pizza
Hebah Patel interview (Telugu) about Angel
`ఏంజెల్` సినిమాను బాధ్య‌త‌గా ఫీల‌య్యాను - హెబ్బా ప‌టేల్‌
You are at idlebrain.com > news today >
Follow Us

1 November 2017
Hyderabad

శ్రీ సరస్వతి ఫిలిమ్స్ పతాకం పై నాగ అన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కిన సోషియో ఫాంట‌సీ విజువల్ వండర్ 'ఏంజెల్'. రాజమౌళి శిష్యుడు `బాహుబలి` పళని దర్శకుడు. ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి. ఈ చిత్రం నవంబర్ 3న విడుదలవుతుంది. ఈ సంద‌ర్భంగా హీరోయిన్ హెబ్బా ప‌టేల్ సినిమా గురించిన సంగ‌తుల‌ను తెలియ‌జేసింది...

`ఏంజెల్` సినిమాలో ఎలాంటి పాత్ర‌లో క‌న‌ప‌డ‌తారు...
- `ఏంజెల్` సోసియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ స్టోరీ. ఈ చిత్రం నవంబర్ 3న విడుదలవుతోంది. గ్రీన్ మ్యాట్ లో చేసిన షూట్ ను నేను బాగా ఎంజాయ్ చేసి నటించాను. 45 నిమిషాలకు పైగా సీజీ సీన్స్ ఉండడంతో దాదాపు నాలుగు నెలలు కష్టపడి పని చేశారు సినిమా యూనిట్. కుమారి 21ఎఫ్ సినిమా తరువాత మరోసారి ఏంజిల్ టైటిల్ రోల్ లో నటిస్తున్నందుకు హ్యాపీగా ఉన్నాను, ఈ చిత్రంలో నా పాత్ర ఏంజిల్ అందరూ అలానే పిలుస్తుంటారు. దివి నుంచి దిగివచ్చిన నాకు హీరో కు, సప్తగిరికు మధ్య పరిచయం ఎలా అవుతుంది? దివి నుంచి దిగికు ఎలా వచ్చాను ఆ తరువాత ఏం జరిగిందనేదే చిత్ర కథాంశం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

కంటెంటే ముఖ్యం...
- ఇంతకు ముందు నా సినిమాల కంటే ఈ చిత్రంపై చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాను అంతే నెర్వస్ గా కూడా ఫీల్ అవుతున్నాను. ఈ కథ ఎంచుకోవడానికి మాత్రం సినిమా కంటెంటే ముఖ్య కారణం. స్టోరీ లైన్ బాగా నచ్చింది. డైరెక్టర్ పళ‌ని గారు అద్భుతంగా కథను నెరేట్ చేయడమే కాకుండా గ్రాఫిక్స్ ను కూడా అంతే అద్భుతంగా ప్రెజంట్‌ చేశారు. డిఫరెంట్ జోనర్ లో నటించడం మొదటి సారి కనుకే ఏంజెల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. నా పాత్ర లో చాలా వేరియేషన్స్ కనపడుతాయి. చెప్పాలంటే ఈ సినిమాను చాలా బాధ్య‌త‌గా ఫీల్ అయ్యి న‌టించాను.

హీరో నాగ అన్వేష్‌తో వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్‌...
- హీరో నాగ అన్వేష్ కొత్త అయినా చాలా హార్డ్ వర్కర్. డాన్స్, ఫైట్స్, యాక్టింగ్ చాలా బాగా చేశారు. మంచి హీరో అవడానికి ఆస్కారమున్న వ్యక్తి. ఈ ఏంజిల్ సినిమా తో ప్రూవ్ చేసుకోవాలని తపించాడు. తప్పకుండా బిగ్ హీరో అవుతారు అన్వేష్.

గ్యాప్ కావాల‌నే తీసుకున్నాను...
- ఇక నా విషయానికి వస్తే ఏడాదిన్న‌ర‌గా వరుస సినిమాలతో షూటింగ్స్ తో బిజీ గా గడిపాను అందుచే కొంత కాలం గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్నాను. ముంబయ్ లో ఇల్లు కొన్నాం అక్కడే వాటి పనులు చూస్తూ అక్కడే కొంత రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. సినిమా బిజీ లో పడి నాకు నేను నా గురుంచి పట్టించుకోవడం మానేశాను. అందుకే రెస్ట్ కావాలి అనుకుని గ్యాప్ తీసుకున్నాను.

interview gallery

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved