pizza
Hebah Patel interview (Telugu) about Andhhagadu
కాస్త రిలాక్స్ అవుదామ‌నుకుంటున్నా - హెబ్బా ప‌టేల్‌
You are at idlebrain.com > news today >
Follow Us

01 June 2017
Hyderabad

`కుమారి 21ఎఫ్‌`లో హాట్ గా క‌నిపించి మెప్పించిన నాయిక హెబ్బా ప‌టేల్‌. ఆ త‌ర్వాత వ‌రుస‌పెట్టి ప‌లు సినిమాల్లో న‌టించింది. ఈ శుక్ర‌వారం ఆమె న‌టించిన `అంధ‌గాడు` విడుద‌ల‌కానుంది. రాజ్‌త‌రుణ్ స‌ర‌స‌న ఆమె న‌టిస్తున్న మూడో సినిమా ఇది. ఈ సినిమాను ఏకే ఎంట‌ర్‌టైన్ మెంట్స్ తెర‌కెక్కించింది. ఈ చిత్రం గురించి హెబ్బి ప‌టేల్ విలేక‌రుల‌తో మాట్లాడారు.

* ఈ సినిమా ఎలా ఒప్పుకున్నారో చెప్పండి?
- వెలిగొండ శ్రీనివాస్ నాకు మంచి క‌థ చెప్పారు. నాకు ఆ క‌థ బాగా న‌చ్చింద‌ని ఈ ఒప్పుకున్నా.

* మీ పాత్ర గురించి చెప్పండి?
- ఈ చిత్రంలో నా పేరు నేత్ర‌. ఆప్త‌మాల‌జిస్ట్. అంటే ఐ డాక్ట‌ర్ అన్న‌మాట‌. రాజ్ కి కంటి చూపు తేవ‌డానికి ప్ర‌య‌త్నించాను. అత‌ని వ‌ల్ల నా ఫ్యామిలీలో ఏం ఇబ్బందులు ఏర్ప‌డ్డాయి అన్న‌దే ఈ క‌థ‌.

* అంటే రాజ్ త‌రుణ్‌కి చూపు మీవ‌ల్ల పోతుందా?
- మీరు సినిమా చూసి తెలుసుకోండి.

* క‌థ గురించి చెప్పండి?
- నేను క‌థ గురించి ఏమీ చెప్ప‌ను. సారీ.

* పోనీ కాన్సెప్ట్ చెప్పండి?
- స్టోరీ నార్మ‌ల్‌. కానీ నేనేమీ చెప్ప‌లేను. ఎందుకంటే నేను చెప్తే స్టోరీ రివీల్ అవుతుంది.

* రాజ్‌త‌రుణ్ తో తొలి సినిమా చేసిన‌ప్ప‌టికీ, ఇప్ప‌టికీ ఏంటి తేడా?
- త‌నకి ఓపిక పెరిగింది. టాల‌రేట్ చేసే లెవ‌ల్స్ ఎక్కువ‌య్యాయి. ఫ‌స్ట్ లో కాస్త హైప‌ర్‌గా ఉండేవారు. ఇప్పుడు కామ్ అయ్యారు.

* మీరు ఎలా మారారు?
- తొలి సినిమాతో పోలిస్తే ఇప్పుడు హైప‌ర్ లెవ‌ల్స్ మ‌రింత‌గా పెరిగాయి.

* మీరు, రాజ్‌త‌రుణ్ ప్రేమించుకుంటున్నార‌నే వార్త‌లు చ‌ద‌వినిప్పుడు ఏమ‌నిపిస్తుంది?
- అందులో నిజం లేదు కాబ‌ట్టి నేను రియాక్ట్ కాను. నిజం ఉంటే ఏమైనా రియాక్ట్ కావొచ్చు.

* అస‌లు మీరు చ‌దువుతారా?
- చ‌దువుతాను. అలాంటి రాత‌ల్లో నిజం ఉంటే నేనేమైనా బాధ‌ప‌డ‌వ‌చ్చు. అందులో నిజం లేన‌ప్పుడు నేను చ‌దివి న‌వ్వుకుంటానంతే. నేను ఫేమ‌స్ అయ్యాను కాబ‌ట్టే అంద‌రూ నా గురించి రాస్తున్నారు అని అనుకుని న‌వ్వుకుంటాను.

* అస‌లు మీరిద్ద‌రూ వాటి గురించి డిస్క‌స్ చేసుకుంటారా?
- చేసుకుంటామండీ. చ‌దువుకుని నవ్వుకుంటాం. ఇంకో సినిమా చేస్తే క‌చ్చితంగా పెళ్లి చేస్తారు. ఆ త‌ర్వాత ఇంకో సినిమా చేస్తే ఓ బిడ్డ కూడా పుట్టిందంటారు.. ఇలా అన్నీ డిస్క‌స్ చేసుకుంటాం.

ఈ చిత్రంలో నేత్ర మీ నిజ‌జీవితానికి ద‌గ్గ‌ర‌గా ఉంటుందా?
-లేదండీ. నేను హైప‌ర్‌. నేత్ర సెటిల్డ్ ప‌ర్స‌న్‌. నా గ‌త చిత్రాల్లో ఎప్పుడూ నేను అలా న‌టించ‌లేదు. ఎందుకంటే చాలా సింపుల్‌గా ఉంటాను. హీరోకి హెల్ప్ చేస్తుంటాను. దాని వ‌ల్ల ఇబ్బందుల్లో ప‌డుతాను.

* కొత్త డైర‌క్ట‌ర్ ఎలా చేశారు?
- వెలిగొండ శ్రీనివాస్ చాలా స్టోరీస్ రాశారు. అందుకే ఆయ‌న సెట్లో ఎక్స్ పీరియ‌న్స్ ఉన్న వ్య‌క్తిగా చేశారు. నా ప‌ని మాత్రం తేలికైంది.

*మీతో పాటు సినిమాల్లోకి వ‌చ్చిన నాయిక‌లు ఇంకో స్థానానికి చేరుకున్నారు. కానీ మీరు ఇంకా చేరుకోలేక‌పోతున్నామ‌ని అనిపిస్తోందా?
- అలాంటిదేమీ లేదండీ. పెద్ద హీరోల చిత్రాలు కొన్ని రాలేదు, కొన్ని వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి చేజారాయి.. అయినా నా వ‌ర‌కు వ‌చ్చిన సినిమాల‌తో నేను హుందాగానే ఉన్నాను.

* మీ విష్‌లిస్ట్ ఏంటి?
- పేర్లు చెప్ప‌ను కానీ, అంద‌రితోనూ ప‌నిచేయాల‌ని మాత్రం ఉంది.

* అంద‌రితో అంటే.. హీరోల‌తోనా.. ద‌ర్శ‌కుల‌తోనా..
- ఇద్ద‌రితోనూ..

interview gallery

* ఇందులో డ్యాన్స్ చేశారా?
- అవునండీ ఒక‌సాంగ్ చేశాను. తొలిసారి నేను డ్యాన్స్ చేశాను. ఇంత‌కుముందు డ్యాన్సింగ్ నాకు పెద్ద‌గా న‌చ్చేది కాదు. కానీ నేను ప్రిపేర్ అయ్యి చేశాను. డ్యాన్సులు నేర్చుకుంటున్నాను. ఇంత‌కుముందు డ్యాన్సులు చేయ‌డానికి నాకు కాన్ఫిడెన్స్ లేదు. కానీ ఈ సినిమాలో ధైర్యం చేసి చేశాను. నా ఆత్మ‌విశ్వాసం కూడా పెరిగింది. నేను గ్రేట్ డ్యాన్స‌ర్ అని ఎప్పుడూ అనుకోలేదు. అదే నా ప్రాబ్ల‌మ్‌. ఎందుకంటే నాకు డ్యాన్స్ రాద‌న్న ఫీలింగ్‌తో నేను డ్యాన్స్ మీద ఎక్కువ‌గా ఫోక‌స్ పెడ‌తాను. వెంట‌నే నా ఎక్స్ ప్రెష‌న్స్ పోతాయేమోన‌నే భ‌యం ఉండేది. ఇప్పుడ‌ది త‌గ్గుతోంది.

* స్టార్ హీరోల‌తో ప‌నిచేయ‌డానికి డ్యాన్స్ రాక‌పోవ‌డం అనేది ఇబ్బందిగా ఉందా?
- అలాంటిదేమీ లేదండీ.

* న్యూ క‌మిట్‌మెంట్స్ ఏంటండీ?
- ఇంకా ఏమీ సంత‌కం చేయ‌లేదు. కాస్త గ్యాప్ తీసుకుంటా. దాన్ని బ్రేక్ అన‌కూడ‌దు. ఎందుకంటే అది చాలా పెద్ద ప‌దం. కానీ కాస్త రిలాక్స్ కావాల‌ని అనుకుంటున్నాను. ఒక‌టీ రెండు నెల‌లు మాత్రం కాసింత విశ్రాంతి తీసుకుంటాను.

* హీరోయిన్ కెరీర్ చాలా చిన్న‌దంటారు. అంటే ఆ త‌ర్వాత మీరేమైనా చేయాల‌ని అనుకుంటున్నారా?
- అవునండీ. నా కెరీర్ ఎండింగ్‌లో పెళ్లి చేసుకుంటాను.

* ఎవ‌రినైనా ప్రేమిస్తున్నారా?
- అలాంటివేమీ లేవండీ.

* సినిమా రిలీజ్ టెన్ష‌న్ ఉంటుందా?
- శుక్ర‌వారం సినిమా విడుద‌ల‌య్యే వ‌ర‌కు త‌ప్ప‌కుండా ఉంటుంది.

* అయినా సినిమా ఫ్లాప్ అయితే హీరోల మీద ప‌డ్డంత ప్ర‌భావం, హీరోయిన్ల మీద ఉంటుందంటారా?
- ప్ర‌భావం గురించి కాదండీ... ప‌ని చేసిన త‌ర్వాత నా ఆలోచ‌న నాకు ఉంటుందిగా.

* మీకు బెస్ట్ క్రిటిక్ ఎవ‌రు?
- నా ఫ్రెండ్స్ ఉన్నారండీ. మా అమ్మ నాతో ఏమీ అన‌దు. ఇక్క‌డ నేను ఎన్ని ఇబ్బందులు ప‌డుతున్నానో అనే బెంగ ప్ర‌తి త‌ల్లికున్న‌ట్టే మా అమ్మ‌కు కూడా ఉంటుంది. మా ఆమ్మ‌, ఆంటీ ఇద్ద‌రూ నాకు చాలా బాగా స‌పోర్ట్ చేస్తారు. కాబ‌ట్టి నా విమ‌ర్శ‌కులు నా ఫ్రెండ్సే.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved