pizza
Hanu Raghavapudi interview about Krishnagaadi Veera Premagaadha
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌ - హను రాఘవపూడి
You are at idlebrain.com > news today >
Follow Us

11 February 2016
Hyderaba
d

నాని, మెహరీన్‌ హీరో హీరోయిన్స్‌ గా 14రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. బ్యానర్‌పై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మించిన చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’. ఈ సినిమా ఫిభ్రవరి 12న విడుదల అవుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు హను రాఘవపూడితో ఇంటర్వ్యూ....

టైం తీసుకోవడానికి కారణం...
- ‘అందాల రాక్షసి’ 2012లో విడుదలైంది. తర్వాత ఏడాదిన్నర యాక్షన్‌ లవ్‌స్టోరీని తెరకెక్కించాలని ఓ కథ తయారు చేసుకుని ఆ కథతో జర్నీ చేశాను. ఆది జరగలేదు. దాని తర్వాత రాసుకున్న కథే ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’. అందువల్లే ఇంత టైం పట్టింది.

నేను అలా కథ రాసుకోను...
- నేను ఓ చోట కూర్చొని కథ రాసుకునే టైప్‌ కాదు. చాలా సార్లు ఓ వ్యక్తితో డిస్కషన్‌ పెట్టుకున్న తర్వాతే రాసుకుంటాను. అలాగే నానితో ఈ సినిమా విషయమై ట్రావెల్‌ చేశాను. డిస్కషన్స్ చేశాను. ఓ సెంట్రల్‌ ఐడియాతో సినిమా కథ డెవలప్‌ చేశాను.

ముందు నానికే చెప్పాను....
- ‘అందాల రాక్షసి’ సినిమా కథను ముందుగా నానికే చెప్పాను. అలాగే మరో కథను కూడా చెప్పాను. రెండు కథలు తనను ఎగ్జయిట్‌ చేయలేదు. తర్వాత ఈ కథ తయారు చేసుకుని నానికి వినిపించాను. తనకు నచ్చింది.

కామన్‌ మ్యాన్‌ బేస్‌గా.....
- నేను నేచురల్‌ బ్లెండ్‌తో కథు రాసుకుంటాను. నేను కామన్‌ మ్యాన్‌ను బేస్‌ చేసుకుని కథలు రాసుకుంటాను. అందులో భాగంగా నాని దృష్టిలో పెట్టుకునే రాసుకుంటాను.

జర్నీ అంతా వ్‌ కారణంగానే...
- ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌. దానితో పాటు స్ట్రాంగ్‌ లవ్‌స్టోరీ ఉంటుంది. హోల్‌ జర్నీ అంతా లవ్‌ కారణంగానే సాగుతుంది. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇందులో చెప్పిన కాన్‌ఫ్లిక్ట్‌ పాయింట్‌ గత 20 ఏళ్ళుగా టచ్‌ చేయలేదు.

నాని కనిపించడు....
- నాని హీరోగా ఎక్కడా కనపించడు. కృష్ణ పాత్రలో ఒదిగిపోయాడు. మెహరీన్‌ చక్కగా యాక్ట్‌ చేసింది. తెలుగు అమ్మాయి కాకపోయినా డైలాగ్స్‌ బాగా చెప్పింది. అలాగే పిల్లలు మైని, మోక్ష, శ్రీ ప్రథమ్‌ చక్కగా నటించారు. షూటింగ చేసేటప్పుడు ప్రతిరోజు ఛాలెంజింగ్‌గా చేశాను. ఎందుకంటే కథలో భాగంగా ఎక్కువ పార్ట్‌ అవుట్‌డోర్‌లో చిత్రీకరించాం. లైవ్‌ లోకేషన్స్‌ లో చేయడం అంత సువుకాదు.

ఆ టైటిల్‌ అనుకోలేదు....
- ఈ సినిమాలో నాని బాయ్య అభిమానిగా కనపడతాడు. కాబట్టి జై బాలయ్య అనే టైటిల్‌ వినపడింది కానీ మేం ముందు నుండి జై బాలయ్య అనే టైటిల్‌ అనుకోలేదు. సినిమాలో ఫ్యాక్షన్‌ ఉంటుంది కానీ పునాదిలా ఉంటుంది. అంటే ఇంటి పునాది మనకు కనపడదు కదా, అలాగే ఇందులో కనపడదు. అక్కడి మనుషులు, పరిస్థితులను చూపించాం.

ఆ ఉద్దేశంతో చేయలేదు....
- చేసే పనిలో వర్క్‌ శాటిస్పాక్షన్‌ ఉందా లేదా అని చూసుకుంటాను. హిట్‌ అనేది మనకు పే బ్యాక్‌. అలాగే ఈ సినిమా కూడా హిట్‌ కొట్టాలనే ఉద్దేశంతో చేయలేదు.

చేంజ్‌ ఓవర్‌ కోసమే..
- రథన్‌ మ్యూజిక్‌ను చేంజ్‌ చేయడానికి ప్రత్యేక కారణాలేవీ లేవు. చిన్న చేంజ్‌ ఓవర్‌ ఉండానే ఉద్దేశంతోనే విశాల్‌ చంద్రశేఖర్‌ను తీసుకున్నాను. తనకు, నాకు మధ్య గొడవలేం లేవు. నెక్స్‌ట్‌ చేస్తే అతనితో వర్క్‌ చెయ్యొచ్చు.

నెక్స్‌ ట్‌ ప్రాజెక్ట్స్‌..
- ‘కవచం’ సినిమా చేస్తున్నాను. హీరో ఎవరనేది ఇంకా కన్‌ఫర్మ్‌ కాలేదు.



 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved