pizza
Harish Shankar interview (Telugu) about DJ Duvvada Jagannadham
బన్ని చేసిన అన్ని సినిమాల కంటే 'దువ్వాడ జగన్నాథమ్‌' చాలా స్టైలిష్‌గా వుంటుంది - హరీష్‌ శంకర్‌
You are at idlebrain.com > news today >
Follow Us

22 June 2017
Hyderabad

'మిరపకాయ్‌', 'గబ్బర్‌సింగ్‌', 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన టాలెంటెడ్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌, స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌, హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌ రాజు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం 'డి.జె'. ఈ చిత్రం టైటిల్‌ దగ్గర్నుంచీ.. ఇప్పటివరకూ ప్రేక్షకుల్లో ఎంతో సెన్సేషన్‌ చేసింది. రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ సంగీత సారథ్యంలో రిలీజైన ఈ చిత్రం ఆడియోకి, ట్రైలర్స్‌కి అమేజింగ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. కాగా ఈ చిత్రం జూన్‌ 23న వరల్డ్‌వైడ్‌గా నెంబరాఫ్‌ థియేటర్స్‌లో రిలీజ్‌ అయ్యింది. ఈ సందర్భంగా టాలెంటెడ్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌తో ఇంటర్వ్యూ.

'డి.జె' రిలీజ్‌ అవుతుంది కదా..! టెన్షన్‌ ఫీలవుతున్నారా?
- టెన్షన్‌ లేదు కానీ.. చాలా ఎగ్జైట్‌గా వుంది. మా సినిమా మాకు నచ్చింది. ప్రేక్షకులు, అభిమానులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో ఆతృతగా ఎదురుచూస్తున్నాను. డెఫినెట్‌గా ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేసే విధంగా వుంటుంది.

అసలు ఈ ప్రాజెక్ట్‌ ఎలా సెట్‌ అయ్యింది?
- 'ఆర్య' సినిమా చూసాక ఎప్పటికైనా అల్లు అర్జున్‌, దేవిశ్రీప్రసాద్‌, ఎక్కడా కాంప్రమైజ్‌ కాని దిల్‌ రాజుగారి కాంబినేషన్‌లో సినిమా తియ్యాలనుకున్నాను. నా కోరిక ఇన్ని సంవత్సరాల తర్వాత 'డి.జె'తో నెరవేరింది. బన్నీకి 17వ సినిమా. నాకు 6వ సినిమా.

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ని బ్రాహ్మణుడి క్యారెక్టర్‌లో చూపించడానికి రీజన్‌ ఏంటి?
- బ్రాహ్మణులు కూడా స్టైలిష్‌గా వుంటారని నా ఫీలింగ్‌. 'దువ్వాడ జగన్నాథమ్‌' అంటే ఫుల్‌ప్లెడ్జ్‌డ్‌ ఎంటర్‌టైనింగ్‌ అనుకుంటారు. కానీ సినిమాలో చాలా ఇంటెన్సిటీ వుంటుంది. ఇంతకుముందు నా సినిమాలో టచ్‌ చేయని ఎమోషన్స్‌ని ఈ సినిమాలో టచ్‌ చేశాను. అందుకే డి.జె. అని పెట్టాను. డి.జె. అనగానే వెరీ కాన్‌టెంపరరీ ఫిల్మ్‌. స్టైలిష్‌స్టార్‌ కాబట్టి డి.జె. అనే పదం కరెక్ట్‌గా సెట్‌ అయ్యింది. అల్లు అర్జున్‌ చేసిన అన్ని సినిమాల కంటే ఎక్కువ స్టైలిష్‌గా ఈ సినిమా వుంటుంది.

ఈ సినిమా తీయడానికి మీకు ఇన్‌స్పిరేషన్‌ ఏమైనా వుందా?
- మనం పుట్టిన దగ్గర్నుండీ అమ్మా, నాన్నలను చూసి చాలా ఇన్‌స్పైర్‌ అవుతూ వుంటాం. పర్టిక్యులర్‌గా ఒక్క ఇన్‌స్పిరేషన్‌ అని కాకుండా కమర్షియల్‌ హీరో సినిమాలో ఏమి వుండాలో అవన్నీ దీనిలో వుంటాయి. ఫస్ట్‌ కథ రాయడానికి హీరో ఇమేజ్‌ కారణం. ఆ ఇమేజ్‌ని కాపాడుకుంటూ, ఫ్యాన్స్‌ శాటిస్‌ఫై అయ్యేలా అందరి ఆడియన్స్‌కి నచ్చేలా స్క్రిప్ట్‌ చేసుకుంటాం. పర్టిక్యులర్‌గా ఈ సినిమాకి ఇన్‌స్పిరేషన్‌ ఏంటంటే.. మన కళ్ల ముందు ఏదన్నా ఒక అన్యాయంగానీ, మనకి నచ్చని విషయం గానీ జరిగితే దానిని అరికట్టాలని ప్రయత్నం చేస్తాం. కానీ కొన్ని కారణాల వల్ల అది చేయలేం. నిజానికి నిర్భయ ఇన్సిడెంట్‌ జరిగినప్పుడు నేను చాలా బాధపడ్డాను. వాళ్లను ఉరి తియ్యాలి. కాల్చి చంపాలి అనుకునేవాడ్ని. బట్‌ మనం ఏమీ చెయ్యలేం. అన్యాయం అరికట్టడానికి మనలోంచి ఒక వెయ్యి తుపాకులతో, కత్తులతో ఒకడు బయటికొస్తాడు. కానీ మనకున్న బాధ్యతల వల్ల, భయం వల్ల అతన్ని మనం బయటికి రానివ్వం. అది తప్పు కూడా కాదు. ఎందుకంటే మన ఎమోషన్‌ జెన్యూన్‌. కానీ మనకున్న లిమిటేషన్స్‌ ఎక్కువ. అందువల్ల మనం ఏమీ చెయ్యలేం. చట్టాని మన చేతుల్లో తీసుకోలేం. ప్రతి మనిషి జెన్యూన్‌గా, ఒక ఫీలింగ్‌, ఎమోషన్‌ అనేది ఒకటి వుంటుంది. అది మంచి, చెడు అవ్వొచ్చు. కొన్ని పరిస్థితుల వల్ల ఆ క్యారెక్టర్‌ బయటికి రాదు. అలాంటి క్యారెక్టర్‌ బయటికొస్తే ఏంటి అనేదే 'దువ్వాడ జగన్నాథమ్‌'.

ఈ చిత్రం ద్వారా ఏమైనా మెస్సేజ్‌ ఇస్తున్నారా?
- నేనెప్పుడూ సినిమాల ద్వారా మెసేజ్‌లు ఇవ్వాలని అనుకోవట్లేదు. సినిమా అనేది ఒక వినోదం. సినిమాని సినిమాగా చూడాలని నా ఉద్దేశం. 70, 80 కోట్లు పెట్టి ఒక హీరో, డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌ వన్‌ ఇయర్‌ కష్టపడి సినిమా తీసి మెస్సేజ్‌ ఇవ్వాలని ఎందుకు అనుకుంటారు. వేరే ఇతర వ్యక్తుల మనోభావాల్ని దెబ్బ తియ్యాలని ఎందుకు అనుకుంటారు? మనం తియ్యలేం. రిచర్డ్‌ అటంబోరో 'గాంధీ' సినిమాని ఆస్కార్‌ లెవెల్‌లో తీశాడు. అది చూసి ఎంతమంది మారారు. చిరంజీవిగారు 'ఠాగూర్‌'లో లంచం వద్దు అని చెప్పారు. ఆ తర్వాత ఎంతమంది ఆఫీసర్స్‌ని సి.బి.ఐ.వారు పట్టుకున్నారు. సినిమా యొక్క ఇన్‌ఫ్లూయెన్స్‌ కొన్ని గంటలు. గొప్ప సినిమా అయితే కొన్ని రోజులు. అద్భుతాలు అయితే కొన్ని నెలలు వుంటాయి. అంతే తప్ప సినిమాల వల్ల జీవితాలు మారిపోతాయని నేను అనను. అనుకోను.

క్లైమాక్స్‌ డిఫరెంట్‌గా వుంటుందని ట్వీట్‌ చేశారు?
- రైటర్‌గా, డైరెక్టర్‌గా నన్ను నేను కొత్తగా పుష్‌ చేసుకోవాలని రెగ్యులర్‌గా కాకుండా డిఫరెంట్‌గా చిత్రీకరించడం జరిగింది. విపరీతమైన ఫైట్లు, కథ డిమాండ్‌ చేయకపోతే ఆడియన్స్‌కి బోర్‌ కొట్టిస్తాయని నా ఫీలింగ్‌. ఈ సినిమాలో ఇంటర్వెల్‌లో అద్భుతమైన ఫైట్‌ వుంటుంది. అది నా కెరియర్‌ బెస్ట్‌ ఫైట్‌ అని చెప్పొచ్చు. అలాగే కథపరంగా మంచి క్లైమాక్స్‌ సీన్‌ కుదిరింది. సింపుల్‌గా, హిలేరియస్‌గా, క్యూరియాసిటీగా క్లైమాక్స్‌ వుంటుంది. చాలా కొత్త క్లైమాక్స్‌. డెఫినెట్‌గా అందరికీ నచ్చుతుంది.

Harish Shankar interview gallery

ఏ రేంజ్‌ హిట్‌ అవుతుందని భావిస్తున్నారు?
- ఎంత పెద్ద హిట్‌ అయినా నాకు అభ్యంతరం లేదు. ఏ రేంజ్‌ హిట్‌ అనేది ప్రేక్షకుల చేతిలో వుంది.

హీరో క్యారెక్టర్‌ అండ్‌ క్యారెక్టరైజేషన్‌ ఎలా వుంటుంది?
- ఎంటర్‌టైనింగ్‌తో పాటు మంచి ఎమోషన్‌ వున్న క్యారెక్టర్‌. టూ షేడ్స్‌ వున్న క్యారెక్టర్‌లో బన్నీ ఎక్స్‌ట్రార్డినరీగా చేశారు. సంవత్సరంలో 365 రోజులు షూటింగ్‌ వుంటే 365 రోజులు వర్క్‌ చేసే హీరో బన్ని అని నా నమ్మకం.

ఈ చిత్రంలో ముఖ్య పాత్రల గురించి?
- హీరో క్యారెక్టర్‌తో పాటు రావు రమేష్‌గారు రొయ్యలనాయుడు క్యారెక్టర్‌లో అద్భుతంగా చేశారు. చంద్రమోహన్‌, పోసాని, సుబ్బరాజు చాలా ఇంపార్టెన్స్‌ వున్న క్యారెక్టర్‌లో ఫెంటాస్టిక్‌గా నటించారు.

పూజా హెగ్డే క్యారెక్టర్‌ గురించి? ఆమెను తీసుకోవడానికి రీజన్‌?
- 'ముకుందా' చిత్రం ఆడియోకి వెళ్లాను. అప్పుడు తెలుగులో 'గోపికమ్మా..' పాట ఎక్స్‌లెంట్‌గా పాడింది. సినిమా అంటే ప్యాషన్‌. అప్పుడే 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌'లో హీరోయిన్‌గా చెయ్యమని అడిగాం. అప్పుడు హిందీలో ఒక మూవీ చేస్తుంది. కుదరలేదు. అప్పట్నుంచీ పూజతో టచ్‌లో వున్నాను. ఈ సినిమా స్క్రిప్ట్‌ చెప్పాక ఇమీడియెట్‌గా ఓకే అనేసింది. కథలో చాలా ప్రాముఖ్యత వున్న క్యారెక్టర్‌లో పూజ నటించింది. ఈ సినిమా ఆమెకు చాలా ప్లస్‌ అవుతుంది.

ఈ సినిమా మీకు ఎలాంటి పేరు తెస్తుందనుకుంటున్నారు?
- ప్రతి సినిమా పేరు రావాలని కోరుకుంటా. డి.జె.తో ఎంత పేరు వచ్చినా అభ్యంతరం లేదు. ముందు సినిమాల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్ట్‌ ఎక్కువ వుంటుంది. దీనిలో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్‌ కూడా వుంటుంది. రెండూ సమపాళ్లలో వుంటాయి.

డ్యాన్స్‌ల విషయంలో మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని బన్ని చెప్పారు?
- అలా చెప్పడం ఆయన గొప్పదనం. నా సినిమాలో హీరో డ్యాన్స్‌ చేయడం, ఫైట్స్‌ చెయ్యడం అంటే నాకు చాలా ఇష్టం. 'గబ్బర్‌సింగ్‌'లో కూడా పవన్‌కళ్యాణ్‌గారు 5 పాటలకి డ్యాన్స్‌ సూపర్బ్‌గా చేశారు. ఒకప్పుడు డ్యాన్స్‌లు చెయ్యాలి అంటే చిరంజీవిగారిని చెప్పుకునేవారు. ఇప్పుడు యంగ్‌స్టర్స్‌ అంతా చాలా స్పీడ్‌గా డ్యాన్స్‌లు చేస్తున్నారు. 5,6 పాటల్ని స్పీడ్‌ డ్యాన్స్‌తో హోల్డ్‌ చెయ్యాలంటే చాలా కష్టం. 'కొండవీటి దొంగ'లో చిరంజీవిగారి 'చమక్‌ చమక్‌' సాంగ్‌ వీడియో కొరియోగ్రాఫర్‌ గణేష్‌ ఆచార్యకి పంపించి ఈ టైప్‌లో సాంగ్స్‌ మూమెంట్స్‌ వుండాలి అని చెప్పాను. హీరోని చెమట పట్టకుండా ఈజీగా డ్యాన్స్‌ చెయ్యాలి అని చెప్పాను. 'గుడిలో బడిలో' సాంగ్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే డ్యాన్స్‌ చేసే హీరో వున్నప్పుడు చాలా కేర్‌ తీసుకుంటా. బన్నీ చాలా కష్టపడి ఈ చిత్రంలో డ్యాన్స్‌లు చేశాడు.

చిరంజీవిగారితో సినిమా ఎప్పుడు?
- ఖచ్చితంగా చిరంజీవిగారితో సినిమా తియ్యాలి. ఇప్పుడిప్పుడే ఒక ప్లాట్‌ ఫామ్‌ అయ్యింది. చిరంజీవిగారితో చేసే సినిమా 'దొంగమొగుడు', 'రౌడీ అల్లుడు', 'గ్యాంగ్‌లీడర్‌' ప్యాట్రన్‌లో ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో వుంటుంది. నా సినిమా గురించి కొన్ని సంవత్సరాలు మాట్లాడుకునేలా వుండాలి. అలా మాట్లాడుకునేలా చిరంజీవిగారితో సినిమా చెయ్యాలి.

నెక్స్‌ట్‌ మూవీ?
- దిల్‌ రాజుగారి బేనర్‌లో ఒక కాన్సెప్ట్‌ సినిమా చెయ్యాలి అనుకుంటున్నాను. హ్యూమన్‌ రిలేషన్స్‌ మీద ఆ చిత్రం వుంటుంది. సింగిల్‌ చెంప దెబ్బ కూడా లేకుండా ఓ సినిమా చెయ్యాలని వుంది. కొత్తవాళ్లుగానీ, ఎస్టాబ్లిష్‌ హీరోగానీ వుండొచ్చు.

ఈ క్యారెక్టర్‌ కోసం బన్ని ఎలాంటి కేర్‌ తీసుకున్నారు?
- ఈ సినిమా కోసం కాకుండా బన్ని 'సరైనోడు' సినిమా కూడా చాలా కేర్‌ తీసుకుని చేశాడు. బేసిగ్గా ఏ క్యారెక్టర్‌ తీసుకున్నా చాలా కష్టపడతాడు. బ్రాహ్మిన్‌ క్యారెక్టర్‌ కోసం చాలా కేర్‌ తీసుకున్నారు. డబ్బింగ్‌ కూడా చాలా ప్యాషనేట్‌గా చెప్పారు.

నిర్మాతగా మారుతున్నారని తెల్సింది?
- అవునండీ. మంచి కాన్సెప్ట్‌ ఫిలింస్‌ ప్రొడ్యూస్‌ చెయ్యాలని వుంది.

'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌' తర్వత మళ్లీ దిల్‌ రాజుగారి బేనర్‌లో ఈ సినిమా చేయడానికి రీజన్‌?
- ఫస్ట్‌నుండి నన్ను సపోర్ట్‌ చేస్తూ, ఎంకరేజ్‌ చేస్తున్న దిల్‌ రాజుగారికి, శిరీష్‌, లక్ష్మణ్‌ అన్నలకు నా థాంక్స్‌. కథ విని నా మీద నమ్మకంతో ఇమీడియెట్‌గా ఈ సినిమా స్టార్ట్‌ చేశారు. ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా నిర్మించారు. దిల్‌ రాజుగారి బేనర్‌ అంటే నా హోమ్‌ ప్రొడక్షన్‌లాంటిది. కంటిన్యూస్‌గా రాజుగారి బేనర్‌లో సినిమాలు చెయ్యాలని వుంది.. అంటూ ఇంటర్వ్యూ ముగించారు టాలెంటెడ్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved