pizza
Dhanush interview (Telugu) about VIP 2
`విఐపి 2` మూవీ క‌థ రాసుకున్న‌ప్పుడే తెలుగు స్ట్ర‌యిట్ మూవీగా చేయాల‌నుకున్నాను
You are at idlebrain.com > news today >
Follow Us

23 August 2017
Hyderabad

ధనుష్‌ హీరోగా వి క్రియేషన్స్‌, వండర్‌ బార్స్‌ పతాకాలపై రూపొందుతున్న చిత్రం 'విఐపి 2'. సౌందర్య రజనీకాంత్‌ దర్శకురాలు. కలైపులి థాను, ధనుష్‌ నిర్మాతలు. ఈ సినిమా ఆగస్ట్‌ 25న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో ధనుష్‌తో ఇంటర్వ్యూ...

విఐపి2' మూవీని తెలుగు స్ట్రయిట్‌ మూవీగా చేయడానికి కారణమేంటి?
- రఘువరన్‌ బి.టెక్‌ సినిమా తెలుగులో పెద్ద విజయం సాధించిన తర్వాత తెలుగులో స్ట్రయిట్‌ సినిమా చేయాలనుకున్నాను. అయితే మంచి కథ ఉన్న సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నాను. రఘవరన్‌ బి.టెక్‌ సీక్వెల్‌ చేయాలనుకున్నప్పుడు 'విఐపి2 ' సినిమాను తెలుగు స్ట్రయిట్‌ మూవీగా చేయాలని నిర్ణయించుకునే సినిమా చేశాను.

తమిళంలో కంటే తెలుగులో సినిమాను ఆలస్యంగా విడుదల చేయడానికి కారణమేంటి?
- నిజానికి తెలుగు, తమిళంలో సినిమాను ఆగస్ట్‌ 11న విడుదల చేయాలని అనుకున్నాం. కానీ తెలుగులో అదే సమయంలో మూడు సినిమాలు విడుదలవుతున్నాయి. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే తెలుగులో విడుదల చేయడానికి వీలు కాలేదు. అలాగని తమిళంలో వాయిదా వేస్తే అంత కంటే మంచి రిలీజ్‌ డేట్‌ దొరకదు. అందుకని సినిమాను ముందుగా తమిళంలో ఆగస్టు 11నే విడుదల చేశాం. తెలుగులో ఇదే సరైన రిలీజ్‌ డేట్‌గా భావించి సినిమా ఆగస్టు 25న విడుదల చేస్తున్నాం.

రఘువరన్‌ బి.టెక్‌తో పోల్చి చూస్తే విఐపి2 లో డిఫరెంట్‌గా ఏం ఉంటుంది?
- రఘువరన్‌ బి.టెక్‌తో పోల్చి చూస్తే విఐపి2 డిఫరెంట్‌ మూవీ అని చెప్పకూడదు. రెండింటిలో ఎలాంటి సారూప్యత ఉందో చూడాలి. రఘువరన్‌ బి.టెక్‌లో హృదయానికి హత్తుకునేలా చిన్న చిన్న విషయాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో కూడా అలాంటి విషయాలున్నాయి. సెంటిమెంట్స్‌, ఎమోషన్స్‌, ఫైట్స్‌ అన్ని మొదటిభాగంలోలాగా ఆడియెన్స్‌ను అలరిస్తాయి.

Dhanush interview gallery

కథ రాసుకునేటప్పుడే ఈ సినిమాకు సౌందర్య రజనీకాంత్‌ దర్శకురాలని అనుకున్నారా?
- నేను కథ రాసుకున్న తర్వాత అసలు సినిమాను ఎలా స్టార్ట్‌ చేయాలనే దానిపై నాకు పూర్తి ఆలోచన లేదు. అదే సమయంలో థానుగారితో సౌందర్య దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. సౌందర్య విజన్‌ చాలా పెద్ద రేంజ్‌లో ఉంటుంది. ఈ సినిమాలో వసుంధర పాత్ర చేసిన కాజోల్‌గారి పాత్ర కూడా చాలా గ్రాండ్‌గా ఉంటుంది కాబట్టి ఈ సినిమాకు సౌందర్య డైరెక్టర్‌ అయితే కరెక్ట్‌గా ఉంటుందనిపించింది.

కథ రాసుకున్నప్పుడే కాజోల్‌ను వసుంధర పాత్రకు అనుకున్నారా?
- వసుంధర అయినా, రఘువరన్‌ అయినా వారు ఎంచుకున్న మార్గాలను గట్టిగా నమ్మే ఇద్దరు వ్యక్తులు. వసుంధర పాత్రను డిజైన్‌ చేసుకోగానే స్టైలిష్‌గా, కాన్ఫిడెంట్‌గా, రాయల్‌గా కనపడే మహిళ అయితే ఈ పాత్రకు న్యాయం చేస్తుందనుకున్నాం. కాజోల్‌ అయితే ఈ పాత్రకు న్యాయం చేస్తారనిపించింది.కథ రాసుకునేటప్పుడు రఘువరన్‌కు వ్యతిరేకంగా ఉండే వ్యక్తి పవర్‌ఫుల్‌గా, ఇండిపెండెంట్‌గా ఉండాలి. అది కేవలం మగవారే ఎందుకై ఉండాలి. ఆడవారు కూడా ఇండిపెండెంట్‌గా, పవర్‌ఫుల్‌గా ఉంటారు కదా. కాబట్టి ఓ లేడీ క్యారెక్టర్‌ను డిజైన్‌ చేసుకున్నాం.

కాజల్‌ చాలా గ్యాప్‌ తర్వాత తమిళ సినిమా చేసినట్లున్నారు?
- కాజల్‌గారికి హిందీ తప్ప వేరే భాష రాదు. కాబట్టి ఆమె వేరే భాషలో సినిమా చేయాలనుకోరు. అందుకనే ఆమెను కంఫర్ట్‌జోన్‌లో ఉంచి సినిమాను డైరెక్ట్‌ చేశాం. తెలుగులో కూడా ఆమె తమిళ డైలాగ్స్‌నే చెప్పారు. విఐపి2 మూవీని 52రోజుల్లో పూర్తి చేశాం. బై లింగువల్‌ మూవీని అంత తక్కువ సమయంలో చేయడం సులభం కాదు. అలాంటి సమయంలో భాష రాని కాజోల్‌గారికి తెలుగులో డైలాగ్స్‌ నేర్చుకోమని చెప్పి ఇబ్బంది పెట్టడం సరికాదనిపించింది. అందుకని కాజోల్‌గారు తమిళ డైలాగ్స్‌ చెబితే ఆమె చుట్టూ ఉండే క్యారెక్టర్స్‌ తెలుగు డైలాగ్స్‌ను చెబుతాయి.

సినిమా ఆలస్యం కావడంతో మీ తెలుగు అభిమానులు నిరాశ చెందారనుకోవచ్చా?
- అలాంటిదేం లేదండి..ఎందుకంటే నేను తెలుగులో చేసిన స్ట్రయిట్‌మూవీ ఇది. అందువల్ల నా అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే అనుకుంటున్నాం.

తదుపరి చిత్రాలు?
- నెక్స్‌ట్‌ నేను చేస్తున్న వడచెన్నై సినిమాను తెలుగులో అనువాదం చేసి విడుదల చేస్తాం. అలాగే మారి2 సినిమా చేయబోతున్నాం. ఆ సినిమాను మళ్లీ తెలుగు, తమిళంలో నిర్మిస్తాం.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved