pizza
Interview with Hemant Madhukar about Nishabdham
నిశ్శ‌బ్ధం ద‌ర్శ‌కుడు హేమంత్ మ‌ధుక‌ర్ తో స్పెష‌ల్ చిట్ చాట్ ఇంట‌ర్ వ్యూ
You are at idlebrain.com > news today >
 
Follow Us

27 September -2020
Hyderabad

Chitchat with Hemant Madhukar, the director of Nishabdham

Anushka learnt international sign language for Nishabdham - Hemant Madhukar

How did Nishabdham materialize?

I wanted to make a thriller on the lines of Pushpaka Vimaanam. That is how the story, and plot of Nishabdham were conceptualized. I first narrated the story to Kona Venkat and he liked it. We then bought Anushka, and other actors on-board. But producers wouldn't back an experimental silent film so I then wrote the dialogues and designed the lead characters in a new manner. Under Kona Venkat's supervision, my story and additional dialogues turned major assets of the film and ghat is when People Media Factory, TG Vishwa Prasad garu came forward to produce the film. Kona Venkat garu agreed go co-produce the film and that is how Nishabdham started.

What's the reason behind picking USA backdrop for the film?

In order to match the theme of the film, we wanted to shoot it in silent locations. Also, we wanted to give a new movie watching experience to the audience. Anushka will be seen as an American born Indian in this film. US based artists play key roles in this film. We roped in Hollywood actor Michael Madsen to give an authentic vibe to the film. Nishabdham could be the only Telugu film in recent times to have a Hollywood actor playing full-length role.

Actors like Anushka, Madhavan, Anjali and a few others are a part of the project, how was it to direct them?

I am a relatively small technician when compared to Anushka garu who had attained a whole lot of fame. But she never let her image get in the way and delivered whatever I wanted her to for the film. She learnt international sign language for the film. Even Madhavan prepared quite well for his role. Same is the case with Anjali as well. She underwent some special training to play American cop in the film. I need to say it was a bit challenging to direct an ensemble star cast, but their professionalism helped in ensuring a seamless shooting experience.

Speak about your association with People Media Factory and Kona Film Corporation

TG Vishwa Prasad garu, who runs People Media Factory believed in my story and spent big on the project. Shooting in the USA is a risky affair and we faced numerous challenges like visa allotment, location scouting, acquiring permission, etc. But the support that was given by our production team was invaluable. We wrapped up the shoot in just 55 days. I have been associated with Kona Venkat garu for over 15 years and I feel Kona Film Corporation is like a home banner to me.

Tell us about the background score of Nishabdham

It would be better if you experience the background score and music while watching the film than me explaining about it. I am expecting a great reception from the viewers. Cinematography by Shaneel Del, and music scored by, Girish, and Gopi Sundar compete with each other and are of top standards. This is the first time Gopi Sundar is scoring music for a suspense thriller.

How do you feel about your film premiering on Amazon Prime Video?

Amazon Prime is providing ample entertainment to people in these testing times, amidst a pandemic. Amazon Prime representatives were very satisfied after watching the film. I strongly believe OTT wouldn't affect theatrical business.

- Nishabdham will be premiering on Amazon Prime on October 2nd, 2020. I suggest those watching the film on laptops and mobile phones to use headphones or earphones for a good experience. Also, refrain from fast forwarding the film as it should be enjoyed as a package.
..............

నిశ్శ‌బ్ధం ద‌ర్శ‌కుడు హేమంత్ మ‌ధుక‌ర్ తో స్పెష‌ల్ చిట్ చాట్ ఇంట‌ర్ వ్యూ

నిశ్శ‌బ్ధం కోసం అనుష్క ఇంట‌ర్నేష‌న్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు - డైరెక్ట‌ర్ హేమంత మ‌ధుక‌ర్

* నిశ్శ‌బ్ధం ఎలా మొద‌లైంది

- పుష్ప‌క విమానం టైపులో ప్ర‌స్తుత సాంకేతిక‌ను వాడుకొని థిల్ల‌ర్ నేప‌థ్యంగా ఓ ఎక్స్ పెర్మెంటల్ మూవీ చేయాల‌నుకున్నా. అలా పుట్టిందే ఈ నిశ్శ‌బ్ధం క‌థ‌, స్టోరీ మొత్తం రెడీ అయ్యాక ఓ రోజున రైట‌ర్ కొన వెంక‌ట్ గారికి నెరేష‌న్ ఇచ్చాను, ఆయ‌న‌కు న‌చ్చ‌డంతో కోనగారి ద్వారా అనుష్క త‌దిత‌ర యాక్ట‌ర్లకు కూడా స్టోరీ చెప్పి ఒప్పించి ఈ ప్రాజెక్ట్ ని దాదాపుగా మొద‌లుపెట్టే స్థితికి తీసుకువ‌చ్చాను. అయితే ఎక్స్ ప‌ర్మెంట్ అంటే నిర్మాత‌లు పెట్టుబ‌డి పెట్ట‌డానికి కాస్త వెనుకంజ వేసే అవ‌కాశం ఉండ‌టంతో కోన‌గారి సూచ‌న‌ల‌తో నేను అనుకున్న మూకీ సినిమాను కాస్త డైలాగ్స్ తో నింపి, మెయిన్ క్యారెక్టర్ వ‌ర‌కు మాత్రం సైలెంట్ గా ఉండేలా ప్లాన్ చేసుకున్నా, కోన గారి అధ్వార్యం లో సిద్ధ‌మైన డైలాగ్స్ నా స్టోరీకి ఎడిష‌న‌ల్ ఎస్సెట్ గా మార‌డంతో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, విశ్వ ప్ర‌సాద్ గారు ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు వ‌చ్చారు, వారితో పాటు కోన‌వెంక‌ట్ గారు త‌న బ్యాన‌ర్ కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ ద్వారా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామీగా చేర‌డంతో మా నిశ్శ‌బ్ధం తెర‌కెక్కింది.

* ఈ చిత్రాన్ని అమెరికా బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కించ‌డానికి కార‌ణం ఏంటి

- టైటిల్ కి త‌గ్గ‌ట్లుగానే ఈ సినిమాను ఏదైనా పీస్ ఫుల్ ప్లేస్ లో తెర‌కెక్కించాల‌ని ముందు నుంచి అనుకున్నాం, అయితే విజువ‌ల్ గ్రాండియ‌ర్ గా క‌నిపించ‌డంతో పాటు ఆడియెన్స్ కి కొంతమెర ఫ్రెష్ ఫీల్ రావ‌డానికి ఈ సినిమాను అమెరిక‌న్ బ్యాక్ డ్రాప్ లో రూపొందించాము. అలానే ఈ సినిమాలో అనుష్క కూడా అమెరిక‌న్ బార్న్ ఇండియ‌న్ గా క‌నిపించ‌బోతున్నారు. అలానే అన్ని ముఖ్య పాత్ర‌లు కూడా అమెరికా నేప‌థ్యంలోనే ఉంటాయి, ఇక హాలీవుడ్ న‌టుడు మైఖ‌ల్ మ్యాడిస‌న్ ని కూడా ఒరిజినాలిటీ మిస్ అవ్వ‌కూడ‌ద‌నే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకోవ‌డం జ‌రిగింది. ఈ మ‌ధ్య కాలంలో ఓ హాలీవుడ్ న‌టుడు ఫుల్ లెంత్ రోల్ చేసిన సినిమా నిశ్శ‌బ్ధ‌మే కావ‌చ్చు.

* అనుష్క‌, మాధ‌వ‌న్, అంజ‌లి వంటి యాక్ట‌ర్స్ ఈ ప్రాజెక్ట్ లో ఉన్నారు, ఓ ద‌ర్శ‌కునిగా వారితో మీ ప్ర‌యాణం ఎలా సాగింది

- అనుష్క గారికి ఉన్న ఫేమ్ తో పోల్చుకుంటే నేను చిన్న ద‌ర్శ‌కున్ని అయితే వారు మాత్రం ఇమేమి ప‌ట్టించుకోకుండా ప్ర‌తిది అడిగి తెలుసుకుని న‌టించారు. ఈ సినిమా కోసం అమె ఇంట‌ర్నేష‌న‌ల్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు. అలానే మాధ‌వ‌న్ కూడా త‌న పాత్ర కోసం చాలా ప్రిప‌రేష‌న్ తీసుకున్నారు. అంజ‌లి సైతం ఓ అమెరిక‌న్ కాప్ గా క‌నిపించ‌డానికి స్పెష‌ల్ ట్రైనింగ్ తీసుకుని త‌న లుక్ మార్చుకున్నారు. అయితే ఇన్ని టాలెంట్స్ ని ఓ చోట చేర్చి సినిమా తీయ‌డం అంటే కొంత‌మేర క‌ష్ట‌మే అయిన‌ప్ప‌టికి వీరింద‌రికీ ఉన్న ప్రొఫిష‌న‌లీజం కార‌ణంగా మా షూటింగ్ ఆద్యంతం హాయిగా సాగిపోయింది.

* పిపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ తో మీ అనుభ‌వం గురించి చెప్పండి

- పిపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ అధినేత విశ్వ ప్ర‌సాద్ గారు నేను చెప్పిన క‌థ‌ను న‌మ్మి బ‌డ్జెట్ విష‌యంలో ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నారు. అమెరికా లో సినిమా తీయ‌డం అంటే క‌త్తిమీద సామే అనుకోవాలి. విసాలు ద‌గ్గ‌ర నుంచి షూట్ లోకేష‌న్స్ లో ప‌ర్మిష‌న్స్ ఇలా చాలా వ్య‌వ‌హారాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నాము, అయితే ప్రొడ‌క్ష‌న్ వారు ఇచ్చిన స‌పోర్ట్ కార‌ణంగానే నేను ఈ సినిమా షూటింగ్ ని 55 రోజుల్లో ముగించేశాను. ఇక కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ మా సొంత నిర్మాణ సంస్థ‌గా భావిస్తాను, కోన‌గారితో నా అనుబంధం దాదాపు 15 ఏళ్లుగా సాగుతోంది.

* థిల్ల‌ర్ సినిమాల‌కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ చాలా కీలకం, నిశ్శ‌బ్ధంలో సౌండ్ ఎలా ఉండ‌బోతుంది

- నిశ్శ‌బ్ధంలో సౌండ్ గురించి నా మాట‌ల్లో చెప్పేకంటే రేపు సినిమా రిలీజైయ్యాక ప్రేక్ష‌కులు వారి అనుభ‌వం ద్వారా అద్భుత‌మైన ఫీడ్ బ్యాక్ ఇస్తార‌ని నేను క‌చ్ఛితంగా న‌మ్ముతున్నాను. సినిమాటోగ్రాఫ‌ర్ షానీల్ డియో అందించిన అద్భుత‌మైన విజువ‌ల్స్ తో మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ గిర‌ష్, గోపీసుంద‌ర్ ఇచ్చిన నేప‌థ్య సంగీతం పోటీ ప‌డతాయి. మా సినిమాతో గోపీసుంద‌ర్ త‌న కెరీర్ లో తొలిసారిగా ఓ థ్రిల్ల‌ర్ కి నేప‌థ్య సంగీతాన్ని అందించారు.

* అమెజాన్ ప్రైమ్ లో నిశ్శ‌బ్ధం విడుద‌ల‌వ్వ‌డం గురించి ఏం చెబుతారు

- క‌రోనా నేప‌థ్యంలో థియేట‌ర్స్ మూసి ఉన్నా ప్రేక్ష‌కుల‌కి ఎంట‌ర్ టైన్మెంట్ ఇచ్చే మాధ్య‌మాల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో వారు కీల‌కంగా వ్యవ‌హ‌రిస్తున్నారు. అలానే ఈ సినిమాను చూసి అమెజాన్ వారు కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు, ఓటిటిలు ఉన్నంత మాత్ర‌న థియేట‌ర్ కి ఎలాంటి న‌ష్టం రాద‌ని నేను ప్ర‌గాఢంగా విశ్వ‌సిస్తున్నాను. ఇలాంటి అల్ట‌ర్నేట్ ఎంట‌ర్ టేన్మెంట్ మీడియాన్ని కూడా ప్రొత్స‌హించాల్సిన అవ‌స‌రం ఉంది.

* నిశ్శ‌బ్ధం గురించి ప్రేక్ష‌కుల‌కి ఏం చెబుతారు

- అమెజాన్ ప్రైమ్ వీడియోలో అక్టోబ‌ర్ 2, 2020 నుంచి ఎక్స్ క్లూజీవ్ గా నిశ్శ‌బ్ధం అందుబాటులో ఉంటుంది. ఈ సినిమాను ల్యాప్ టాప్, మోబైల్స్ లో చూసేవారు, బెట‌ర్ ఎక్స్ పీరియ‌న్స్ కోసం హెడ్ ఫోన్స్ లేదా ఇయ‌ర్ ఫోన్స్ పెట్టుకుని సినిమా చూడాల్సిందిగా కోరుతున్నా, అలానే సినిమాను ఫార్వ‌డ్ చేయ‌కుండా అలానే ఫ్లోలో చూస్తే థ్రిల్ ని ఎంజాయ్ చేస్తారు.

 


 

 

 

 


 

 

 

 


 

 


 

 

 

 



   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved