pizza
Hyper producers (Anil Sunkara, Ram Achanta & Gopichand Achanta) interview
You are at idlebrain.com > news today >
Follow Us

4 October 2016
Hyderaba
d

Energetic Star Ram starrer 'Hyper' released all over on Friday last week. Directed by Santhosh Srinvas and produced by '14 Reels' banner this Action, Family Entertainer opened with packed houses everywhere. 'Hyper' is getting very good response from all section of audience. Producers Ram Achanta, Gopichand Achanta, Anil Sunkara shared their happiness with us.

What kind of response Hyper is getting?
The response is very good. The film is getting super hit report from all areas. Commercially also it is doing very well. Apart from youth and mass, family audience has taken to the film and government employees have connected big time to the film. Government employees are particularly asking us about shows. We are very pleased with that connect.

Is the Sathyaraj character getting highlighted helping in connection with family audience?
Hyper is basically a film that highlights the relationship between father and son. A father who has worked as government employee for 30 years without any allegations is about to retire in 30 days. His son wants to see him retire with the same stature without any allegations. This is a universally identifiable relation and that’s why the reception of the film is increasing with each passing day.

Did you think this story will receive this kind of applause?
When we first heard that story we wanted it to be dealt in a very realistic way. People have developed a preconceived notion about government officers. But in reality when an official is involved in allegations there are many circumstances and reasons behind it. We wanted to send out this realistic message with a touch of commercial elements. Since the story had strength we knew it would reach the audience eventually. As expected it is getting good applause.

How was the response in theater visits in Hyderabad city and rest of Telangana?
Its wonderful. We were happy to see all kind of audiences in cinemas. Initially a talk was spread based on the title that Hyper is a mass movie. but once the audience have seen the film they realize Hyper has a nice emotional content. It has led to more family audience watching the movie now. Since the Dushera holiday season is about to start we expect more from this segment. Even in the promos on TV’s we are targeting the families.

How is the response in overseas?
As we mentioned earlier, it has spread big way that Hyper is a mass movie. Therefore the star has been slow there but even there collections have picked up big way after people have come to know about the family emotions.

What is the feedback from distributors?
They are very happy. One or two shows are affected due to the rains but the rest of the shows are running with heavy crowd, according to their reports. Overall the distributors are really happy.

Tell us about director Santosh Srinivas?
The movie has released and it has got good talk, leaving that aside the movie was completed in four months. The shooting started on June 9 and it has released on September 30. Even though the time is less one never feels the film is rushed anywhere. This entire credit goes to the director. He has clarity and speed and this reduces all the tension on the sets. No scenes are dragged, there are many intercuts, there are action blocks and multiple locations have been used. In the recent past no big film with this much span has been completed in that time.

What’s your next project?
We are doing a film in the combination of Nithiin and Hanu Raghavapudi. Currently pre production work of the film is going on. 90 percent of the film happens on foreign shoes. It a romantic comedy and we have not yet decided where to shoot the film, in the US or European country side. Locations are being scouted as of now. Shooting will begin in the second half of November and it will be completed by April. Ram Achanta, Gopi Achanta and Anil Sunkara concluded the interview by telling that the movie is planned as a summer 2017 release.

Hyper producers Ram Achanta, Gopichand Achanta & Anil Sunkara interview gallery

- 14 రీల్స్‌ అధినేతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర
ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సంతోష్‌ శ్రీన్‌వాస్‌ దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మించిన యాక్షన్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'హైపర్‌'. ఈ చిత్రం ఇటీవల విడుదలై భారీ ఓపెనింగ్స్‌తో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకరలతో ఇంటర్వ్యూ..

హైపర్‌ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తోంది?
- రెస్పాన్స్‌ చాలా బాగుంది. అన్ని ఏరియాల నుంచి సినిమా సూపర్‌హిట్‌ అనే టాక్‌ వస్తోంది. కమర్షియల్‌గా కూడా చాలా బాగుంది. యూత్‌, మాస్‌ ఆడియన్స్‌తోపాటు ఫ్యామిలీ ఆడియన్స్‌, గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఈ చిత్రానికి బాగా కనెక్ట్‌ అవుతున్నారు. ముఖ్యంగా ఎంప్లాయీస్‌ ఈ సినిమాని చూస్తామని పర్టిక్యులర్‌గా అడుతున్నారు. అది మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది.

సత్యరాజ్‌ క్యారెక్టర్‌ హైలైట్‌ అవడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్‌ ఎక్కువగా కనెక్ట్‌ అవుతున్నారా?
- బేసిక్‌గా ఇది తండ్రీకొడుకుల మధ్య వున్న రిలేషన్‌ని బాగా ఎలివేట్‌ చేసిన సినిమా. 30 సంవత్సరాలు నిజాయితీకి మారు పేరుగా వున్న తన తండ్రి మరో 30 రోజుల్లో రిటైర్‌ అవ్వబోతున్నాడు. ఒక నిజాయితీగల ఆఫీసర్‌గానే రిటైర్‌ అవ్వాలన్నది కొడుకు కోరిక. తండ్రీ కొడుకుల రిలేషన్‌ అనేది యూనివర్సల్‌. అందుకే ఈ చిత్రానికి ఆదరణ రోజురోజుకీ పెరుగుతోంది.

ఈ కథకి ఇంత మంచి అప్లాజ్‌ వస్తుందని ముందే అనుకున్నారా?
- మొదట మేం కథ అనుకున్నప్పుడే రియలిస్టిక్‌గానే దీన్ని డీల్‌ చేద్దామనుకున్నాం. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులంటే ప్రజల్లో ఒక అభిప్రాయం వుంటుంది. ఒక ఆఫీసర్‌ అవినీతికి పాల్పడ్డాడంటే దానికి అనేక కారణాలు వుంటాయి. ఆ మెసేజ్‌ని కొన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో చూపించాలన్న ప్రయత్నమే ఈ సినిమా. కథలో మంచి బలం వుంది కాబట్టి డెఫినెట్‌గా ఇది ఆడియన్స్‌కి రీచ్‌ అవుతుందన్న నమ్మకం మాకు మొదటి నుంచీ వుంది. మేం అనుకున్నట్టుగానే అందరి నుంచి మంచి అప్లాజ్‌ వస్తోంది.

హైదరాబాద్‌ సిటీలోని థియేటర్స్‌, నైజాంలోని కొన్ని పట్టణాల్లోని థియేటర్స్‌కి వెళ్ళారు కదా! అక్కడ ఆడియన్స్‌ రెస్పాన్స్‌ ఎలా వుంది?
- చాలా అద్భుతంగా వుంది. యూత్‌, మాస్‌, ఫ్యామిలీ... ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాని బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌కి, డైలాగ్స్‌కి బాగా రెస్పాండ్‌ అవుతున్నారు. అయితే ఇది ఒక మాస్‌ సినిమా అనే టాక్‌ బాగా స్ప్రెడ్‌ అయింది. టైటిల్‌ వల్ల కావచ్చు, మరేదైనా కారణం కావచ్చు. కానీ, సినిమా చూసిన వాళ్ళంతా ఫ్యామిలీ ఎమోషన్స్‌ని చాలా చక్కగా చూపించారు అంటున్నారు. దాంతో ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్‌ కూడా వస్తున్నారు. ఇప్పుడు దసరా పండగ సీజన్‌ వుంది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్‌ ఇంకా పెరుగుతారని మా నమ్మకం. టి.వి.లో వస్తున్న ప్రోమోస్‌లో కూడా ఎక్కువగా ఫ్యామిలీ ఎమోషన్స్‌నే ఎక్కువ ఫోకస్‌ చేస్తున్నాం.

ఓవర్సీస్‌లో ఎలాంటి టాక్‌ వచ్చింది?
- ముందుగా చెప్పినట్టు 'హైపర్‌' అంటే ఒక మాస్‌ సినిమా అనేది బాగా స్ప్రెడ్‌ అయింది. దీంతో ఓవర్సీస్‌లో కొద్దిగా స్లోగా స్టార్ట్‌ అయినా ఫ్యామిలీ ఎమోషన్స్‌ వున్న సినిమా అని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు కలెక్షన్స్‌ బాగా పెరిగాయి.

డిస్ట్రిబ్యూటర్స్‌ నుంచి ఎలాంటి ఫీడ్‌బ్యాక్‌ వస్తోంది?
- వాళ్ళంతా చాలా హ్యాపీగా వున్నారు. వర్షాల వల్ల ఒకటి, రెండు షోలు కాస్త తగ్గినా తర్వాత హెవీ క్రౌడ్‌తో రన్‌ అవుతోందని చెప్తున్నారు. ఓవరాల్‌గా డిస్ట్రిబ్యూటర్స్‌ ఈ సినిమా విషయంలో చాలా హ్యాపీగా వున్నారు.

డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ గురించి చెప్పండి?
- సినిమా రిలీజ్‌ అయింది, మంచి రిజల్ట్‌ వచ్చింది.. ఇవన్నీ పక్కన పెడితే సినిమా స్టార్ట్‌ అయిన నాలుగు నెలల్లో రిలీజ్‌ చేశాం. జూన్‌ 3న సినిమా స్టార్ట్‌ చేశాం. సెప్టెంబర్‌ 30న రిలీజ్‌ అయింది. తక్కువ టైమ్‌లో షూటింగ్‌ పూర్తి చేసినా ఎక్కడా హడావిడి పడినట్టు అనిపించదు. ఆ క్రెడిట్‌ అంతా 200 పర్సెంట్‌ డైరెక్టర్‌దే. డైరెక్టర్‌లో క్లారిటీతోపాటు స్పీడ్‌ వుంటుందో అప్పుడు సెట్‌లో హడావిడి అనేది లేకుండా ప్రశాంతంగా జరిగిపోతుంది. ఒక సీన్‌ని సాగదీసినట్టు కాకుండా బోలెడన్ని ఇంటర్‌ కట్స్‌ వుంటాయి, యాక్షన్‌ బ్లాక్‌లు వున్నాయి, మంచి లొకేషన్స్‌ వున్నాయి. ఈమధ్యకాలంలో ఇంత స్పాన్‌ వున్న సినిమా ఇంత త్వరగా షూటింగ్‌ పూర్తి చేసి రిలీజ్‌ చెయ్యలేదు. డైరెక్టర్‌కి సపోర్ట్‌గా సమీర్‌రెడ్డిగారు, గౌతంరాజుగారు.. ఇలా అందరూ కరెక్ట్‌గా వుండి చెయ్యడం వల్లే అనుకున్న టైమ్‌లో సినిమాని రిలీజ్‌ చెయ్యగలిగాం.

బౌండెడ్‌ స్క్రిప్ట్‌తోనే షూటింగ్‌కి వెళ్ళారా?
- హండ్రెడ్‌ పర్సెంట్‌ బౌండెడ్‌ స్క్రిప్ట్‌తోనే వెళ్ళాం. సెట్‌కి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న ఇంప్రూవ్‌మెంట్స్‌, కొన్ని డైలాగ్స్‌లో చిన్నపాటి మార్పులు తప్ప అనుకున్న సీన్‌ పక్కాగా తీశాం. మాటల విషయంలో అబ్బూరి రవిగారు బాగా హెల్ప్‌ అయ్యారు. ఈ సినిమా కోసం మరో సినిమా కమిట్‌ అవకుండా ఈ సినిమా కోసమే వర్క్‌ చేశారు.

నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్స్‌?
- నితిన్‌, హను రాఘవపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా చేస్తున్నాం. దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఈ సినిమా 90 పర్సెంట్‌ ఫారిన్‌లో వుంటుంది. రొమాంటిక్‌ కామెడీ మూవీ ఇది. మంచి లవ్‌స్టోరీ. యు.ఎస్‌.లో చెయ్యాలా, యూరప్‌ కంట్రీస్‌లో చెయ్యాలా అనేది ఇంకా డిసైడ్‌ అవ్వలేదు. ప్రస్తుతం లొకేషన్స్‌ చూస్తున్నాం. నవంబర్‌ ద్వితీయార్థంలో ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుంది. ఏప్రిల్‌లో షూటింగ్‌ పూర్తవుతుంది. సమ్మర్‌లో సినిమాని రిలీజ్‌ చెయ్యాలన్నది ప్లాన్‌ అంటూ ఇంటర్వ్యూ ముగించారు 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అధినేతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved