pizza
Dasari Kiran Kumar about Vangaveeti
`వంగ‌వీటి` సినిమా విష‌యంలో చాలా స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్నాను - దాస‌రి కిర‌ణ్‌కుమార్‌
You are at idlebrain.com > news today >
Follow Us

2 January 2017
Hyderaba
d

రామ్‌గోపాల్ వ‌ర్మ ద్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `వంగ‌వీటి`. జీనియ‌స్‌, రామ్‌లీల‌ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను అందించిన నిర్మాత దాసరి కిర‌ణ్‌కుమార్ నిర్మాత‌గా రామ‌దూత క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో రూపొందిన ఈ మూవీ `వంగ‌వీటి` సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. డిసెంబ‌ర్ 23న వంగ‌వీటి చిత్రం గ్రాండ్‌రిలీజైంది. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత దాసరి కిర‌ణ్‌కుమార్‌తో ఇంట‌ర్వ్యూ.....

చాలా స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్నాను....
- నిర్మాత‌గా `వంగ‌వీటి` సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావ‌డానికి చాలా స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్నాను. ఆంధ్రప్ర‌దేశ్ ఫిలించాంబ‌ర్‌లో టైటిల్ రిజిస్ట్రేషన్ చేయ‌డానికి అంగీక‌రించ‌లేదు. అందుకు కార‌ణాల‌ను కూడా వారు వివ‌రించ‌లేదు. అయితే `వంగ‌వీటి` సినిమా విష‌యంలో నాకు తెలంగాణ ఫిలిం చాంబ‌ర్‌వారు పూర్తి స‌హ‌కారం అందించారు. సినిమా విడుద‌ల వ‌రకు చాలా మంది కోర్టులో కేసులు కూడా వేశారు. ఆడియో వేడుక చేయడానికి గ్రౌండ్ ప‌ర్మిష‌న్ కూడా ఇవ్వ‌లేదు. ఇవ‌న్నీ ఎవ‌రికీ తెలియ‌వు.

అది చెప్ప‌డానికి నేనెవ‌రినీ....
- వంగ‌వీటి రాధా, రంగా, దేవినేని కుటుంబాలు ప్ర‌జ‌లకు ఎంతో సేవ చేశారు. అయితే వారిలో వ‌చ్చిన మ‌న‌స్పర్ధ‌ల కార‌ణంగానే హ‌త్య‌లు జ‌రిగాయి. 1973లో చ‌ల‌సాని వెంక‌ట‌ర‌త్నం హ‌త్య‌తో మొద‌లైన ఈ ప్ర‌స్థానం 1988 రంగాగారి హ‌త్య వ‌రకు కొన‌సాగింది. త‌ర్వాత తెలుగుదేశం, కాంగ్రెస్ ప్ర‌భుత్వాలు ఎన్ని వ‌చ్చినా అస‌లు రంగాగారి హ‌త్య గురించి స్టెప్ తీసుకోలేదు. 18 ఏళ్ళ త‌ర్వాత సుప్రీంకోర్టు కేసును కొట్టేసింది. ప్ర‌భుత్వాలు, కోర్టులే చెప్ప‌లేని వాస్త‌వాల‌ను సిస్ట‌మ్‌కు వ్య‌తిరేకంగా చెప్ప‌డానికి మేమెవ‌రం అందుకే రంగాగారి హ‌త్యతోనే సినిమాను ముగించాం.

Dasari Kiran Kumar interview gallery

ఆ విష‌యాన్ని నేను కూడా అంగీక‌రిస్తాను....
-28 ఏళ్ల క్రితం వంగ‌వీటి, దేవినేని కుటుంబాల మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ‌లను ప్ర‌స్తావిస్తారు కానీ అస‌లు ఏం జ‌రిగింద‌నే విష‌యాలు ఎవ‌రికీ తెలియ‌వు. అస‌లేం జ‌రిగింద‌నే దాని గురించి చెప్పే ప్ర‌య‌త్నం చేశామే త‌ప్ప‌, ఎవ‌రినీ త‌క్కువ చేసి చూపించ‌డానికి ప్ర‌య‌త్నం చేయ‌లేదు. అయితే సినిమాలో రాధాగారి క్యారెక్ట‌ర్‌ను ఎలివేట్ చేసిన‌ట్టు రంగాగారి క్యారెక్ట‌ర్‌ను సీన్స్ రూపంలో చెప్ప‌లేక‌పోయాం. సినిమా చూసిన రంగాగారి అభిమానులు రంగాగారి క్యారెక్ట‌ర్‌ను ఇంకాస్తా బాగా చూపించి ఉంటే బావుండేది క‌దా..అన్నారు. ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని ఓ పాయింట్‌ను మేం రెండు గంట‌ల ప‌దిహేను నిమిషాల్లో చెప్పాల‌నుకున్న‌ప్పుడు అందులో భాగంగానే ఓ ఐడియా ప్రకారం సినిమా చేసుకుంటూ వ‌చ్చాం. సినిమాలో రంగాగారి క్యారెక్ట‌ర్‌ను ఇంకాస్తా బాగా చూపించాల్సింద‌ని చాలా మంది అన్నారు. ఈ విష‌యాన్ని నేను కూడా అంగీక‌రిస్తాను.

ఎవ‌రూ బెదిరించ‌లేదు....
- వంగ‌వీటి, దేవినేని కుటుంబాల మ‌ద్ధ‌తు లేకుండా సినిమా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే వాళ్లం కాదు. సినిమా విడుద‌ల‌కు ముందు కానీ, త‌ర్వాత కానీ ఎవ‌రూ మ‌మ్మ‌ల్ని బెదిరించ‌లేదు. సినిమా బాగా ఉంది కాబ‌ట్టే ప్రేక్ష‌కులు సినిమాను బాగా ఆద‌రిస్తున్నారు. సినిమాను డిసెంబ‌ర్ 23న 270 థియేట‌ర్స్‌లో విడుద‌ల చేశాం. సినిమా ఇప్ప‌టికీ స‌క్సెస్‌ఫుల్ 140 థియేట‌ర్స్‌లో ర‌న్ అవుతుంది.

తదుప‌రి చిత్రాలు...
- మా రామ‌దూత క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఓ క‌మ‌ర్షియ‌ల్ సినిమాను ప్లాన్ చేస్తున్నాం. ఆ వివ‌రాల‌ను సంక్రాంతి త‌రువాత తెలియ‌జేస్తాం.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved