pizza
K.Dasaradh interview about Shourya
రెండింటినీ సమానంగానే చూస్తాను – కె.దశరథ్
You are at idlebrain.com > news today >
Follow Us

28 February 2016
Hyderaba
d

బేబి త్రిష సమర్పణలో సురక్ష ఎంటర్ టైన్మెంట్ ప్రై.లి. బ్యానర్ పై మంచు మనోజ్, రెజీనా జంటగా నటించిన చిత్రం ‘శౌర్య’. కె.దశరథ్ దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సంతోషం, సంబరం, మిష్టర్ ఫర్ ఫెక్ట్ వంటి సూపర్ హిట్ చిత్రాల డైరెక్టర్ కె.దశరథ్ ఈ లవ్ థ్రిల్లర్ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఈ చిత్రం మార్చి 4న విడుదలవుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు కె.దశరథ్ తో ఇంటర్వ్యూ....

ఎవరూ ఊహించరు...
-డిఫరెంట్ లవ్ స్టోరీ చేయాలని అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. సాధారణంగా లవ్ ఫెయిల్యూర్ కు తల్లిదండ్రులు అంగీకారం లేకపోవడమో, లవర్స్ మధ్య బేదాభిప్రాయాలు రావడమో కారణాలుగా ఉంటాయి. అయితే ఈ చిత్రం మరో స్టయిల్ లో ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది.

తెలుగులో రాని కథ....మనోజ్ డిఫరెంట్ గా కనపడతాడు...
-తెలుగులో ఇలాంటి కథతో సినిమా రాలేదు. ఫైట్స్ ఉండవు. ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే సినిమా. మనోజ్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్ర చేశాడు. ఇందులో మనోజ్ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనపడతాడు. మనోజ్ క్యారెక్టర్ పాజిటివ్ లేక నెగటివ్ అని ముందుగా ఎవరికీ అర్థం కాకుండా ఉంటుంది. మనోజ్ చాలా చక్కని వేరియేషన్ చూపించాడు. మనోజ్ తో శ్రీ తర్వాత చేసిన సినిమా. ఇన్నేళ్ళ తర్వాత మనోజ్ ఎనర్జీలో మార్పు లేదు. ఏదో కొత్తగా చేయాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు.

నిర్మాత గురించి..
-కాన్సెప్ట్ వినగానే నిర్మాత మల్కాపురం శివకుమార్ వెంటనే సినిమా చేద్దామని అనడమే కాదు, క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. సినిమాను 45 డేస్ లో పూర్తి చేద్దామనుకున్నాం. అయితే కొన్ని కారణాలతో సినిమాను వారం ఆలస్యంగా అంటే 51 రోజుల్లోనే పూర్తి చేసేశాను.

K.Dasaradh interview gallery

 

రెండింటినీ ఒకేలా చూస్తాను...
-ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటారు. కంటెంట్ కొత్తగా ఉంటే ఆదరిస్తారు. నా కెరీర్ లో పెద్ద హిట్స్, ప్లాప్స్ చూశాను. అయితే రెండింటినీ ఒకేలా చూడటం వల్ల హ్యపీగా ఉంటాను. అయితే ఎప్పుడూ బెటర్ మెంట్ సినిమాలు తీయడానికే ప్రయత్నిస్తాను.

రీషూట్స్ చేయడానికి కారణమదే..
-నేను రైటర్ గా కథ రాసుకున్నప్పుడు చాలా మందికి కథలు వినిపిస్తాను. అందరూ సలహాలు తీసుకుని ఆలోచించే సినిమా స్టార్ట్ చేస్తాను. సినిమా ఎనబై శాతం పూర్తయిన తర్వాత సినిమా చూసి ఎక్కడైనా అనుకున్నట్లు రాలేదని అనిపిస్తే రీ షూట్స్ చేస్తాను.

అతనితో సినిమా చేస్తా...
-ఇండస్ట్రీలో నాకు తక్కువ మంది స్నేహితులున్నారు. వినాయక్, కోనవెంటక్, గోపిమోహన్, ప్రభాస్, మనోజ్ లతో స్నేహంగా ఉంటాను. సినిమాలకు సంబంధం లేకుండా వారిని కలుస్తుంటాను. ప్రభాస్ తో తప్పకుండా ఓ సినిమా చేస్తాను. త్వరలోనే వివరాలు తెలియజేస్తాను.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్....
-కథలు సిద్ధంగానే ఉన్నాయి. అయితే ఏదీ ఫైనల్ కాలేదు. శౌర్య సినిమా రిలీజ్ తర్వాత నెక్ట్స్ సినిమా గురించి ఆలోచిస్తాను.

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved