pizza
Bunny Vasu interview (Telugu) about Geetha Govindam
'గీత గోవిందం' సక్సెస్‌ను ఊహించాను కానీ.. ఇంత పెద్ద రేంజ్‌లో ఉంటుందని ఊహించలేదు - బన్ని వాస్‌
You are at idlebrain.com > news today >
Follow Us

16 August 2018
Hyderabad

విజయ్‌దేవరకొండ, రష్మిక మందన్నా హీరో హీరోయిన్‌గా జి.ఎ 2 పిక్చర్స్‌ బ్యానర్‌పై పరుశురాం దర్శకత్వంలో బన్నివాస్‌ నిర్మించిన చిత్రం 'గీతగోవిందం'. ఆగస్ట్‌ 15న సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా నిర్మాత బన్నివాస్‌తో ఇంటర్వ్యూ...

సక్సెస్‌ రెస్పాన్స్‌ ఎలా ఉంది?
'గీతగోవిందం' సినిమా .. నిజాయతీతో చేసిన ప్రయత్నం. ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది.. హీరోకు మంచి క్రేజ్‌ ఉంది కాబట్టి సినిమా పెద్ద సక్సెస్‌ అవుతుందని అనుకున్నాం. అయితే ఈ రేంజ్‌ సక్సెస్‌ను మేం ఊహించలేదు. ఇంత భారీ కలెక్షన్స్‌ వస్తాయని ఊహించలేదు.

మీరు ప్రొడ్యూస్‌ చేసిన రెండు సినిమాలు సక్సెస్‌ అయ్యాయి కదా?
- నేను దర్శకుడితో ఓ బ్రదర్‌లా కలిసిపోతాను. తనకు ఏం కావాలనే విషయాన్ని అడగటానికి సంకోచించడు. సీన్‌ను అనుకున్నట్లు రాకపోయినా.. రీషూట్‌ చేసుకునేంత ఫ్రీడమ్‌ ఇస్తాను. వాళ్ల సినిమా అనే లెక్కతోనే ముందుకెళతాం. ఆ పాజిటివ్‌ నెస్‌ సినిమాలో కనపడుతుంది.

విజయ్‌ కథ వినగానే ఏమన్నాడు?
- పరుశురాం కథ విజయ్‌దేవరకొండకు బాగా నచ్చింది. అయితే తను డిఫరెంట్‌ సినిమాలు చేయాలనుకుంటున్న తరుణం కాబట్టి.. ఇలాంటి సమయంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సినిమాలు చేస్తే బావుంటుందా? అని అన్నాడు. 'నీ స్టయిల్లో నువ్వు సినిమాలు చెయ్‌. ఇలాంటి సినిమాలు చేస్తే బి టౌన్స్‌లో నీకు మార్కెట్‌ ఓపెన్‌ అవుతుంది.. కాబట్టి నువ్వు సినిమా చేస్తే బావుంటుంది' అని సలహా ఇచ్చాను. అది తనకు బాగా నచ్చింది. తను సినిమా చేయడానికి అంగీకరించాడు.

విజయ్‌లో స్పార్క్‌ ఏంటి?
- తనలో జెన్యూనిటీ ఉంది. అవసరం ఉన్నచోటే తను మాట్లాడుతాడు. లేకుంటే మాట్లాడడు. తను అందరితో కలిసి పోతాడు. సినిమాలో తను క్యారెక్టర్‌ ఎక్కడా.. ఎప్పుడూ మాట్లాడలేదు. అర్జున్‌రెడ్డి సినిమాలో రఫ్‌గా ఉండే హీరో.. ఈ సినిమాలో మేడమ్‌ మేడమ్‌.. అంటూ హీరోయిన్‌ వెనుక పడితే బావుంటుందా? అని నాకే అనిపించింది. అయితే నేను ఏదైతే డౌట్‌ పడ్డానో..ఆ విషయమే ప్రేక్షకులకు కనెక్ట్‌ అవుతుందని.. పరుశురాం, విజయ్‌ నమ్మారు.

అర్జున్‌రెడ్డి తర్వాత వస్తున్న సినిమా కాబట్టి.. ప్రేక్షకులు ఎలా రీసీవ్‌ చేసుకకుంటారో అని టెన్షన్‌ పడ్డారా?
- టెన్షన్‌ అయితే ఉంది కానీ.. బుజ్జి, విజయ్‌ మాత్రం సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది కాబట్టి.. కథను ఏమీ మార్చొద్దు అని అన్నారు. అర్జున్‌రెడ్డి తర్వాత యూత్‌కు కనెక్ట్‌ అయ్యే టైటిల్‌ పెడితే బావుంటుందని నేను అన్నాను. అయితే డైరెక్టర్‌ పరుశురాం మాత్రం గీత గోవిందం అనే టైటిలే బావుందని అన్నాడు. హీరోకి కూడా ఈ టైటిలే నచ్చడంతో చివరకు దీన్నే అనౌన్స్‌ చేశాం.

సినిమా సక్సెస్‌పై అందరూ అప్రిషయేట్‌ చేస్తున్నారు కదా?
- సాధారణంగా మంచి సినిమాలు రిలీజ్‌ అయినప్పుడు పెద్ద పెద్ద స్టార్స్‌ ట్విట్టర్‌లో మెసేజ్‌లు పోస్ట్‌ చేస్తుంటారు. అలాంటి సినిమా నేను కూడా చేయాలనే కోరిక నాకూ ఉండేది. ఆ కోరిక ఈ సినిమాతో తీరింది. మహేష్‌గారికి, చరణ్‌గారికి ఈ సందర్భంగా థాంక్స్‌ చెప్పుకుంటున్నాను.

సినిమా లీక్‌ అయిన తర్వాత ఇంత పెద్ద సక్సెస్‌ .. సెంటిమెంట్‌గా భావిస్తున్నారా?
- ఓ సినిమా లీకైతే ప్రొడ్యూసర్‌కి ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసు. పది రోజులు ఆ నరకాన్ని నేను అనుభవించాను. ఇంత కష్టపడి సినిమా చేసినప్పుడు ఎవరి లాప్‌టాప్‌లో ఉంది.. అని తెలిసినప్పుడు ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. హైప్‌ కోసం ఏవో కొన్ని ముక్కలు లీక్‌ చేశారనుకుంటే పరావాలేదు. కానీ ఎవరూ పూర్తి సినిమాను లీక్‌ చేయరు కదా..డిజిపి రేంజ్‌ ఆఫీసర్‌ రంగంలోకి దిగి.. లీక్‌ చేసిన వారిని పట్టుకున్నారు.

సినిమా సక్సెస్‌ అయింది కదా? ఇప్పుడు స్టూడెంట్‌పై పెట్టిన కేసులు పరిస్థితేంటి?
- సినిమా లీకుల్లో ఉన్న వారిని ఏ, బీ అనే రెండు గ్రూపులుగా విభజించాం. అందులో బీ గ్రూపులో స్టూడెంట్స్‌ ఉన్నారు. సినిమాను వాంటెడ్‌గా లీక్‌ చేసిన ఏ కేటగిరిలో వారిపై చర్యలు సివియర్‌గా ఉంటాయి. బి కేటగిరీలో వారిపై అంత గట్టి చర్యలు ఉండక పోవచ్చు. ఇంత పెద్ద సంస్థ చేసిన సినిమాకే ఇలాంటి పరిస్థితి ఉంటే.. చిన్న నిర్మాతల పరిస్థితేంటి..

interview gallery



కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయి?
- కలెక్షన్స్‌ మేం ఊహించిన దాని కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. సినిమా విడుదలైన రెండో రోజునే.. ఓవర్‌సీస్‌లో బ్రేక్‌ ఈవెన్‌ కావడం అంటే సినిమా సక్సెస్‌ రేంజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

కేరళ వరద బాధితులకు మీ వంతుగా సపోర్ట్‌?
- బన్ని సినిమాలను విడుదల చేస్తుండటం కారణంగా నాకు కేరళలో కూడా మంచి గ్రిప్‌ ఉంది. దాని వల్ల ఈ సినిమాను కేరళలో విడుదల చేశాను. వరదల్లో కూడా రెండు రోజుల్లో 20 లక్షల గ్రాస్‌ వచ్చింది. అది చూసి నాకే షాకయ్యింది. ఈ అమౌంట్‌ను వారికే ఇచ్చేస్తే న్యాయంగా ఉంటుందని అనిపించింది. తమిళనాడులో 20 లక్షలకు సినిమాను అమ్మితే... తొలి రోజునే సినిమాకు 1.18 కోట్ల రూపాయల గ్రాస్‌ వచ్చింది. అన్ని ఏరియాల్లో సినిమా ముందుగానే బ్రేక్‌ ఈవెన్‌ అయింది.

సినిమా చూసిన తర్వాత చిరంజీవి ఏమన్నారు?
- చిరంజీవిగారిని చూస్తే గౌరవం, భయంగా ఫీలయ్యే వాడిని. ఐదు నిమిషాలు కంటే ఎక్కువగా ఆయనతో ఎప్పుడూ మాట్లాడలేదు. అలాంటిది ఈ సినిమా విడుదలై తర్వాత గంటసేపు ఆయన ఇంటికి పిలిపించి మాట్లాడారు. ఆరోజు నేను ఆయనతో కలిసి తాగిన కాఫీ నా లైఫ్‌లో మరచిపోలేను. అదే నా బిగ్గెస్ట్‌ కాంప్లిమెంట్‌గా భావిస్తున్నాను.

తుదపరి చిత్రం?
- పరుశురాం దర్శకత్వంలోనే ఉంటుంది. ఏడాదిన్నర క్రితమే ఓ కథ చెప్పాడు. నాకు చాలా బాగా నచ్చేసింది. పక్క రోజు ఉదయమే నేను ప్రజాలో కొన్న ఫ్లాట్‌ను అడ్వాన్స్‌గా ఇచ్చేశాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా బుజ్జి నన్ను వదిలి వెళ్లడు. కాంటెంపరరీ మైథాలజీ కాన్సెప్ట్‌తో నడిచే కథ ఇది. చాలా మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మంచి మెసేజ్‌ ఉంటుంది.

బన్ని తదుపరి చిత్రం?
- ఆయన కథలు వింటున్నారు. ఇంకా ఏదీ ఫైనల్‌ కాలేదు. రెండు వారాల్లో ఆయన చేయబోయే సినిమా గురించి అనౌన్స్‌మెంట్‌ వస్తుంది.

 

 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved