pizza
Nandamuri Kalyan Ram interview (Telugu) about 118 movie
'118'....ఎమోషనల్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ - నందమూరి కల్యాణ్‌రామ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

23 February 2019
Hyderabad

డైనమిక్‌ హీరో నందమూరి కల్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా నటిస్తోన్న స్టైలిష్‌ యాక్షన్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ '118'. నివేదా థామస్‌, షాలిని పాండే హీరోయిన్స్‌గా నటించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కె.వి.గుహన్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై మహేశ్‌ కొనేరు నిర్మించారు. మార్చి 1న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో నందమూరి కల్యాణ్‌రామ్‌తో ఇంటర్వ్యూ...

'118' సినిమా ఒప్పుకోవడానికి కారణమేంటి?
- ముఖ్యంగా కథ బాగా నచ్చింది. అసలు సినిమా కథేంటి అనే దాన్ని సింపుల్‌గా ట్రైలర్‌లో చూపించేశాం. కొన్ని సిచ్యువేషన్స్‌ను పతి ఒక్కరూ ఈ దశను వారి జీవితంలో ఫేస్‌ చేసే ఉంటారు. కానీ ఎక్కువ సందర్భాల్లో రియాక్ట్‌ కాం. అలాంటి వాటి గురించి పక్కన వాళ్లకు చెబితే వాళ్లు నవ్వుతారు. అలాంటి సిచ్యువేషన్స్‌ నా రియల్‌లైఫ్‌లో కూడా ఈ సినిమాలో చూపించినట్లు అలాగే జరిగాయి. కాబట్టి కనెక్ట్‌ అయ్యాను.

మీ పాత్ర ఎలా ఉంటుంది?

సాధారణంగా హీరో క్యారెక్టర్‌ గురించి చెప్పాలంటే హీరో ఓ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌. క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది. ఓ విషయాన్ని లోతుగా అన్వేషించి తెలుసుకోవాలనుకునే తత్వం ఉండే వ్యక్తి. అలాంటి మనస్తత్వం ఉండే హీరో ఓ విషయాన్ని అన్వేషించుకుంటూ వెళుతుండే కథే '118'. దర్శకుడు కె.వి.గుహన్‌గారి లైఫ్‌లో ఓ సిచ్యువేషన్‌ ఒకేసారి జరిగింది. అయితే ఎందుకలా జరిగింది? అని అన్వేషించుకోలేదు. కానీ అలా అన్వేషణ చేస్తే ఏమవుతుంది అనేదే కథ. అలాగని ఇదేం సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ కాదు. చూసే ప్రేక్షకులకు అలాంటి ఫీలింగ్‌ని ఇస్తుంది. ఓ నార్మల్‌ మూవీ. ఈ సినిమాలో అండర్‌ వాటర్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉంటుంది. దాని కోసం నేను ఈత నేర్చుకుని ముంబైలో షూట్‌ చేశాం.

టైౖటిల్‌ జస్టిఫికేషన్‌ ఏంటి?
- డైరెక్టర్‌గారు కథ చెప్పిన తర్వాత రక్షణ, అన్వేషణ.. ఇలా చాలా టైటిల్స్‌ను అనుకున్నాం. అయితే 118 అయితే ఆసక్తికరంగా, కొత్తగా ఉంటుందని టైటిల్‌గా నిర్ణయించాం. కథ నివేదాథామస్‌ పాత్ర చుట్టూ తిరుగుతుంది. సినిమా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి సీన్‌ తర్వాత ఏమవుతుందనే ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇందులో హీరో పాత్ర, ఆడియెన్‌ పాత్రలాగానే ఉంటుంది. అంటే హీరో రీసెర్చ్‌ చేసుకుంటూ వెళ్లే సమయంలో ఆడియెన్స్‌కు ఏ విషయాలైతే తెలుస్తాయో.. హీరోకి కూడా అదే విషయాలు తెలుస్తాయి. నెరేషన్‌లో స్ట్రయిట్‌ ఫార్మేట్‌ ఉంటుంది. డైరెక్టర్‌గారు ఫేస్‌ చేసిన సిచ్యువేషన్స్‌కి ఇందులో సొల్యూషన్‌ కూడా చూపించారు.

ఈ ప్రాజెక్ట్‌లోకి మహేష్‌ కొనేరు ఎలా వచ్చారు?
- గుహన్‌గారు కథ చెప్పగానే బాగా నచ్చింది. మా హరి, ఇతర టీం సభ్యులతో డిస్కస్‌ చేసి చెబుతానండి.. అన్నాను. హరి, నా టీం కూడా కథ విన్నారు. వారికి కూడా నచ్చింది. ఓ రోజు, మహేష్‌నిి కలిసినప్పుడు 'ఒక అద్భుతమైన కథ విన్నాను' అని చెప్పాను. డైరెక్టర్‌ ఎవరనే విషయాన్ని తెలుసుకున్న ఆయన 'నేను కూడా ఓసారి కథ వింటాను' అని చెప్పి కథ విన్నారు. ఆ సమయంలో నా నువ్వే సినిమా జరుగుతుంది. కథ విన్న మహేష్‌గారికి చాలా బాగా నచ్చడంతో తనే ప్రొడ్యూస్‌ చేస్తానని అన్నారు. అలా మహేష్‌ కొనేరు నిర్మాతగా సినిమా సెట్స్‌లోకి వెళ్లింది. ప్రొడక్షన్‌ వేల్యూస్‌ బాగా కనపడే సినిమా ఇది. నిర్మాతగా మహేష్‌గారు సినిమాను అద్భుతంగా నిర్మించారు. మహేష్‌ జర్నలిజం నుండి నిర్మాతగా మారాడు. తనకు సినిమా సెన్సిబుల్స్‌ తెలిసిన వ్యక్తి. నైస్‌ పర్సన్‌.

సినిమాలో కామెడి ఏ మేర ఉంటుంది?
- కథలో భాగంగానే ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది. ప్రత్యేకంగా ఎక్కడా తీసుకోలేదు.

కెమెరామెన్‌ డైరెక్టర్‌ అయితే బెనిఫిట్‌ ఉందనిపించిందా?

- హండ్రెడ్‌ పర్సెంట్‌ బెనిఫిట్‌ ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. చివరి ముప్పై నిమిషాలు ప్రేక్షకులకు మరో లోకంలోకి తీసుకెళుతుంది. విజువల్స్‌ అద్భుతంగా కుదిరాయి. గుహన్‌గారు ప్రతి విషయాన్ని చాలా కేర్‌ తీసుకున్నారు. ఆయన కథ, స్క్రీన్‌ప్లే, కెమెరావర్క్‌, డైరెక్షన్‌ లేకుండా ఈ సినిమా చేయడం కుదిరేది కాదేమో. ఎడ్జ్‌ ఆఫ్‌ ది సినిమా కూర్చొని బెట్టే కమర్షియల్‌ మూవీ అని చెప్పగలను. సినిమాలో డైలాగ్స్‌ కూడా ఎలా ఉంటే అలా చెప్పమని అనేవారు కాదు.. చదివి అర్థం చేసుకుని మనం ఆ సిచ్యువేషన్‌లో ఉంటే ఎలా మాట్లాడుతామో అలా మాట్లాడమని చెప్పేవారు. ఏమైనా బెటర్‌మెంట్‌ ఉంటే చేసేవారు. ఈ ప్యాట్రన్‌లో సినిమా చేయడం నాకు కొత్తగానే అనిపించింది.

ఫెయిల్యూర్‌ మిమ్మల్ని బాధిస్తుందా?
- నేనూ మనిషినే! అపజయాలు నన్ను కూడా బాధిస్తాయి. అయితే ఎక్కడ తప్పు జరిగిందని ఆలోచించుకుని, చర్చించుకుని ముందుకెళుతుంటాను. నా ఫ్యామిలీ సపోర్ట్‌ ఎంతగానో ఉంది.

పర్టికులర్‌గా నివేదానే కీలక పాత్రకు తీసుకోడానికి కారణమేంటి?

- తను మంచి పెర్ఫామర్‌. నిన్నుకోరి, జైలవకుశ చిత్రాల్లో అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో కూడా స్ట్రాంగ్‌ ఉమెన్‌ రోల్‌ చేసింది. ఎమోషనల్‌ సీన్స్‌ను చాలా చక్కగా చేయగల హీరోయిన్‌.

డిజిటల్‌ ఫ్లాట్‌ఫాంలోకి ఎంట్రీ ఎప్పుడు?
- తప్పకుండా వెబ్‌సిరీస్‌ చేసే ఆలోచన ఉంది. ప్రస్తుతం డిస్కషన్స్‌ జరుగుతున్నాయి. నేను ఆ వెబ్‌ సిరీస్‌కు నిర్మాతగా వ్యవహరిస్తాను. ప్రాజెక్ట్‌ అంతా రూపొందిన తర్వాత అనౌన్స్‌ చేస్తాను.

సినిమా థియేటర్స్‌లో ఉండగానే డిజిటల్‌లో ప్రసారమవుతున్నాయి కదా.. దీనిపై మీ అభిప్రాయం?

- ఒకప్పుడు సినిమా విడుదలైన ఆరు నెలలు తర్వాత ఛానెల్స్‌లో ప్రసారమయ్యేవి. అయితే కమర్షియల్‌ ఫార్మేట్స్‌ మారుతున్నాయి. ఇప్పుడు విడుదలైన కొన్ని రోజులకే సినిమా డిజిటల్‌ మాధ్యమంలో ప్రసారమవుతుంది. అయితే అలా కాకుండా ఓ మినిమం టైమింగ్‌ ఫిక్స్‌ చేసి డిజిటల్‌ మాధ్యమంలో రిలీజ్‌ చేయాలని వ్యక్తిగతంగా భావిస్తాను.

నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్స్‌ ఏంటి?

- మంచి స్క్రిప్స్‌ విన్నాను. ఇప్పుడిప్పుడే ప్లాన్‌ చేసుకుంటున్నాను. '118' రిలీజ్‌ తర్వాత తదుపరి సినిమా ప్లాన్‌ చేస్తాశ్రీను.
ట్టుకోవడంతో సినిమా చేయడానికి అంగీకరించాను.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved