pizza
Chetan Maddineni about Gulf
'గల్ఫ్‌' చిత్రం చేయడం వల్ల నటుడిగా కొత్త విషయాలు తెలుసుకున్నాను - చేతన్‌ మద్ధినేని
You are at idlebrain.com > news today >
Follow Us

4 July 2017
Hyderabad

శ్రావ్య ఫిలిమ్స్‌ బ్యానర్‌పై పి.సునీల్‌ కుమార్‌ రెడ్డి దర్శకత్వంలో యక్కలి రవీంద్రబాబు, యమ్‌.రామ్‌కుమార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'గల్ఫ్‌'. చేతన్‌ మద్ధినేని, డింపుల్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. త్వరలోనే సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా హీరో చేతన్‌ మద్ధినేని పాత్రికేయులతో తన అభిప్రాయాలను తెలియజేశారు...

నేపథ్యం...
- మాది వైజాగ్‌ చిన్నప్పుడు ఋషివ్యాలీలో చదివాను. ఇంజనీరింగ్‌ ఆంధ్రా యూనివర్సిటిలో చేశాను. నాన్న ఆమెరికాలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నడుపుతున్నారు. తొలి చిత్రం 'రోజుల మారాయి'.

క్యారెక్టర్‌ గురించి...
- 'గల్ప్‌' చిత్రంలో నేను శివ అనే కుర్రాడి పాత్రలో కనపడతాను. సిరిసిల్లలోని చేనేత కార్మికుడి కుటుంబానికి చెందినవాడే శివ. తన గ్రామంలో గల్ఫ్‌కు వెళ్ళిన స్నేహితుడిని చూసి ఎలాగైనా గల్ఫ్‌కు వెళ్ళాలని అనుకుంటాడు. ఎలాగెలాగో ఇబ్బందులు పడి గల్ఫ్‌కు వెళ్ళిన శివ అక్కడ ఎలాంటి పరిస్థితులను ఫేస్‌ చేశాడనేదే నా క్యారెక్టర్‌. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ల‌క్ష‌లాది జ‌నాలకు ఓ ప్ర‌తినిధిగా క‌న‌ప‌డే పాత్ర‌. నాకు, డింపుల్‌కు మధ్య క్యూట్‌ లవ్‌స్టోరీ కూడా సినిమా అంతా రన్‌ అవుతుంటుంది.

Chetan Maddineni interview gallery

నేను కూడా రీసెర్చ్‌లో భాగమయ్యాను...
- సునీల్‌కుమార్‌రెడ్డిగారు ఈ కథను తయారు చేసుకోవడానికి చాలా రీసెర్చ్‌ చేశారు. ఆ సందర్భంలో నేను కూడా ఆయనతో పాటు వెళ్ళాను. 'గల్ఫ్‌' బాధితుల గురించి చాలా విషయాలు నేర్చుకున్నాను. తెెలంగాణ కుర్రాడిగా కనపడటం కోసం చాలా కష్టపడ్డాను.
- క్యారెక్టర్‌ పరంగా చూస్తే రోజులు మారాయి, ఈ సినిమాకు మధ్య చాలా తేడాలున్నాయి. సునీల్‌ కుమార్‌రెడ్డిగారి దర్శకత్వంలో చేయడం వల్ల చాలా కొత్త విషయాలు తెలిశాయి. ఆయన దర్శకత్వం చేసిన రొమాంటిక్‌ క్రైం కథ, సొంత వూరు, క్రిమినల్‌ ప్రేమకథ సహా అన్నీ సినిమాలు చూశాను. ఆయన సినిమాలు రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. అలాంటి రియలిస్టిక్‌ సినిమాలు చేయాలనుకుంటున్న సమయంలో రోజులు మారాయి తర్వాత 'గల్ఫ్‌' మూవీ అవకాశం వచ్చింది. అన్నీ ఎమోషన్స్‌ నా క్యారెక్టర్‌లో క్యారీ అవుతాయి.

తదుపరి చిత్రం..
- మారుతిగారి ప్రొడక్షన్‌లో కన్నడ చిత్రం 'ఫస్ట్‌ ర్యాంక్‌ రాజు'ను తెలుగులో అదే పేరుతో రీమేక్‌ చేస్తున్నారు. ఆ చిత్రంలో నేను హీరోగా చేస్తున్నాను. నరేష్‌ కుమార్‌ ఈ సినిమాకు దర్శకుడు. స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుంది. త్వరలోనే సినిమా సెట్స్‌పైకి వెళుతుంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved