pizza
C Kalyan interview (Telugu) about Inttelligent
తేజు కెరీర్‌లో గ‌ర్వంగా చెప్పుకునే సినిమా `ఇంటిలిజెంట్‌` - సి.క‌ల్యాణ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

31 January 2018
Hyderabad

సాయిధ‌ర‌మ్‌తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం `ఇంటిలిజెంట్‌`. సి.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌కత్వంలో సి.క‌ల్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత సి.క‌ల్యాణ్ మీడియాతో సినిమా గురంచిన విశేషాల‌ను తెలియ‌జేస్తూ....

మంచి స‌క్సెస్‌తో స్టార్ట‌ప్‌...
- 2018 ఏడాది నాకు `జైసింహా`తో మంచి స‌క్సెస్ వ‌చ్చింది. అదే ఊపుతో ఫిబ్ర‌వ‌రి 9న `ఇంటిలిజెంట్‌` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాం. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు నెలకొన్నాయి. ఈ సినిమా టీజ‌ర్‌ను నంద‌మూరి బాల‌కృష్ణ‌, ఓ సాంగ్‌ను యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ విడుద‌ల చేశారు.ఈ టీజ‌ర్‌కి, సాంగ్‌కి హ్యూజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. బాల‌కృష్ణ గారైతే సి.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్ నా హోం బ్యాన‌ర్ అని చెప్పి.. `ఇంటిలిజెంట్‌` సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాన‌ని కూడా చెప్ప‌డం విశేషం.

ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌...
- `ఇంటిలిజెంట్‌` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను ఫిబ్ర‌వ‌రి 4న రాజ‌మండ్రి ఆర్ట్స్ కాలేజ్‌లో గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. ఈ వేడుక‌కి స్థానిక నాయ‌కులు, చిత్ర యూనిట్ స‌భ్యులు హాజ‌ర‌వుతారు. సినీ ఇండ‌స్ట్రీ నుండి ఇత‌ర అతిథులు మ‌రెవ్వ‌రూ రారు.

తేజు కెరీర్‌లో గర్వంగా చెప్పుకునే సినిమా...
- చిరంజీవిగారికి ఇష్ట‌మైన ద‌ర్శ‌కుడు, సోద‌రుడు వంటి వి.వి.వినాయ‌క్‌గారు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండ‌టంతో `ఇంటిలిజెంట్‌`పై ఆస‌క్తిని చూపారు. వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. చిరంజీవిగారి 150వ సినిమా త‌ర్వాత వినాయ‌క్‌గారు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండ‌టంతో సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. అంద‌రి అంచ‌నాల‌కు ధీటుగా ఈ సినిమా ఉంటుంది. తేజు కెరీర్‌లోనే గ‌ర్వంగా చెప్పుకునే సినిమా అవుతుంది. 2-3 రోజుల్లో యాక్ష‌న్ స‌న్నివేశాల వీడియో రిలీజ్ చేయ‌బోతున్నాం.

ఎంట‌ర్‌టైన్మెంట్ ఎక్కువ‌గా...?
- `ఇంటిలిజెంట్‌` సినిమా చాలా ఇంటిలిజెంట్‌గా ఉంటుంది. `జైసింహా` చిత్రంలో సెంటిమెంట్ ఎక్కువ‌గా ఉంటే, `ఇంటిలిజెంట్‌`లో ఎంట‌ర్‌టైన్మెంట్ ఎక్కువ‌గా ఉంటుంది. ఈ సినిమా ప‌రంగా చూస్తే తేజు డాన్సుల‌ను ఇర‌గ‌దీశాడు. చిరంజీవిగారు మంచి ఫైర్ మీదున్న‌ప్పుడు ఎలా డాన్సులు చేసేవారో తేజు ఇప్పుడు అలాంటి డాన్సుల‌ను చేశారు. త‌మ‌న్ కూడా ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ను అందించారు. ఈ సినిమాలో క‌ళామందిర్ చీర‌పై ఓ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్‌ను ఈరోజు కూక‌ట్‌ప‌ల్లి క‌ళామందిర్‌లో విడుద‌ల చేయ‌బోతున్నాం.

ఇళ‌య‌రాజాగారి చేతుల మీదుగా...
- ఈ సినిమాలో చిరంజీవిగారి చ‌మ‌కు చ‌మ‌కు చామ్ సాంగ్‌ను రీమేక్ చేశాం. ఈ రీమేక్ సాంగ్‌ను ఇళ‌య‌రాజా, సీతారామ‌శాస్త్రి చేతుల మీదుగా, ఓ ప్ర‌ముఖ అతిథి స‌మ‌క్షంలో విడుద‌ల చేయ‌బోతున్నాం. చ‌మ‌కు చ‌మ‌కు సాంగ్‌ను ఓమ‌న్‌లో షూట్ చేశాం. ఓమ‌న్‌కు గ‌తంలో ఎన్నో తెలుగు సినిమా యూనిట్స్ వ‌చ్చినా, ఎవ‌రూ చేయ‌ని హిల్ లోకేష‌న్స్‌లో సినిమాను చిత్రీక‌రించాం. వినాయ‌క్‌గారు ఎంతో ప్రేమ‌తో సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు.

అన్నీ సినిమాలు హిట్ కావాలి...
- మేం షూటింగ్ స్టార్ట్ చేసిన రోజునే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశాం. మాతో పాటు అన్న‌య్య మోహ‌న్‌బాబుగారి `గాయ‌త్రి`, వ‌రుణ్ తేజ్ `తొలిప్రేమ` సినిమాలు వ‌స్తున్నాయి. అన్నీ సినిమాలు హిట్ కావాలి. సినిమాలు హిట్ అయితేనే ఇండ‌స్ట్రీ బావుంటుంది.

న్యూమ‌రాల‌జీని న‌మ్ముతాను...?
- నేను న్యూమ‌రాల‌జీని బాగా న‌మ్ముతాను. నా పేరుని కూడా అలాగే మార్చుకున్నాను. ఇప్పుడు ఇంటెలిజెంట్ అని కాకుండా ఈ సినిమాకు ఇంటిలిజెంట్ అనే టైటిల్ పెట్ట‌డానికి కూడా కార‌ణం అదే.

క‌థ‌లో సందేహలుంటే అడుగుతాను..
-నేను సుమ‌న్‌, జ‌య‌సుధ కాంబినేష‌న్‌లో `నేటి న్యాయం` అనే సినిమా చేయాల్సింది. కానీ కొన్ని కార‌ణాల‌తో నేను ద‌ర్శ‌క‌త్వం చేయ‌లేక‌పోయాను. దాంతో నిర్మాత‌గా మారాను. నా నిర్మాణంలో మోహ‌న్‌బాబుగారి సినిమాను నిర్మించాం. నాకు ద‌ర్శ‌కత్వ‌శాఖ‌లో ఉన్న ప‌రిచ‌యం కార‌ణంగా స్టోరీలో నేను ఇన్‌వాల్వ్ అవుతాను. ఏదైనా సందేహ‌లుంటే వెంట‌నే క్లియ‌ర్ చేసుకుంటాను.

త‌దుప‌రి చిత్రాలు...
- నా త‌దుప‌రి సినిమా కూడా వినాయ‌క్‌గారి ద‌ర్శ‌క‌త్వంలోనే ఉంటుంది. పెద్ద సినిమాతో పాటు ఈ ఏడాది `భార‌తి`అనే చిన్న సినిమా చేయ‌బోతున్నాను. అలాగే రానా న‌టించిన `1945` సినిమా 10-12 రోజులు షూటింగ్ మిన‌హా అంతా పూర్త‌య్యింది. సుభాష్ చంద్ర‌బోస్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమ‌క‌థా చిత్ర‌మిది.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved