pizza
Dr. Haranath Policherla interview (Telugu) about Tick Tock
నాకు సంబంధించి సినిమాలు చేయ‌డ‌మంటే ఆత్మ సంతృప్తి - డా.హ‌రినాథ్ పొలిచెర్ల‌
You are at idlebrain.com > news today >
Follow Us

17 May 2017
Hyderabad

పి.హెచ్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించిన హార్ర‌ర్‌, ఫ‌న్‌, ల‌వ్ కాన్సెప్ట్ మూవీ సినిమా `టిక్ టాక్‌`.హోప్ చిత్రానికి నేష‌న‌ల్ అవార్డ్ అందుకుని, చంద్రహాస్ చిత్రానికి స్వ‌ర్ణ నందిని పొంది, స‌తీష్‌, దేవాక‌ట్టా వంటి ద‌ర్శ‌కుల్ని, వెన్నెల‌కిషోర్‌, పార్వతీమెల్ట‌న్ వంటి నటీన‌టుల‌ను ప‌రిచ‌యం చేసిన స‌రోజిని దేవి ఇంట్రిగేష‌న్ అవార్డ్ గ్ర‌హీత డా.పొలిచ‌ర్ల హ‌ర‌నాథ్ నిర్మిస్తూ న‌టిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ సంద‌ర్భంగా హ‌రినాథ్ పొలిచెర్ల ఇంట‌ర్వ్యూ...

సినిమాల‌నేవి మాన‌సిక తృప్తికి సంబంధించింది...
- నేను అమెరికాలో ఉన్న‌ప్పుడు ప్ర‌తి వారాంత‌రం డ్యాన్స్ క్లాసుల‌కు వెళ్ళేవాడిని. నార్త్ అమెరిక‌న్ తెలుగు అసోసియేష‌న్స్ వారు నిర్వ‌హించే ఫంక్ష‌న్స్ కోసం రెండు, మూడు స్లార్లు నృత్య కావ్యాలు కూడా చేశాను. అందుకోస‌మ‌ని కూచిపూడి నాట్యం కూడా నేర్చుకున్నాను. డాక్ట‌ర్ వృత్తిలో నేను క‌ష్ట‌పడుతున్నాను. డ‌బ్బు సంపాదిస్తున్నాను. ఇక ఆ డ‌బ్బుల‌తో ఇక్కడ సినిమాలు తీస్తారెందుకు అని చాలా మంది అడుగుతుంటారు. కానీ సినిమాల‌నేవి ఆత్మ సంతృప్తికి సంబంధించిన విష‌యం. సినిమాలు చేసేట‌ప్పుడు నాకు మ‌నోవికాశం క‌లుగుతుంది. ప్ర‌తి సినిమా చేసేట‌ప్పుడు మాన‌సికాభివృద్ధి జ‌రుగుతుందని విశ్వ‌సిస్తున్నాను.

చిన్న‌ప్ప‌టి నుండే న‌ట‌న‌తో అనుబంధం..
- చిన్న‌ప్పుడు హైస్కూల్స్ లో నాటిక‌లు వేసేవాడిని. త‌ర్వాత మెడిక‌ల్ కాలేజ్‌లో ఫైన్ ఆర్ట్స సెక్ర‌ట‌రీగా చేశాను. అలా నాకు చిన్న‌ప్ప‌టి నుండి న‌ట‌న‌తో మంచి అనుబంధ‌మే ఉంది. నేను మెడిక‌ల్ కాలేజ్‌లో చ‌దువుకునే రోజుల్లో ఇప్పుడు టిడిపి ఎంపి ఎన్‌.శివ‌ప్ర‌సాద్‌గారు నాకు గురువు. ఆయ‌న‌తో క‌లిసి ఆప్ప‌టి నుండే నాట‌కాలు వేసేవాడిని. చ‌ద‌వు పూర్త‌యిన త‌ర్వాత సినిమాల్లోకి వ‌స్తానంటే ఇంట్లో అమ్మా నాన్న‌లు ఎమోష‌న‌ల్ బ్లాక్ మెయిల్ చేశారు.దాంతో నేను కాస్తా వెన‌క్కు త‌గ్గాను. ఆ స‌మ‌యంలో నా స‌హోద‌రి న‌న్ను కెన‌డా తీసుకెళ్ళిపోయారు. అక్కడే చ‌దువుకుని న్యూరాల‌జిస్ట్‌గా ప‌దేళ్ళ పాటు వైద్య రంగంలోనే ఉండిపోయాను. త‌ర్వాత ఇదేంటి ఇంతేనా అనే ఆలోచ‌న రావ‌డంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను.

Dr. Haranath Policherla interview gallery

సినిమా రంగ ప్ర‌వేశం...
- నేను తొలి సినిమాగా క‌న్న‌డంలోనే న‌టించాను. కానీ తెలుగు భాష‌పై ఉన్న అభిమానంతో తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చేశాను. తెలుగులో ముందుగా ప్రేమాయ‌న‌మః అనే సినిమా చేశాను. హీరోగా నేను చేసిన తెలుగు సినిమా అలెక్స్‌.

`టిక్ టాక్` గురించి...
- టైటిల్లో టిక్ అంటే మనిషి బ్రతికున్నప్పటి జీవితం, టాక్ అంటే చనిపోయాక జీవితం అని అర్థం. సాధారణంగా మనిషి చనిపోయాక స్వర్గానికి వెళతాడు, ఆత్మ అవుతాడు అని పలు రకాలుగా అంటారు. ఆలా మరణం తర్వాత జీవితం ఏమిటనే ఆలోచనతో చేసిన సినిమానే ఇది. సినిమాలో హార్ర‌ర్ కంటెంట్‌తో పాటు అన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇందులో మంచి ఎంట‌ర్ టైన్మెంట్ ఉంటుంది. నేను చేసిన అన్ని సినిమాల్లోకి ఇందులోనే ఎక్కువ ఫన్ ఉంటుంది. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వ‌ర‌కు థ్రిల్‌గా సాగే చిత్ర‌మింది.

సినిమాలో పాత్ర గురించి...
- ఇందులో నేనొక మెకానిక్ లా కనిపిస్తాను. పూర్తి స్థాయి మాస్ క్యారెక్టర్. మంచి ఫన్ కూడా ఉంటుంది.

కొత్తవారికి అవ‌కాశం ఇవ్వ‌డానికి ఎప్పుడూ రెడీ...
- మంచి కథతో ఎవరైనా ముందుకొస్తే కొత్త వారికి తప్పకుండా అవకాశమిస్తాను. నా సినిమాల‌ను గ‌మ‌నిస్తే మీకు ఆ విష‌యం అర్థ‌మ‌వుతుంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved