pizza
Dil Raju interview about Krishnashtami
ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో సినిమా చేయ‌డం నా లైఫ్ యాంబిష‌న్ - దిల్‌రాజు
You are at idlebrain.com > news today >
Follow Us

17 February 2016
Hyderaba
d

సునీల్‌, నిక్కి గల్రాని, డింపుల్‌ చోపడే హీరో హీరోయిన్లుగా వాసువర్మ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణాష్టమి’. ఈ చిత్రం ఫిభ్రవరి 19న విడుదల‌ అవుతుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత దిల్‌రాజుతో ఇంటర్వ్యూ....

*బన్ని సినిమాను సునీల్‌తో చేయడానికి కారణం...*
గోపీచంద్‌ మలినేని ఈ కథను ‘పండగచేస్కో’ సినిమా కంటే ముందుగానే చెప్పాడు. కథలోని ఎంటర్‌టైన్మెంట్‌ అందరికీ బాగా నచ్చింది. కచ్చితంగా కమర్షియల్‌గా కూడా వర్కవుట్‌ అవుతుందనిపించి, బన్నిని కలిసి ఈ కథను చెప్పాం. అయితే బన్ని ఆర్య, పరుగు చిత్రాల‌ తర్వాత నెక్ట్‌ట్‌ లెవల్‌లో సమ్‌థింగ్‌ ఏదో కొత్తగా చేయానుకుంటున్నాడు. దాంతో ఈ సినిమాను ఆపాం. తర్వాత గోపీచంద్‌ మలినేని పండగచేస్కో సినిమా చాన్స్‌ రావడంతో ఆ పనిలో బిజీగా మారిపోయాడు. వాసువర్మ సాయిధరమ్‌తేజ్‌ హీరోగా ల‌వర్‌ అనే కొత్త కథను సిద్ధం చేశాడు. ‘కృష్ణాష్టమి’ మ్యూజిక్‌ డైరెక్టర్‌ దినేష్ ల‌వ‌ర్ సినిమాకు ట్యూన్స్‌ కూడా కంపోజ్‌ చేశాడు. ‘రామయ్యా వస్తావయ్యా’ తర్వాత హరీష్‌ శంకర్‌ ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’ కథను కూడా బన్నికి చెప్పాం. హరీష్‌ శంకర్‌తో బన్ని సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌, వాసువర్మతో సాయిధరమ్‌తేజ్ ల‌వర్‌ సినిమా చేయాల‌నేది అసలు ప్లాన్‌. బన్నికి కూడా సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌ కథ బాగా నచ్చింది. అయితే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సన్నాఫ్‌ సత్యమూర్తి సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అప్పుడు హరీష్‌ సాయిధరమ్‌తో సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌ మూవీ చేస్తానన్నాడు. అప్పుడు నేను, వాసు కూర్చొని భారీ తారాగణంతో చేయాల్సిన సినిమా ‘కృష్ణాష్టమి’ నాకు కథ నచ్చింది, నువ్వు కూడా విను అన్నాను. వాసువర్మ కథ విని, కథ నచ్చింది కానీ, ఇంకా వర్క్‌ చేయాల్సి ఉంది, చాలా మంచి సినిమా అవుతుందన్నాడు. వాసువర్మ స్క్రిప్ట్‌ డెవల‌ప్‌ చేయడం స్టార్ట్‌ చేశాడు. ఓరోజు సునీల్‌ను పిలిపించి 20 నిమిషా కథను వినిపించాం. తను వినగానే ఇంత పెద్ద బడ్జెట్‌ మూవీ నాతో ప్లాన్‌ చేస్తున్నారా? అని అన్నాడు. అయితే వాసువర్మ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని తెలియగానే వేరే సినిమా ఏదీ చేయకుండా ఈ సినిమా చేస్తానని అన్నాడు. అన్నమాట ప్రకారమే ఈ సినిమా 80శాతం పూర్తయ్యే వరకు ఏ సినిమా యాక్సెప్ట్‌ చేయలేదు. అలా సెట్‌ అయ్యిందే కృష్ణాష్టమి.

*సినిమా చూస్తున్నప్పుడు విజన్‌ ఉంటుంది...
డాక్టరు రోగి నాడి పట్టుకుని సమస్యఏంటో ఇట్టే ఎలా చెప్పేస్తాడో అలాగే ఈ నిర్మాతగా నేను ఒక కథను వింటున్నప్పుడు ఆ సినిమాను విజన్‌ చేయడానికి ప్రయత్నిస్తాను. సినిమా సక్సెస్‌ఫుల్‌ సినిమా వస్తుంది.

*నిర్మాతగా ఆ బాధ్యత నాదే...
నేను చేసిన భాస్కర్‌, బోయపాటి, ఆర్య, శ్రీకాంత్‌ అడ్డా ఇలా అందరూ కొత్త దర్శకుల‌తోనే సినిమా చేసి సక్సెస్‌లు సాధించాను. ఇప్పుడు వీరందరూ మంచి పోజిషన్‌లో ఉన్న దర్శకులు. వాసువర్మను జోష్‌ సినిమా డైరెక్ట్‌ చేయమని అన్నప్పుడు నేను నిర్మాతగా చేసిన తప్పేంటంటే జోష్‌ 2009లో విడుదలైంది. ఆ సమయంలో కాలేజీల్లో గొడలు ఉండేవి కావు. కానీ సినిమాలో గొడవల‌ను పెద్దగా చూపించే ప్రయత్నం చేశాం. లెజెండ్రీ ఫ్యామిలీకి చెందిన నాగచైతన్య వారి బ్యానర్‌లో కాకుండా నా బ్యానర్‌లో సినిమా చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇలా నిర్మాతగా నేను చేసిన తప్పుల‌వీ. ఆ బాధ్యత కూడా నాదే. వాసువర్మ దిల్‌, ఆర్య, బొమ్మరిల్లు వరకు నా పక్కనే ఉన్నాడు. ఆ సినిమా అవుట్‌పుట్‌ విషయంలో నా పక్కనే ఉన్నాడు. తను మంచి టాలెంట్‌ ఉన్న దర్శకుడు. రేపు ‘కృష్ణాష్టమి’ సినిమా చూస్తే తన టాలెంట్‌ ఏంటో మీకు తెలుస్తుంది. నేను తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఈ చిత్రంతో నిల‌బెట్టుకుంటాడని చెప్పగల‌ను.

*సినిమాను థియేటర్స్‌లో చూడటానికి ఇష్టపడతాను...
నేను సినిమాను మెయిన్‌థియేటర్‌లోనే చూడటానికి ఇష్టపడతాను. ఎందుకంటే మల్టీప్లెక్స్‌ల్లో కంటే నార్మల్‌ థియేటర్స్‌లో జనరల్‌ ఆడియెన్స్‌ ఉంటారు. వారి నుండి వచ్చే రియాక్షన్‌ కరెక్ట్‌గా ఉంటుంది.

*బడ్జెట్‌ సినిమాను బట్టి మారుతుంటుంది...
సునీల్‌ ఇప్పటి వరకు కృష్ణాష్టమి వంటి సినిమా చేయలేదు. దీంట్లో కొత్త సునీల్‌ కనపడతాడు. ఇది బన్ని కోసం తయారు చేసుకున్న కథ, సునీల్‌ చేస్తున్నాడని ఎక్కడా హీరోయిజం తగ్గించలేదు. హీరోయిక్‌గా చూపిస్తూనే సునీల్‌ టైప్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉండేలా ప్లాన్‌ చేశాం. ఇక బడ్జెట్‌ విషయానికి వస్తే బృందావనం, మిష్టర్‌ ఫర్‌ఫెక్ట్‌ సినిమాల‌కు ఆరోజుల్లో పెట్టిన బడ్జెట్‌ కంటే ఎక్కువగానే పెట్టాం. ఈ సినిమాను 45రోజు పాటు ఫారిన్‌లోనే షూట్‌ చేశాం. అయితే కాలాన్ని, పరిస్థితుల‌ను బట్టి బడ్జెట్‌ చూడలేం. అన్నీ సినిమాను ఫారిన్‌లో షూట్‌ చేయలేం కదా, బడ్జెట్‌ అనేది సినిమాను బట్టి మారుతుంటుంది.

*రీ షూట్‌ చేయలేదు..రీ ఎడిటింగ్‌ చేశాం...
మిష్టర్‌ పర్‌ఫెక్ట్‌ చిత్రాన్ని 17 రోజులు రీ షూట్‌ చేశాం. కేరింత చిత్రాన్ని 30 రోజుల‌ తర్వాత చూసి నాకు నచ్చకపోవడంతో మళ్ళీ స్టార్టింగ్‌ నుండి రీషూట్‌ చేశాను. ఎందుకంటే నేను కథ వింటున్నప్పుడు ఉండే ఫీల్‌ చూస్తున్నప్పుడు కల‌గలేదు. అందుకనే అలా చేశాం. ఇక ‘కృష్ణాష్టమి’ విషయానికి వస్తే సినిమాను రీషూట్‌ చేయలేదు. రీ ఎడిట్‌ చేశాం. ఎందుకంటే సినిమా లెంగ్త్‌ ఎక్కువగా ఉండటమే అందుకు కారణం. అందుకనే రీ ఎడిట్‌చేసి లెంగ్త్‌ను తగ్గించాం. సినిమాను మన శాటిస్పాక్షన్‌ కోసం ఆడియెన్‌ అంతసేపు కూర్చోలేడు. ఎందుకంటే అతను తన విలువైన టైంతో పాటు డబ్బు కూడా ఇస్తున్నాడు. కాబట్టి తను ఎంటర్‌టైన్‌ అయ్యేలా సినిమా ఉండాలి.

*హీరో క్యారెక్టర్‌.....
హీరో పక్కవాడి సమస్యను తీర్చడానికి ఎంత దూరమైనా వెళ్ళే క్యారెక్టర్‌. అలాంటి హీరోకు అనుకోకుండా ఓ సమస్య ఎదురవుతుంది. అప్పుడు హీరో ఎలా రియాక్ట్‌ అయ్యాడు అనే విషయాన్ని ఎంటర్‌టైనింగ్‌గా చెప్పాం. కమర్షియల్‌ తరహాలో అందంగా ఉండే రివేంజ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. సింపుల్‌గా చెప్పాంటే నీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ విత్‌ కమర్షియల్ ఎలిమెంట్స్‌.

*సినిమా స్టార్ట్‌ కావడానికి ముందే ఆలోచిస్తాను.....
నేను సినిమా మొదయ్యే ముందు ఎంత ఖర్చవుతుంది అని ఆలోచిస్తాను. సినిమా పూర్తయిన తర్వాత ఎంత ఖర్చయింది. వస్తుందా? రాదా? అని ఆలోచిస్తాను. అంతే తప్ప సినిమా వర్క్‌ జరుగుతున్నప్పుడు, సినిమా చూసేటప్పుడు ఫైనాన్సియల్‌ విషయాల‌ గురించి ఆలోచించను.

*నేను కూడా రివ్యూ రేటింగ్‌ ఇవ్వబోతున్నాను.....
సినిమా చూసేటప్పుడు ఎవరి పాయింట్‌ ఆఫ్‌ వ్యూ ఉంటుంది. అలాగే ఇప్పుడు నా సినిమాకు నేను ఆడియెన్స్‌కు రివ్యూ ఇస్తాను. చాలా సినిమాలు రివ్యూవర్స్‌కు నచ్చలేదు కానీ ఆడియెన్స్‌కు నచ్చింది. ఇక్కడే నేనెవరినీ తప్పు పట్టలేదు. సినిమా గోల్‌ ఆడియెన్స్‌ శాటిస్పాక్షన్‌ మాత్రమే. ఈ సినిమాకు నా వరకు 3.25 నుండి 3.5 రేటింగ్‌ వస్తుందని అనుకుంటున్నాను. 70శాతం కంటే ఎక్కువ మంది సినిమాను ఇష్టపడతారు. ఇలా చెప్పడానికి ముఖ్య కారణం నేను ఆడియెన్స్‌ పక్షపాతిని. తర్వాతే డిస్ట్రిబూట్యర్‌ని, నిర్మాతని. సినిమా బావుంటే ఏ రివ్యూలు పనిచేయవు.

Dil Raju interview gallery



 

*నా లైఫ్‌ యాంబిషన్‌...
పవన్‌కళ్యాణ్‌గారు స్క్రిప్ట్‌ తీసుకురా..సినిమా చేద్దామని అన్నారు. నేను ఆ పనిలోనే ఉన్నాను. ఆయనతో సినిమా చేయడం నా లైఫ్‌ యాంబిషన్‌. నేను కూడా వెయిట్‌ చేస్తున్నాను.

*ర‌వితేజ‌తో సినిమా ఆగిపోవ‌డానికి కార‌ణం...
నేను, రవితేజ మంచి ఫ్రెండ్స్‌. సినిమా అంటే మేమిద్దరమే కాదు. అందరినీ హ్యండిల్‌ చేసుకుంటూ వెళ్ళాలి. అలా చిన్న చిన్నవాటి వల్ల సినిమా ఆగిపోయింది. ఇప్పుడు అదే కథను నాగార్జునగారితో చేయాల‌నుకుంటున్నాను. ఆయన్ను అప్రోచ్‌ అయ్యాను. ఆయన కథ వినాల్సి ఉంది.

*సినిమా అనేది మోనోపాళి కాదు...
నేనేదో మోనోపాళి చేస్తున్నానని చాలా మంది అంటున్నారు కానీ..ఇండ‌స్ట్రీ మోనోపాళి అయితే ‘కృష్ణాష్టమి’ సినిమా ఆగస్టులో పూర్తయ్యింది కదా, అప్పుడే రిలీజ్‌ చేసుకుని ఉండవచ్చు కదా, ఎందుకు చేయలేదు. రైట్‌ రిలీజ్‌ డేట్‌ కోసం వెయిట్‌ చేశాను. ఆరు నెల‌లు సినిమా ఆపుకోవడం వల్ల‌ కోటిన్నర రూపాయలు వడ్డీ కట్టాను. ఏదో సినిమా రిలీజ్‌ చేసేయాని చేయలేం. మంచి విడుదల‌ తేది చూసుకుని రిలీజ్‌ చేయాలి. సినిమాల‌ను పరిమితంగానే రిలీజ్‌ చేస్తున్నాం.

*నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్స్‌..
సుప్రీమ్‌ సినిమా ఏప్రిల్‌ 1న విడుదల‌వుతుంది. 5,6 సినిమాలు స్క్రిప్ట్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. రెండు సినిమాలు ఈ ఏడాది రిలీజ్‌ చేస్తాం. మరో నాలుగు సినిమాు స్క్రిప్ట్స్‌ రెడీ అయిన తర్వాత సెట్స్‌లోకి వెళతాం. ఇప్పుడు కృష్ణవంశీగారి దర్శకత్వంలో ఓ విజువల్‌ సినిమాను రెడీ చేశాను. అది తెలుగు, తమిళంలో నిర్మిస్తాను. హిందీలో డబ్‌ చేసి విడుదల‌ చేస్తాను. ఫాంటసీ, హర్రర్‌ జోనర్‌లో సినిమా ఉంటుంది. టైటిల్‌ ‘రుద్రాక్ష’ అని వినపడుతుంది కానీ టైటిల్‌ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

 

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved