pizza
Kajal Agarwal interview (Telugu) about Khaidi No. 150
చిరంజీవి వంటి లెజెండ్రీ యాక్ట‌ర్‌తో వ‌ర్క్ చేయ‌డం నా లైఫ్‌లోనే అమేజింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ - కాజ‌ల్ అగ‌ర్వాల్‌
You are at idlebrain.com > news today >
Follow Us

16 January 2017
Hyderaba
d

మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల‌ ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్‌పై వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌గా రూపొందిన చిత్రం `ఖైదీ నంబ‌ర్ 150`. ఈ సినిమా సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 11న విడుద‌లైంది.ఈ సంద‌ర్భంగా హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్‌తో ఇంట‌ర్వ్యూ....

స‌క్సెస్ రెస్పాన్స్‌....
- చిరంజీవిగారి ఖైదీ నంబ‌ర్ 150 సినిమా చేయ‌డం, చిరంజీవిగారి వంటి లెజండ్రీ యాక్ట‌ర్‌తో న‌టించ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. చిరంజీవిగారు హంబుల్‌, గ్రేసియ‌స్ యాక్ట‌ర్‌. నేను ప‌నిచేసిన హీరోల్లో స్వీటెస్ట్ ప‌ర్స‌న్‌. చాలా పెద్ద స్టార్ అయిన డౌన్ టు ఎర్త్ ప‌ర్స‌న్‌.

ఆయ‌నే నా ఫేవ‌రెట్‌....
- మెగా ఫ్యామిలీలో చిరంజీవిగారు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌గారు, రామ్‌చ‌ర‌ణ్‌; అల్లుఅర్జున్‌ల‌తో న‌టించాను. వీరిలో ఎవ‌రు బెస్ట్ అని అంటే చెప్ప‌డం క‌ష్టం. అయితే వీరింద‌రిలో చిరంజీవిగారే నా ఫేవ‌రెట్‌. సినిమాలో చేసిన క్యారెక్ట‌ర్ చిన్న‌దే అయినా చిరంజీవిగారితో న‌టిండం కోస‌మే ఈ సినిమాలో యాక్ట్ చేశాను.

బాగా ప్రాక్టీస్ చేశాను...
- చిరంజీవిగారు గొప్ప డ్యాన్స‌ర్‌. నాకు డ్యాన్స్ ప‌రంగా కావాల్సినంత టైం, స్పేస్ ఇవ్వ‌డంతో బాగా ప్రాక్టీస్ చేశాను. డ్యాన్స్ చేసే స‌మ‌యంలో చిన్న చిన్న స‌ల‌హాలు కూడా ఇచ్చారు. ఆయ‌న‌తో డ్యాన్స్ చేయ‌డం, న‌టించ‌డం మంచి ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది. సినిమా పెద్ద సక్సెస్ కావ‌డం హ్యాపీగా ఉంది. చిరంజీవిగారు, చ‌ర‌ణ్‌గారు ఇద్ద‌రితో క‌లిసి యాక్ట్ చేయ‌డం ఎపిక్ మూమెంట్ అని చెప్ప‌వ‌చ్చు.

చ‌ర‌ణ్ గురించి...
- చ‌ర‌ణ్‌తో న‌టించాను. ఇప్పుడు త‌ను నిర్మాత‌గా చేశాడు. నాకు తెలిసి త‌న‌లో ఏ మార్పు లేదు. అయితే ఖైదీ నంబ‌ర్ 150 నిర్మాత‌గా చ‌ర‌ణ్‌కు మొద‌టి సినిమా కాబ‌ట్టి నేను ఎగ్జ‌యిట్ అయ్యాను. ఫ్రెండ్లీ హీరో...క్వాలిటీ విష‌యంలో కాంప్ర‌మైజ్ కాడు.

Kajal interview gallery

ఆ ఆలోచ‌న లేదు...
- స్పెష‌ల్ సాంగ్స్ చేయడంలో నాకు ప‌ర్టికుల‌ర్ ఆలోచ‌న లేదు. స్టార్స్ సినిమాల్లో చేస్తాను. లేక‌పోతే చేయ‌ను అని కూడా లేదు. మంచి ఆఫ‌ర్ వ‌స్తే ఆలోచిస్తాను.

రెండూ ఇష్ట‌మే...
- చిరంజీవిగారు చేసిన శంక‌ర్ పాత్ర‌, క‌త్తి శీను పాత్ర‌లు రెండూ నాకు ఇష్టమే. చిరంజీవిగారితో వ‌ర్క్ చేయ‌డంతో ఎలాంటి అట్యిట్యూడ్‌తో ఉండాల‌నే నేర్చుకున్నాను. హ్యుమిలిటీ నేర్చుకున్నాను. చాలా కూలెస్ట్ యాక్ట‌ర్‌..చిరంజీవిగారు సెట్‌లో ఉంటే అన్నీ విష‌యాలు స‌కాలంలో జ‌రిగిపోతాయి.

పెళ్లి గురించి...
- నాకు బాయ్‌ఫ్రెండ్ లేరు. వీలైతే మీరే వెతికిపెట్టండి....

నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌...
- రానాతో తేజ‌గారి ద‌ర్శక‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాను. అజిత్ హీరోగా రూపొందుతోన్న మూవీలో న‌టిస్తున్నాను. విజ‌య్ హీరోగా రూపొందుతోన్న సినిమాలో కూడా న‌టిస్తున్నాను.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved