pizza
Kalyan Krishna interview about Soggade Chinni Nayana
ఈ చిత్రంలో ఆ న‌లుగురు నాలుగు స్తంభాలు - క‌ల్యాణ్ కృష్ణ‌
You are at idlebrain.com > news today >
Follow Us

13 January 2016
Hyderabad

నాగార్జున న‌టించిన సోగ్గాడే చిన్నినాయ‌న సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు క‌ల్యాణ్ కృష్ణ‌. ఇందులో నాగార్జున తండ్రీ కొడుకులుగా న‌టిస్తున్నారు. అన్న‌పూర్ణ సంస్థ నిర్మించిన ఈ సినిమా శుక్ర‌వారం విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా క‌ల్యాణ్ కృష్ణ విలేక‌రుల‌తో మాట్లాడారు.

* మీ గురించి చెప్పండి?
- మాది వెస్ట్ గోదావ‌రి. నేను పెరిగిందంతా వైజాగ్‌. యూనివ‌ర్శిటీలో ఎం.కామ్ చేస్తున్న‌ప్పుడే హోలీ సినిమాకు స్క్రిప్ట్ ఇచ్చాను. ఆ త‌ర్వాత తేజ‌గారి ద‌గ్గ‌ర జై నుంచి ద‌ర్శ‌క‌త్వ‌శాఖ‌లో చేశా. పోసానిగారి ద‌గ్గ‌ర, సూర్యా మూవీస్‌లోనూ ప‌నిచేశాను. దాదాపు ప‌దేళ్ళ‌కు పైగా ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో చేశాను. ఇది నాకు తొలి సినిమా.

* ఈ సినిమా అవ‌కాశం ఎలా వ‌చ్చింది?
- నేను నాగ‌చైత‌న్య‌ను దృష్టిలో పెట్టుకుని అంత‌కు ముందు నాగార్జున‌గారికి రెండు క‌థ‌లు చెప్పాను. చైత‌న్య మ‌రో రెండు ప్రాజెక్టులు చేస్తున్నార‌ని, న‌న్ను వెయిట్ చేయ‌మ‌ని చెప్పారు నాగ్ సార్‌. స‌రేన‌నుకున్నా. అలాంటి స‌మ‌యంలోనే ఒక‌సారి రామ్మోహ‌న్‌గారు ఫోన్ చేసి ఈ క‌థ‌ను డెవ‌ల‌ప్ చేయ‌మ‌ని మెయిల్ చేశారు. 15 డేస్ టైమ్ తీసుకుని మెయిల్ చేశా. వెంట‌నే నాగ్ సార్‌కి న‌చ్చి మ‌రో 15 డేస్ టైమ్ ఇచ్చి న‌న్ను బౌండ్ స్క్రిప్ట్ చేయ‌మ‌న్నారు. చేశాను.

* నాగార్జున రెండు పాత్ర‌ల గురించి చెప్పండి?
- నాగార్జున‌గారు బంగార్రాజు పాత్ర‌లోనూ, రాంబాబుగానూ క‌నిపిస్తారు. బంగార్రాజు స‌ర‌దాగా ప‌ల్లెటూరిలో సాగే పాత్ర‌. ఆయ‌న గ‌ర్ల్ ఫ్రెండ్‌గా కృష్ణ‌కుమారి పాత్ర ఉంటుంది. అందులో ఎవ‌రు చేశార‌నేది స‌స్పెన్స్. ఈ సినిమాలో రాంబాబు పాత్ర‌ను త‌ల్లి నాజూగ్గా పెంచుతుంది. అత‌నికి త‌న వృత్తి త‌ప్ప ఇంకేమీ తెలియ‌దు. అలాంటి పాత్ర అది.

* ఇందులో నాగార్జున ఆత్మ‌గా క‌నిపిస్తారా?
- అవునండీ. మ‌ధ్య‌లో కొంత ఫ్లాష్ బ్యాక్ త‌ప్ప మిగిలిందంతా ఆయ‌న ఆత్మ‌గానే క‌నిపిస్తారు. ఇందులో య‌మ‌లోకాన్ని కూడా ఒక లోకంగా క్రియేట్ చేసి కొత్త‌గా చూపించాం. దాంతో పాటు ఒక పాము, ఒక టెంపుల్ కూడా ఇందులో కీ రోల్స్ గా ఉంటాయి.

* ఈ సినిమా హైలైట్స్ ఏంటి?
- బంగార్రాజు, స‌త్య‌భామ‌, రామ్మోహ‌న్‌, సీత పాత్ర‌లు నాలుగు పిల్ల‌ర్ల‌లాగా ఉంటాయి. ఈ సినిమాలో రొమాన్స్, హ్యూమ‌ర్ ఉంటుంది. పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. అనూప్ రీరికార్డింగ్ చాలా బాగా చేశారు. బ్ర‌హ్మానందంగారి పాత్ర బావుంటుంది. కంప్లీట్ విలేజ్ బేస్డ్ సినిమా. అన‌సూయ‌, హంసానందిని అతిథి పాత్ర‌ల్లో కీల‌కంగా క‌నిపిస్తారు. య‌ముడుగా నాగ‌బాబు చేశారు. సంప‌త్‌గారు, నాజ‌ర్‌గారు, పోసానిగారి పాత్ర‌లు హైలైట్ అవుతాయి. నాగార్జున‌గారు సినిమా చూసి మెచ్చుకున్నారు.

* మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి?
- అన్న‌పూర్ణ స్టూడియోలోనే ఉంటుందండీ.

* మీకు చిరంజీవిగారితో అనుబంధం ఉంద‌ట క‌దా?
- మా అన్న‌య్య‌కు చిరంజీవిగారు ఫ్రెండ్‌. ఆ చ‌నువుతో నేను ఈ ప్రాజెక్ట్ ఓకే అయిన సంగ‌తిని ఆయ‌న‌తో చెప్పాను. ముందే ఎందుకు చెప్ప‌లేద‌ని చెప్పారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved