pizza
Interview with Karthik Subbaraj about Mercury
ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేసే సైలెంట్ థ్రిల్ల‌ర్ `మెర్క్యురి` - కార్తీక్ సుబ్బ‌రాజ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

8 April 2018
Hyderabad

ప్రభుదేవా ప్రధాన పాత్రలో పెన్‌ స్టూడియోస్‌, స్టోన్‌ బెంచ్‌ ఫిలింస్‌ సమర్పణలో.. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో కార్తీకేయన్‌ సంతానం, జయంతి లాల్‌ నిర్మించిన సైలెంట్‌ చిత్రం 'మెర్క్యురి'. ఈ సినిమా ఏప్రిల్‌ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు కార్తీక్‌ స్బురాజ్‌తో ఇంటర్వ్యూ...

సైలెంట్‌ మూవీ...
- 'మెర్క్యురీ' సినిమాను ఏప్రిల్‌ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. ప్రస్తుతం తమిళనాట థియేటర్స్‌ బంద్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తమిళ సినిమాలు మినహా ఇతర భాషా చిత్రాలను తమిళనాడులో ప్రదర్శిస్తున్నారు. 'మెర్క్యురి' సినిమా సైలెంట్‌ సినిమా కాబట్టి.. సినిమా తమిళనాడు సహా అన్నిచోట్ల విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నాం. సినిమా విడుదలకు ఏ సమస్యా లేదు. అయితే తమిళంలో సినిమాను విడుదల చేయడం లేదు.

ఆలోచన అలా వచ్చిందే..
- టాకీ సినిమాలు రాక ముందు అన్ని సైలెంట్‌ సినిమాలే వస్తుండేవి. టాకీ సినిమాలు స్టార్ట్‌ అయిన తర్వాత కూడా కమల్‌గారు, సింగీతం శ్రీనివాసరావుగారు పుష్పక విమానం అనే సైలెంట్‌ మూవీని చేశారు. నేను సినిమాలు చేయడం స్టార్ట్‌ చేసిన తర్వాత ఎటువంటి డైలాగ్స్‌ లేకుండా సినిమా చేయాలని అనుకునేవాడిని. థ్రిల్లర్‌ జోనర్‌లో సినిమా చేయాలనుకోగానే.. సైలెంట్‌ సినిమాగా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన నుండి మెర్క్యురీ సినిమా చేశాం. సినిమా నిడివి రెండు గంటలలోపే ఉంటుంది. అయితే ప్రతి సన్నివేశం మెప్పించేలా ఉంటుందనే కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.

ఇన్‌స్పిరేషన్‌ కాదు...
- ఏ హాలీవుడ్‌ మూవీకి ఇది ఇన్‌స్పిరేషన్‌ కాదు. ఓ హిల్‌ స్టేషన్‌లో జరిగే కథ. యూనిక్‌ పాయింట్‌తో తెరకెక్కింది. ఫస్ట్‌ ఫ్రేమ్‌ నుండి ఆడియెన్స్‌ను ఎంగేజ్‌ చేసే థ్రిల్లర్‌ మూవీ ఇది. ట్రైలర్‌ చూసిన తర్వాత ఈ సినిమాను హాలీవుడ్‌ మూవీతో పోల్చారు కానీ.. దానికి.. ఈ సినిమాకు ఏ సంబంధం లేదు.

నెగిటివ్‌ షేడ్‌ పాత్రలో ప్రభుదేవా...
- ప్రభుదేవాగారు గొప్ప డాన్సరే కాదు.. గొప్ప యాక్టర్‌ కూడా. ఆయన అన్ని రకాల పాత్రలు చేయగలరు. ఆయన యూనిక్‌గా చేసిన సినిమా ఇది. అద్భుతంగా చేశారు. కథ రాసుకునేటప్పుడు ఈ పాత్రకు ముందుగా ప్రభుదేవాగారిని అనుకోలేదు. అయితే ఇలాంటి పాత్ర చేయని నటుడు ఈ పాత్రలో నటిస్తే బావుంటుందని అనుకున్నాను. ప్రభుదేవాగారు చేస్తే ఉంటుందనే ఆలోచన వచ్చింది. ఆయన్ను కలిసి కథ చెబితే నచ్చి చేస్తానన్నారు. ప్రభుదేవాగారితో పాటు పాటు సనంత్‌, దీపక్‌, అనీశ్‌, శశాంక్‌, హిందూజ తదితరులు నటించారు. ఇందులో ప్రభుదేవాగారు నెగిటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రలో కనపడతారు. రమ్య నంబీశన ్‌అతిథి పాత్రలో కనిపిస్తారు. సినిమా స్టోరీ లైన్‌ కానీ.. మేకింగ్‌ వాల్యూస్‌.. టేకింగ్‌ అన్ని ప్రేక్షకులను ఉత్కంఠతకు గురించేస్తాయనడంలో సందేహం లేదు. ఆడియెన్స్‌కు యూనిక్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఇస్తుంది. మేం కూడా అతృతగా ఎదురుచూస్తున్నాం.

సౌండ్‌, విజువల్స్‌ ఎంతో కీలకం...
- సినిమాలో ఏ డైలాగ్‌ లేని కారణంగా విజువల్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాలో కీలకంగా ఉంటాయి. సంతోశ్‌ నారాయణ్‌ సినిమాకు అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందించారు. చాలా సమయం తీసుకుని సంతోశ్‌నారాయణ్‌, కునాల్‌లు బాగా కష్టపడ్డారు. రెండు రోజుల వ్యవథిలో జరిగే కథే ఈ మెర్క్యురి సినిమా. తిరుగారు అద్భుతమైన సినిమాటోగ్రాఫర్‌. స్క్రిప్ట్‌ పూర్తి చేసి ఆయన దగ్గరకు వెళ్లగానే ఆయనకు నచ్చింది. సినిమా చేయడానికి అంగీకరించారు. సగం బరువును ఆయనే తీసుకున్నారు. ఏ డైలాగ్‌ లేని కారణంగా విజువల్స్‌కు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పలేం. తిరుగారు ఎక్సలెంట్‌ వర్క్‌ చేశారు.

సినిమాలో అంతర్గతంగా...
- నేను ఇమేజ్‌ కోసం సినిమా చేయలేదు. ప్రేక్షకులకు ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ ఇవ్వాలనే ఉద్దేశంతోనే సినిమా చేశాను. మెర్క్యురీ అనేది రసాయనికం పేరు. ఈ సినిమాలో రసాయనాల పాయిజనింగ్‌ అనే కాన్సెప్ట్‌తో సాగుతుంది. ప్రపంచంలో అన్నిచోట్ల జరిగే కెమికల్‌ పాయిజనింగ్‌ జరుగుతుంటుంది. కొన్ని ఫ్యాక్టరీలు వెలువరిచే రసాయనాల కారణంగా భావితరాలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటుందనేది అంతర్గతంగా సినిమాలో కనపడుతుంది.

నేను భాగమే...
- ఈ సినిమా నిర్మాణంలో నేను కూడా ఓ భాగమైయాను. సినిమా చేయాలనే ఐడియా చెప్పగానే మిగిలిన నిర్మాతలు కొత్తగా ఉందని సంతోపడ్డారు. సైలెంట్‌ మూవీ కాబట్టి..భాష సమస్య ఉండదు. ఇండియా అంతా రిలీజ్‌ అవుతుంది.

కల నిజమైంది...
- రజనీకాంత్‌గారితో సినిమా చేయడమనేది నా కల నిజమైనట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకు నేను పెద్ద అభిమానిని. యాక్షన్‌, డ్రామా మూవీ. ప్రస్తుతం స్క్రిప్ట్‌ రాస్తున్నాను. రెండు, మూడు నెలల్లో సినిమా ప్రారంభం అవుతుంది.

తెలుగు సినిమాలు చూస్తుంటాను...
- తెలుగు సినిమాను ఫాలో అవుతుంటాను. ఇటీవల 'అర్జున్‌రెడ్డి' సినిమాను చూశాను. చాలా బాగా నచ్చింది. హీరో నటన కానీ.. టేకింగ్‌ బావున్నాయి. నేను చేసిన ప్రతి సినిమా నన్ను ఎగ్జయిట్‌ చేసింది. అందువల్ల కొత్తగా చేయగలిగాను. కంఫర్ట్‌ జోనర్‌ను దాటి సినిమాలు చేస్తుంటాను. ఇండియన్‌ సినిమాలో చాలా మంది ప్రతిభావంతులైన నటులున్నారు. అందరితో సినిమాలు చేయాలనుకుంటున్నాను.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved