pizza
Gopichand interview (Telugu) about Gautham Nanda
`గౌత‌మ్‌నంద‌` స‌క్సెస్‌పై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను - గోపీచంద్‌
You are at idlebrain.com > news today >
Follow Us

22 July 2017
Hyderabad

గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ `గౌతమ్ నంద`. హన్సిక-కేతరీన్ కథానాయికలు. శ్రీబాలాజీ సినీ మీడియా సంస్థలో జె.భగవాన్-జె.పుల్లారావులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 28న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్బంగా హీరో గోపీచంద్‌తో ఇంట‌ర్వ్యూ..

పాత్ర గురించి...
- ఈ సినిమాలో నా పాత్ర పేరు ఘట్టమనేని గౌతమ్‌. అయితే ఓ మామూలు గౌతమ్‌, గౌతమ్‌ నందగా ఎందుకు మారాడు అనే విషయం కథలో తెలుస్తుంది. అయితే ఈ చిత్రంలో ఇప్పటి వరకు లేని విధంగా సరికొత్త స్టైలిష్‌ లుక్‌లో కనిపిస్తాను. ఇప్పటికె నా లుక్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఇక సినిమా విషయానికి వస్తే, నా చివరి చిత్రం వచ్చి ఏడాదికి పైగా దాటిపోతుంది. అయితే ఈ చిత్రం విషయంలో నేను చాలా నమ్మకంగా ఉన్నా. ఈ చిత్రం మరల నాకు మంచి విజయం అందించడంతో పాటు కెరియర్‌ కి బూస్ట్‌ ఇస్తుంది.

ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
దర్శకుడు సంపత్‌ నంది గురించి...
- నా కెరీర్‌లో నాకు బాగా కనెక్ట్‌ అయిన దర్శకులు ఐదారుగురు ఉంటారు. వారిలో సంపత్‌ నంది ఒకరు. ఆయన సెట్‌ లో చాలా క్లియర్‌ గా ఉంటాడు. అతనికి ఎలాంటి వేరియేషన్స్‌ కావాలో అడిగి మరి చేయించుకుంటాడు. అతను నాకు కథ చెప్పిన దానికంటే చాలా గొప్పగా ఇందులో అతని ప్రెజెంటేషన్‌ ఉంటుంది. ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలతో పోలిస్తే గౌతమ్‌ నందా అతని కెరియర్‌ లో బెస్ట్‌ సినిమా అవుతుంది. సినిమాను డబ్బింగ్‌ చెప్పేటప్పుడు చూశాను. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను.

బడ్జెట్‌లో బోర్డర్‌ దాటలేదు..
- 'గౌతమ్‌ నంద' చిత్రం నా కెరీర్‌లోనే మంచి బడ్జెట్‌తో రూపొందింది. అయితే ముందు అనుకున్న బడ్జెట్‌ కంటే ఎక్కువైందని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఎందుకంటే సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికంటే ముందుగానే, దర్శకుడు సంపత్‌ నంది, నిర్మాతలు భగవాన్‌, పుల్లారావుగారితో మాట్లాడి, అంతా ఓకే అనుకున్న తర్వాతే సినిమా స్టార్ట్‌ చేశాం.

Gopichand interview gallery

అది వాస్తవమే...
- సినిమాల ఎంపిక విషయంలో కొన్ని రాంగ్‌ స్టెప్స్‌ వేసిన మాట వాస్తవమే. కాని కొన్నిసార్లు పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్ళడమే. మళ్ళీ ప్రేక్షకుల ముందుకి రావడానికి ఓక సవత్సరం ఎదురుచూడాల్సి వచ్చింది. అయితే ఇలాంటి అన్నింటికీ గౌతమ్‌ నంద సినిమా సమాధానం చెబుతుంది.

నా బలం కూడా అదే...
- నేను ప్రేమ కథ చేసినా, మరో జోనర్‌ సినిమా చేసినా అందులో యాక్షన్‌ ఎలిమెంట్స్‌ ఉండేలా చూసుకుంటాను. ఎందుకంటే నా బలమైన అశాల్లో యాక్షన్‌ ఒకటి. అందుకే నా సినిమాల్లో యాక్షన్‌ సన్నివేశాలు కచ్చితంగా ఉండాల్సిందే.

నేను కూడా వెయిటింగ్‌...
- 'ఆక్సిజన్‌' సినిమా కథకు తగ్గ టైటిలే. మంచి కథ. కొన్ని రోజులు షూటింగ్‌ బేలన్స్‌ ఉంది. ఆ పార్ట్‌ను షూట్‌ చేసిన తర్వాతే పోస్ట్‌ ప్రొడక్షన్‌ అన్ని కార్యకమ్రాలు చూసుకుని విడుదల తేదిని ప్రకటిస్తారు. నేను కూడా ఆక్సిజన్‌ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

చాలా బాధ పడ్డాను..
- డగ్స్ర్‌ గురించి ఇప్పుడు వస్తున్న వార్తలు చూసి చాలా బాధపడ్డాను. అయితే సినిమా ఇండస్ట్రీ మీద అందరు ఎక్కువ ఫోకస్‌ పెట్టడం కరెక్ట్‌ కాదనిపిస్తుంది. అసలు ఈ డ్రగ్స్‌ ర్యాకెట్‌ ని మూలాల నుంచి పెకలించడానికి పాఠశాలల మీద కూడా ప్రభుత్వం ద్రుష్టి పెట్టి దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకుంటుందని భావిస్తున్నాను.

తదుపరి చిత్రాలు...
- ప్రస్తుతానికి అయితే ఎలాంటి ప్రాజెక్ట్స్‌ సంతకం చేయలేదు. కథలైతే వింటున్న. అయితే గతంలో మాదిరి విలన్‌ పాత్రలు, సహాయక పాత్రలు చేసేసి కెరియర్‌ పాడుచేసుకునే ఉద్దేశ్యం అయితే నాకు లేదు. మంచి పాత్రలు ఎంచుకొని జాగ్రత్తగా కెరియర్‌ ప్లాన్‌ చేసుకుంటా.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved