేనని నవ్వుతూ చెప్పారు. అంటే ఈ సినిమాలో ఒక సాంగ్‌ చాలా రొమాంటిక్‌గా వుంటుంది. కొన్ని రొమాంటిక్‌ సీన్స్‌ కూడా వుంటాయి. ఇది బేసిక్‌గా ఇంటెన్స్‌ లవ్‌స్టోరీ. సినిమాలో సింగిల్‌ కట్‌ కూడా చెప్పలేదు. మీరు తీసిన సినిమాని ఇలాగే జనం చూడాలి. నేను కట్‌ చేసేది ఏమీ లేదు అన్నారు. దాన్ని బట్టి సినిమా ఏ రేంజ్‌లో వుందో అర్థం చేసుకోవచ్చు. సంవత్సరంపాటు ఈ సినిమాని తీర్చిదిద్దాం అని చెప్పొచ్చు. సింగిల్‌ ఫ్రేమ్‌లో కూడా కాంప్రమైజ్‌ అవ్వలేదు. మా సినిమాటోగ్రాఫర్‌ వాలిశెట్టి వెంకటసుబ్బారావుగారు డి.ఐ., సి.జి. వర్క్‌ బాగా చేయించారు.

మీ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా బడ్జెట్‌ ఎక్కువైంది?
- ఇది వాస్తవం. ఈసారి బడ్జెట్‌ ఎక్కువైంది. ఎందుకంటే ఇది ఛాలెంజింగ్‌గా తీసుకున్న సినిమా. ప్రేక్షకులు, ఇండస్ట్రీ 'వైశాఖం' చాలా బాగుంది, చాలా గ్రాండ్‌గా వుంది అని చెప్పుకోవాలి అనే ఇంటెన్షన్‌తో తీసిన సినిమా.

మీ సినిమాల్లో అన్నీ హిట్‌ సాంగ్సే వుంటాయి. ఈ సినిమా పాటల విషయంలో ఇంకా కేర్‌ తీసుకున్నట్టున్నారు?
- అవునండీ. నేను వసంత్‌ని ప్రిఫర్‌ చేసినపుడు నా ఫ్రెండ్స్‌, మీడియా, శ్రేయోభిలాషులంతా పాతవాళ్ళయితే బాగుంటుందని చెప్పారు. కానీ, పట్టుదలతో వసంత్‌తోనే ట్యూన్స్‌ చేయించాను. ట్యూన్స్‌ చేసినపుడే నాకు తెలుసు. ఒక గ్రాండియర్‌ని మైండ్‌లో పెట్టుకొని ఈ ట్యూన్స్‌ చేయించాను. ముఖ్యంగా రామజోగయ్యశాస్త్రిగారు రాసిన లాస్ట్‌ సాంగ్‌ 'కంట్రీ చిలకా..'. ఓ వారం పదిరోజులు ఆ పాట విన్నాను. ఈ పాట మన సినిమాలో పెట్టుకోవాలా? వద్దా? అనే కన్‌ఫ్యూజన్‌ వచ్చింది. ఎందుకంటే మహేష్‌, ఎన్టీఆర్‌ మీద తియ్యాల్సిన పాట అది. అంత గ్రాండియర్‌, అంత ఫాస్ట్‌ వుండే ఆ పాటని మన హీరో, హీరోయిన్‌ చెయ్యగలరా? అనుకుని కూడా మనం చెయ్యాలి, మన సినిమాలో ఆ పాట వుంటే బాగుంటుంది, ఒక విజువల్‌ ట్రీట్‌గా ఆడియన్స్‌కి ఇవ్వాలి, మనం కూడా అలాంటి సాంగ్‌ తియ్యగలం అని చూపించాలి అని ఒక ఛాలెంజ్‌తో చేసిన పాట. ఈ పాటను శేఖర్‌ మాస్టర్‌ చేశారు. పాట విని ఆయన షాక్‌ అయ్యారు. మన హీరో, హీరోయిన్‌ మీదే ఈ పాటను తీద్దామనుకున్నారా? అని అడిగారు. ఆయన కూడా ఈ పాటని ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నారు. 8 గంటల చొప్పున 15 రోజులపాటు ఈ పాట కోసం ప్రాక్టీస్‌ చేయించారు. అంటే ఈ పాట కోసం హీరో, హీరోయిన్‌, శేఖర్‌ మాస్టర్‌, నేను ఎంత కష్ట పడ్డామో తెలుస్తుంది. పాటల విషయంలో అంత కేర్‌ తీసుకున్నాం కాబట్టే ఆడియో అంత పెద్ద హిట్‌ అయింది. ఇప్పటివరకు సినిమాలో ఫలానా పాట బాగాలేదు అని చెప్పినవారు లేరు. అందరూ యునానిమస్‌గా పాటలు ఎక్స్‌ట్రార్డినరీగా వున్నాయని చెప్పారు. ఈ క్రెడిట్‌ వసంత్‌కి ఇవ్వాలి. 21నన ఈ పాటల్ని థియేటర్‌లో ఆడియన్స్‌ కూడా బాగా ఎంజాయ్‌ చేస్తారన్న కాన్ఫిడెన్స్‌ వుంది.

interview gallery

అపార్ట్‌మెంట్‌ బ్యాక్‌డ్రాప్‌లో కథ చెప్పడానికి రీజన్‌ ఏదైనా వుందా?
- ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు. అన్నీ మినీ ఫ్యామిలీసే. పల్లెటూళ్ళో కూడా అపార్ట్‌మెంట్‌ కల్చర్‌ వచ్చింది. ఇండివిడ్యువల్‌ ఇళ్ళు మెయిన్‌టెయిన్‌ చేసే కెపాసిటీ తగ్గింది. అందరూ అపార్ట్‌మెంట్స్‌నే ప్రిఫర్‌ చేస్తున్నారు. ఈ అపార్ట్‌మెంట్స్‌లో రకరకాల మనుషులు వుంటారు. వాళ్ళ మధ్య వచ్చే క్లాషెస్‌, వాళ్ళ మధ్య వుండే రిలేషన్స్‌షిప్స్‌ అనేవి ఎలా వుంటాయి అనేది ఒక రియాలిటీ. అంటే ఒక యదార్థ గాధని ఈ సినిమా ద్వారా చెప్పదలుచుకున్నాను.

బడ్జెట్‌ విషయంలో వెనకాడకుండా సినిమాని ఇంత రిచ్‌గా తియ్యడానికి మిమ్మల్ని ప్రోత్సహించిందెవరు?
- డెఫినెట్‌గా రాజుగారే. అయితే ఇలా చెయ్యాలి అని నేను బాగా డిసైడ్‌ అయ్యాను. ఎందుకంటే ఇండస్ట్రీ, ప్రేక్షకులు మెచ్చుకోవాలి. తీస్తే అలాంటి సినిమా తియ్యాలి. నేను జనరల్‌గా మూడు నెలలో ఏదో సినిమా తీశాం, రిలీజ్‌ చేశాం అన్నట్టు వుండకూడదు అని ఈసారి గట్టిగా డిసైడ్‌ అయ్యాను.

ఎడిటింగ్‌ కూడా మీరే చెయ్యడానికి కారణం?
- 'లవ్‌లీ' నేనే చేశాను, ఈ సినిమా కూడా నేనే చేశాను. ఇది నా కథ, నా స్క్రీన్‌ప్లే. ఇందులో మ్యాగ్జిమమ్‌ నేను రాసిన మాటలే వుంటాయి. క్యారెక్టరైజేషన్‌, ఫ్రేమింగ్‌, కెమెరా వర్క్‌ అన్నీ నా చేతుల్లో నుంచి వెళ్ళినవి. సినిమా ఎలా వుండాలి అనేది నాకు తెలుసు. దానికి అనుగుణంగా నేను ఎడిటింగ్‌ చేసుకునేటపుడు నాకు సౌకర్యంగా వుంటుంది.

దర్శకుడు, నిర్మాత భారాభర్తల్లాంటివారు అంటుంటారు. మీరు రియల్‌గా భార్యాభర్తలు. ఈ కోఆపరేషన్‌ ఎలా వుంది?
- సినిమా విషయంలో ఆయనెప్పుడూ కోఆపరేటివ్‌గానే వుంటారు. బడ్జెట్‌ విషయంలో ఎక్కువైపోతుందని నేనే బాధపడతాను. కానీ, ఆయన మాత్రం సినిమా బాగా రావాలి, ఎంత ఖర్చయినా ఫర్వాలేదు అంటారు. మరో ప్రొడ్యూసర్‌ అయితే పాటల కోసం కజక్‌స్తాన్‌ వెళ్తానంటే ఒప్పుకునేవారు కాదు. ఇక్కడే తియ్యమనేవారు.

స్టార్స్‌ కాంబినేషన్‌లో మీ సినిమా ఎప్పుడు వుంటుంది? ఆల్రెడీ నాగచైతన్య కూడా మీ బేనర్‌లో సినిమా చేస్తానని చెప్పారు?
- స్టార్‌ కాంబినేషన్‌లో సినిమా అనేది మన చేతుల్లో లేదు. నాగచైతన్యగారు 'వైశాఖం' పాటలు చూసి చాలా బాగున్నాయి, విజువల్‌గా కూడా చాలా గ్రాండ్‌గా వున్నాయి. మంచి కంటెంట్‌ వుంటే తప్పకుండా చేస్తానని 'వైశాఖం' టీజర్‌ రిలీజ్‌ ఫంక్షన్‌లో ఎనౌన్స్‌ చేశారు. ఏది ఏమైనా అన్నీ కుదరాలి కదా. 'వైశాఖం' పెద్ద హిట్‌ అయ్యాకే కొత్త సినిమా గురించి ఆలోచిస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved