pizza
Keerthi Suresh interview about Nenu Sailaja
ఆయ‌న చాలా కేరింగ్ ప‌ర్స‌న్‌ - కీర్తి సురేశ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

24 December 2015
Hyderabad

నిన్న‌టి త‌రం నాయిక మేన‌క కుమార్తె కీర్తి సురేశ్‌. కీర్తి తండ్రి సురేశ్ మ‌ల‌యాళంలో పేరున్న నిర్మాత‌. సినిమా వాతావ‌ర‌ణంలో పెరిగిన కీర్తి మ‌ల‌యాళ సినిమా గీతాంజ‌లి ద్వారా వెండితెర‌కు ప‌రిచ‌య‌మైంది. ప్రియ‌ద‌ర్శ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో మోహ‌న్‌లాల్ న‌టించిన సినిమా గీతాంజ‌లి. ఆ త‌ర్వాత త‌మిళ చిత్రాల్లో న‌టించిన ఈ భామ ఇప్పుడు తెలుగులోనూ న‌టిస్తోంది. అయినా ఇష్టం నువ్వు సినిమాతో తెలుగు ప‌రిచ‌య‌మైన ఈ సుంద‌రి ఇప్పుడు `నేను-శైల‌జ‌`లోనూ నాయిక‌. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా ఈ సినిమా విడుద‌ల కానుంది. శుక్ర‌వారం ఉద‌యం కీర్తి విలేక‌రుల‌తో ముచ్చ‌టించింది. ఆ విశేషాలు...

* ఈ సినిమా అవ‌కాశం ఎలా వ‌చ్చింది?
- నేను-శైల‌జ సినిమా గురించి ముందు కిశోర్ తిరుమ‌ల‌గారు నాకు క‌థ చెప్పారు. అయినా ఇష్టం నువ్వు చూసి ఆయ‌న న‌న్ను అప్రోచ్ అయ్యారు. ఆ త‌ర్వాత స్ర‌వంతి ర‌వికిశోర్‌గారితో చెన్నైకి వ‌చ్చి న‌న్ను క‌లిశారు. హీరోయిన్ పాత్ర‌కు ప్రాముఖ్య‌త ఉంద‌నిపించింది. అందుకే ఓకే చెప్పేశాను.

* సినిమాలో ఏం న‌చ్చింది?
- కిశోర్ తిరుమ‌ల నాకు క‌థ‌ను చెప్పే తీరే చాలా బాగా న‌చ్చింది. చాలా రియ‌లిస్టిక్‌గా చెప్పారు. చాలా నేచుర‌ల్‌గా ఉంటుంది సినిమా. లిటిల్ బిట్ డ్రామా ఉంటుంది. అయినా ఇందులో ఫాద‌ర్‌, డాట‌ర్ సెంటిమెంట్ కూడా గుడ్‌.

* సినిమాను ఓకే చేయ‌డానికి ముందు మీ మాన‌సిక ప‌రిస్థితి ఏంటి?
- సినిమా నా ద‌గ్గ‌ర‌కు రాగానే ఎగిరి గంతేసి ఓకే చెప్ప‌లేదు. క‌థ ఎలా ఉంటుందో ఓ సారి విందాంలే అనుకున్నా తీరా క‌థ న‌చ్చ‌గానే ఓకే చెప్పేశా.

* రామ్ గురించి మీకు ముందే తెలుసా?
- ఆయ‌న‌తో ప‌రిచ‌యం లేదు. కానీ యాక్ట‌ర్ అని తెలుసు. మా అమ్మ‌, అక్క అత‌ని గురించి చాలా బాగా చెప్పారు.

* శైల‌జ పాత్ర ఎలా ఉంటుంది?
- త‌ను చాలా ఇంట్రోవ‌ర్ట్. కానీ చాలా ఎమోష‌న్స్ ఉన్న అమ్మాయి. కాక‌పోతే ఎక్కువ‌గా ఎక్స్ ప్రెస్ చేయ‌దు. కోవ‌ర్డ్. త‌న చిన్న‌త‌నం నుంచి అలాగే ఉంటుంది.

* రామ్ గురించి చెప్పండి?
- త‌ను చాలా ఎన‌ర్జిటిక్‌. డ్యాన్సులు బాగా చేస్తాడు.ఎప్పుడూ ఒకచోట కూర్చోవ‌డాన్ని నేను గ‌మ‌నించ‌లేదు. ఇటు ఓ సీన్‌లో యాక్ట్ చేయ‌గానే వెంట‌నే వెళ్లి మానిట‌ర్‌లో చూసుకుంటాడు. ప్రతిదీ ప‌ర్ఫెక్ట్ గా ఉండాల‌నుకుంటాడు.

* త‌న‌తో డ్యాన్సుల్లో పోటీ ప‌డ‌గ‌లిగారా?
- ఈ చిత్రంలో నేను డ్యాన్సులు చేసే స‌న్నివేశాలు, పాట‌లు పెద్ద‌గా లేవు. డ్యాన్సులు నా క‌ప్ ఆఫ్ టీ కాదు.

* స్ర‌వంతి మూవీస్‌లో సినిమా చేయ‌డం గురించి చెప్పండి?
- ఈ సంస్థ‌లో ప‌నిచేయ‌డం వెరీ బ్లెస్డ్ గా భావిస్తున్నాను. ర‌వికిశోర్‌గారు నా మొద‌టి రోజు నుంచి ఇప్ప‌టిదాకా అంతే ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తున్నారు. ఆయ‌న సీనియ‌ర్ మోస్ట్ ప్రొడ్యూస‌ర్‌. చాలా కేరింగ్ ప‌ర్స‌న్‌.

* మీరు సినిమాల్లోకి ఎలా వ‌చ్చారు?
- అమ్మ‌ది చెన్నై. నాన్న కేర‌ళ‌. సో నా చ‌దువు రెండు రాష్ట్రాల్లోనూ జ‌రిగింది. నాకు మొద‌టి నుంచీ సినిమాల్లోకి రావాల‌ని ఉండేది. ఫ్యాష‌న్ డిజైనింగ్ చేసి ఈ రంగంలోకి అడుగుపెట్టా. మ‌ల‌యాళం, త‌మిళ్ సినిమాలు చేస్తున్న న‌న్ను తెలుగులో న‌టించ‌మ‌ని న‌రేష్ అంకుల్ అమ్మ‌కి ఫోన్ చేసి అడిగారు. అలా తెలుగులో అవ‌కాశం వ‌చ్చింది.

* ఎక్స్ పోజింగ్ గురించి ఏమంటారు?
- స్లీవ్‌లెస్ వేసుకుంటే చేతుల్ని, నీస్ వ‌ర‌కు వేసుకుంటే మోకాళ్ళ వ‌ర‌కు ఎక్స్ పోజింగ్ చేస్తున్న‌ట్టే అర్థం. కానీ అది గ్లామ‌ర్ కాదు. నా దృష్టిలో గ్లామ‌ర్ వేరు. ఎక్స్ పోజింగ్ వేరు. నేను మోడ్ర‌న్‌గా ఉంటాను. జీన్స్, టాప్స్, షార్ట్స్ వేసుకుంటా.

* ఈ సినిమాలో లిప్ లాక్స్ ఉన్నాయా?
- లేవండీ.

* మీ డ్రీమ్ రోల్స్ ఉన్నాయా?
- క్వీన్‌లో కంగ‌నా ఎంత బాగా చేసింది?... అలాంటి పాత్ర‌లంటే ఇష్టం.

 



Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved