pizza
director Dayanand interview about Siddhardha movie
సాగ‌ర్‌ని `సిద్ధార్థ‌` ఇంకో మెట్టు ఎక్కిస్తుంది - ద‌యానంద్ రెడ్డి
You are at idlebrain.com > news today >
Follow Us

15 September 2016
Hyderaba
d

సాగ‌ర్ హీరోగా న‌టిస్తున్న చిత్రం సిద్దార్థ‌. రామ‌దూత క్రియేష‌న్స్ ప‌తాకంపై దాస‌రి కిర‌ణ్‌కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా శుక్ర‌వారం విడుద‌ల కానుంది. ఈ సినిమా గురించి ద‌ర్శ‌కుడు ద‌యానంద్ రెడ్డి గురువారం విలేక‌రుల‌తో మాట్లాడారు.

* ప‌వ‌న్ క‌ల్యాణ్ ద‌గ్గ‌ర ప‌నిచేశారు క‌దా?
- అవునండీ. జానీ నుంచి చేశాను. పంజా వ‌ర‌కు చేశాను. పంజా స‌మ‌యంలో నీలిమా తిరుమ‌ల‌శెట్టిగారితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. వారి బ్యాన‌ర్ లో `అలియాస్ జాన‌కి` అనే సినిమా చేశాను. ఆ త‌ర్వాత మ‌ర‌లా ప‌వ‌న్‌గారి ద‌గ్గ‌రికే వెళ్లా. `స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌` మొద‌ల‌య్యే వ‌ర‌కు ఆ టీమ్‌తో ట్రావెల్ అయ్యా. అంత‌లో సాగ‌ర్ ఫోన్ చేసి ఈ సినిమా గురించి చెప్పి పిలిపించారు.

* సాగ‌ర్ మీకు ఎలా ప‌రిచ‌యం?
- సాగ‌ర్ మ‌ధు ఇన్స్టిట్యూట్‌లో ఉన్న‌ప్ప‌టి నుంచీ ప‌రిచ‌యం ఉంది. మేమిద్ద‌రం క‌లిసి మంచి సినిమా చేయాల‌ని అనుకునేవాళ్లం. ఈ సినిమా కోసం విస్సుగారు చేసిన క‌థ‌ను చెప్పారు. న‌చ్చింది. ద‌ర్శ‌క‌త్వం చేయ‌మంటే చేశాను.

* మీ ద‌గ్గ‌ర క‌థ‌లు లేవా?
- `సిద్ధార్థ` క‌థ సాగ‌ర్‌కు చాలా బాగా స‌రిపోతుంది. ఆయ‌న కోస‌మే రాసిన‌ట్టు అనిపిస్తుంది. నా ద‌గ్గ‌ర ఉన్న‌వ‌న్నీ ఈ కైండ్ స్టోరీస్ కాదు. అవి వేరే త‌ర‌హాలో ఉంటాయి. కానీ ఈ క‌థ సాగ‌ర్‌కు టైల‌ర్ మేడ్. అందుకే దీనితోనే ప్రొసీడ్ అయ్యాం.

* సిద్ధార్థ స్టోరీ ఎలా ఉంటుంది?
- చాలా బాగా ఉంటుంది. ఫ్యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్ సినిమా. సూర్య అనే కుర్రాడికి ఓ అమ్మాయి ప‌రిచ‌య‌మ‌వుతుంది. ఆ త‌ర్వాత అత‌ని జీవితంలో ఎలాంటి మార్పు వ‌చ్చింది. క‌త్తి ప‌ట్టి తిరిగిన కుర్రాడు ఎలా మారాడు. మ‌ర‌లా క‌త్తి ప‌ట్టాల్సిన ప‌రిస్థితులు వ‌చ్చిన‌ప్పుడు ఎలా మారాడు? అనేది ఈ చిత్రంలో కీల‌కం.

* సాగ‌ర్ టీవీలో ఫేమ‌స్‌. మ‌రి సినిమాల్లో అత‌న్ని ఎలా పోట్రేట్ చేశారు?
- నిజ‌మే. సాగ‌ర్ అన‌గానే టీవీ స్టార్ అనే మాట గుర్తుకొస్తుంది. కానీ త‌ను టీవీల్లో క‌న్నా సినిమాల్లో ఫేమ‌స్ అవుతాడు ఈ సినిమాతో. అంత‌గా క‌ష్ట‌ప‌డ్డాడు. సిక్స్ ప్యాక్ చేశాడు. ప్ర‌తి చిన్న విష‌యంలోనూ కేర్ తీసుకున్నాడు.

* ఈ సినిమాలో హైలైట్స్ ఏంటి?
- క‌థ‌. సాగ‌ర్ పెర్ఫార్మెన్స్, హీరోయిన్ల న‌ట‌న‌, వీట‌న్నిటికీ మించి కెమెరామేన్‌గారు, ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ డైలాగులు, మ‌ణిశ‌ర్మ‌గారి సంగీతం.. ఇవ‌న్నీ హైలైటే.

* పెద్ద టెక్నీషియ‌న్ల‌తో ప‌నిచేయ‌డం ఎలా అనిపించింది?
- పెద్ద వాళ్ల‌తో ప‌నిచేయ‌డం చాలా గొప్ప ఎక్స్ పీరియ‌న్స్. పెద్దా చిన్నా అని మ‌నం ఆలోచిస్తామే కానీ, వాళ్లు ఆలోచించ‌రు. కొత్త‌వాళ్ల‌న‌యినా, పాత వాళ్ల‌న‌యినా వాళ్లు డైర‌క్ట‌ర్‌గానే చూస్తారు. అది వాళ్ల పెద్ద మ‌న‌సు.

* ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారి ప్ర‌స్తావ‌న సినిమాలో ఉంటుందా?
- సినిమాలో కావాల‌ని ఏమీ పెట్ట‌లేదు. కాక‌పోతే ఆయ‌న ద‌గ్గ‌ర ప‌నిచేశాను కాబట్టి నా వ‌ర్కింగ్ స్టైల్లో ఆయ‌న ప్ర‌భావం క‌నిపిస్తుందేమో.

* మీరు న‌ట‌న కొన‌సాగిస్తారా?
- ఆ మ‌ధ్య వ‌ర‌కు అడ‌పాద‌డ‌పా చేశాను. ఇక‌పై ద‌ర్శ‌క‌త్వం మీదే గురి పెడతాను. మంచి స‌బ్జెక్ట్ లున్నాయి.

* ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారికోసం క‌థ చేశారా?
- ద‌ర్శ‌క‌త్వం అవ‌కాశం ఇచ్చినా, ఇవ్వ‌క‌పోయినా ఆయ‌న నేను క‌థ చెబితే మాత్రం త‌ప్ప‌కుండా వింటారు. ఆ చ‌నువు ఉంది. ఈ సినిమాను కూడా ఆయ‌నకు త‌ప్ప‌కుండా చూపిస్తాను. నేను ప‌వ‌న్‌గారికోసం ఓ క‌థ చేస్తే అది చాలా పెద్ద రేంజ్ సినిమా, డిఫ‌రెంట్ సినిమా అవుతుంది. రెగ్యుల‌ర్‌గా మాత్రం ఉండ‌దు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved