pizza
Irra Mor interview about Bhairava Geetha
పాత్ర‌ను అంగీక‌రించ‌డానికి ముందు నేను వంద‌సార్లు ఆలోచిస్తా - ఐరా మోర్‌
You are at idlebrain.com > news today >
Follow Us

25 November 2018
Hyderabad

ధనుంజయ్ హీరోగా ఐరా మోర్ హీరోయిన్‌గా రామ్‌గోపాల్ వ‌ర్మ స‌మ‌ర్ప‌నలోఅభిషేక్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై సిద్ధార్థ తాతోలు ద‌ర్శ‌క‌త్వంలో అభిషేక్ నామ‌, భాస్క‌ర్ రాశి నిర్మించిన చిత్రం `భైర‌వ‌గీత‌`. లవ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం న‌వంబ‌ర్ 30న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హీరోయిన్ ఐరా మోర్ మాట్లాడుతూ ...

* ఇది నా తొలి సినిమా. తెలుగులోనూ ఇది నా తొలి సినిమా. ఈ సినిమా నా జీవితాంతం గుర్తుంటుంది.

* వ‌ర్మ‌గారితో ప‌నిచేయ‌డం చాలా ఆనందంగా ఉంది. ఆయ‌న చాలా స్ట్రెయిట్ పార్వాడ్‌. ఆయ‌నకు ఏద‌నిపిస్తే అది చెప్పేస్తారు. అంతేగానీ మ‌న‌సులో ఉంచుకుని క‌న్‌ఫ్యూజ్ చేయురు.

* ఈ సినిమాలో నేను గీత అనే పాత్ర‌లో న‌టిస్తున్నా. చాలా స్ట్రాంగ్ ఇండిపెండెంట్ విమెన్‌. చాలా స్ట్రాంగ్ అమ్మాయి. లండ‌న్‌లో చ‌దివి త‌న హోమ్ టౌన్‌కి వ‌స్తుంది. దేవుడి మీద పెద్ద భ‌క్తి ఉండ‌దు. కానీ మాన‌వత్వాన్ని న‌మ్ముతుంది. మ‌నుషుల మీద గౌర‌వాన్ని పెంచుకుంటుంది. కుల వ్య‌వ‌స్థ‌ను న‌మ్మ‌దు. అలాంటి అమ్మాయికి త‌న సొంత ఇంట్లోనే కులాల మ‌ధ్య అంత‌రం క‌నిపిస్తుంది. బానిస‌త్వం తెలుస్తుంది. అలాంటి అంశాల‌ను బేస్ చేసుకుని సినిమా ర‌న్ అవుతుంది.

* బేసిగ్గా నేను థియేట‌ర్ ఆర్టిస్టుని. నేను థియేట‌ర్‌లో ప‌నిచేస్తున్న‌ప్పుడు రామ్‌గోపాల్‌వ‌ర్మ గారు కొత్త న‌టీన‌టుల కోసం చూస్తున్నార‌ని తెలిసింది. నేను ఆడిష‌న్‌కి వెళ్లిన‌ప్పుడు అక్క‌డ సిద్ధు, రామ్‌గోపాల్‌వ‌ర్మ‌గారు ఉన్నారు. ఆడిష‌న్ చేసి ఎంపిక‌య్యా.

* మా సామాజిక వర్గంలో భ‌యం అనే ప‌దానికి మీనింగ్ తెలియ‌దు. మాది జ‌మీందారీ కుటుంబం. భ‌యం తెలియ‌క‌పోవ‌చ్చు కానీ, ఒక ర‌క‌మైన బెరుకు మాత్రం ఉంటుంది. అది స‌హ‌జ‌మే. కానీ నాకు థియేట‌ర్ ఎక్స్ పీరియ‌న్స్ ఉండ‌టం వ‌ల్ల ఆ బెరుకు కూడా చాలా గొప్ప‌గా ఏమీ లేదు. ఎప్పుడైనా కాస్త నెర్వ‌స్‌గా ఉన్నా, మిగిలిన యూనిట్ స‌భ్యులంద‌రూ న‌న్ను కామ్ చేసేవారు.

* ఈ సినిమా షూటింగ్‌లో ట‌ఫెస్ట్ పార్ట్ లు రెండు మూడులున్నాయి. ఇందులో చాలా ర‌న్నింగ్ చేయాల్సి వ‌చ్చింది. అదేం పెద్ద ఇబ్బంది కాలేదు. ఎందుకంటే నేను స్వ‌త‌హాగా స్పోర్ట్స్ ప‌ర్స‌న్‌ని. అందువ‌ల్ల నాకు పెద్ద ఇబ్బందేమీ అనిపించ‌లేదు.

* కాక‌పోతే చాలా రిమోట్ ఏరియాల్లో ప‌నిచేశాం. అక్క‌డ ఫోన్‌కు సిగ్న‌ల్స్ అందేవి కావు. ఇంట‌ర్నెట్ ఉండేది కాదు. ఇవ‌న్నీ చాలా ఇబ్బందిగా అనిపించేది. ఎందుకంటే కొన్నిసార్లు లోన్లీగా అనిపించేది. కొన్నిసార్లు యాక్ష‌న్ స‌న్నివేశాలు జ‌రుగుతున్న‌ప్పుడు 20 అడుగుల ఎత్తుకు కూడా వెళ్లేవాళ్లం. అది చాలా క‌ష్టంగా అనిపించింది. అంత ఎత్తుకు వెళ్లేట‌ప్పుడు ప‌డిపోతానేమోన‌ని అనిపించేది.

* నేను కిసెస్‌కి కూడా కంఫ‌ర్ట‌బుల్ కాదు. కానీ తొలి సినిమాలో అవ‌న్నీ చేసేట‌ప్పుడు కాస్త థ్రిల్లింగ్‌గానే అనిపించింది. నా పాత్ర‌ను దృష్టిలో పెట్టుకుని చాలా చేశా.

* ఇప్ప‌టికీ నాకు తెలుగు అర్థం కాదు. నేను ప్రిపేర్ కాక‌పోతే నెర్వ‌స్ అవుతాను. అందుకే మ‌గ‌ప్ చేయాల‌ని అనుకున్నా. `ఈ అమ్మాయి ఎక్క‌డి నుంచో వ‌చ్చేసింది. త‌న‌కు తెలుగు తెలియ‌దు. భాష రాదు. భావం రాదు` అని ఎవ‌రూ అనుకోకూడ‌దు. నా ఉద్దేశం అదే. అందుకే రెండు లైన్ల‌న్నా నేర్చుకోవ‌డానికి ప్ర‌య‌త్నించా.

* వ‌ర్మ కైండ్ ఆఫ్ సినిమా అనేది ఒక‌టి ఉంటుంద‌ని నేను అనుకోను. నేను ఇక్క‌డికి ప‌నిచేయ‌డానికి వ‌చ్చా. ప్ర‌జాద‌ర‌ణ పొందే రోల్స్ చేయ‌డానికే వ‌చ్చా.

interview gallery



* ఇంత‌కు ముందు కూడా నేను చాలా సినిమాలు వ‌ర్మ చేసిన‌వి చేశా. రంగీలా చూశాను. స‌ర్కార్ సీరీస్‌లు న‌చ్చుతాయి.

* ద‌ర్శ‌కుడికీ , ద‌ర్శ‌కుడికీ హీరోయిన్‌ని ప్రొజెక్ట్ చేయ‌డంలో తేడా ఉంటుంది. అంతేగానీ అంద‌రూ ఒకేలా చూపించాల‌ని అనుకోరు.

* సినిమాల‌కు, థియేట‌ర్‌కు చాలా తేడా ఉంటుంది. పాత్ర‌ను అంగీక‌రించ‌డానికి ముందు నేను వంద‌సార్లు ఆలోచిస్తా. కొన్నిసార్లు ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్‌లో చాలా మార్పులు ఉంటాయి. కానీ మాట్లాడ‌టం , న‌డ‌వ‌డం వంటివ‌న్నీ ఒక‌టే. అయినా నాట‌కానికి, సినిమాకు చాలా తేడాలున్నాయి.

* నేను హీరోయిన్ కావాల‌ని అనుకున్నా. కానీ మా నాన్న అంగీక‌రిస్తార‌ని అనుకోలేదు. కానీ ఒక‌రోజు మా వాళ్ల‌తో చెబితే పేరెంట్స్ ఒప్పుకున్నారు. వాళ్లు అంగీక‌రిస్తార‌ని నేను అస‌లు అనుకోలేదు.

* మీటూ లాంటి విష‌యాల గురించి అమ్మాయిలు చెప్ప‌డం మంచిదే. కానీ చాలా మంది ఏమీ జ‌ర‌గ‌క‌పోయినా, ఏదో జ‌రిగింద‌ని చెబుతున్నార‌ట‌. వాటి గురించి నాకు తెలియ‌దు. కానీ మ‌నం ప‌నిచేసే వాతావ‌ర‌ణం చాలా క్లియ‌ర్‌గా ఉండాలి.

* నేను ర‌వితేజ‌గారివి, మ‌హేష్‌గారి సినిమాలు చాలా చూశా. సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమా నాకు చాలా బాగా న‌చ్చింది. మ‌హాన‌టి, అర్జున్‌రెడ్డి నాకు న‌చ్చాయి.

* బాగా క‌థ‌లు చెప్పేవారితో ఎవ‌రితోనైనా నేను ప‌నిచేయాల‌ని అనుకుంటున్నా.

* భైర‌వ‌గీత త‌ర్వాత చాలా సినిమాలు వ‌స్తున్నాయి.

* ఇవాళ్రేపు సినిమా అనేది హీరో డ్రైవ‌న్ ఇండ‌స్ట్రీ మాత్ర‌మే కాదు. ప్ర‌పంచం మొత్తం మేల్ డామినేటింగ్ కావ‌చ్చు. కానీ ప్ర‌తి ఒక్క‌రికీ వాళ్ల‌దైన స్థానం ఉంటూనే ఉంది. వ‌ర్మ‌గారి ఫిలాస‌ఫీ అని అనుకోకూడ‌దు. మా అమ్మానాన్న‌ల నుంచి వ‌చ్చింది అని అనుకుంటా. వ‌ర్మ‌గారు సినిమా ఫొటోల‌ను ఎక్కువ‌గా ప్ర‌మోట్ చేస్తున్నారు. కేవ‌లం నా ఫొటోల‌నే అనుకుంటే పొర‌పాటు.

* అనుష్క‌గారంటే నాకు చాలా ఇష్టం.

* చిన్న రోల్ అయినా, నాకు కేర‌క్ట‌ర్ న‌చ్చితే చేస్తా. నాకు లెంగ్త్ ముఖ్యం కాదు.

* సిద్ధార్థ్ వ‌ర్క్ వైజ్ చాలా ప్రొఫెష‌న‌ల్‌గా ఉంటాడు.

 

 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved