pizza
Kodi Ramakrishna interview (Telugu) about Nagabharanam
ఎప్ప‌టిక‌ప్పుడు టెక్నిక‌ల్‌గా అప్‌డేట్ అవుతుంటాను - కోడిరామ‌కృష్ణ‌
You are at idlebrain.com > news today >
Follow Us

9 October 2016
Hyderaba
d

అమ్మోరు, అరుంధతి వంటి విజువల్‌ వండర్స్‌ని రూపొందించిన శత చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపు దిద్దుకుంటున్న మరో అద్భుత చిత్రం 'నాగభరణం'. కన్నడ సూపర్‌స్టార్‌ విష్ణువర్థన్‌ను ఈ చిత్రంలో విజువల్‌ ఎఫెక్ట్స్‌తో క్రియేట్‌ చేయడం అనేది ఒక వండర్‌ అని అందరూ ప్రశంసించడం విశేషం. 40 కోట్ల భారీ బడ్జెట్‌తో అద్భుతమైన గ్రాఫిక్స్‌తో విజువల్‌ వండర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పెన్‌ మూవీస్‌, ఇన్‌బాక్స్‌ పిక్చర్స్‌, బ్లాక్‌బస్టర్‌ స్టూడియో పతాకాలపై జయంతి లాల్‌ గాడా, సాజిద్‌ ఖురేషి, సొహైల్‌ అన్సారీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురక్ష ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియాపై మ‌ల్కాపురం శివ‌కుమార్ సినిమాను అక్టోబ‌ర్ 14న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ‌తో ఇంట‌ర్వ్యూ...

టెన్షన్‌ ఎక్కువైంది...
సాధారణంగా నా సినిమా అంటే ఒక ఎక్స్‌పెక్టేషన్‌ ఉంటుంది. కానీ నాగభరణం సినిమాకు మాత్రం ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌ చాలా ఎక్కువైయ్యాయి. ఈ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఆనందం కంటే టెన్షన్‌ ఎక్కువైంది.

శివకుమార్‌గారికి థాంక్స్‌....
- `నాగభరణం` సినిమాను 600 థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం. సినిమాను తెలుగులో ఇంత గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్న మల్కాపురం శివకుమార్‌గారికి థాంక్స్‌. సాధారణంగా నా సినిమాలు తెలుగులో రూపొంది వేరే భాషల్లో డబ్‌ అవుతాయి. కానీ `నాగభరణం` సినిమాను కన్నడంలో తెరకెక్కించాను. క‌న్న‌డం నుండి ఈ సినిమా తెలుగులోకి డబ్‌ అవుతుంది. కానీ డబ్బింగ్‌ సినిమాలాగా ఎక్కడా కనపడదు. శివకుమార్‌గారు. ఎంతో ఫ్యాషన్‌తో సినిమా ప్రమోషన్‌ చేస్తున్నారు. కొత్త డిజైన్స్‌ను క్రియేట్‌ చేసి సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తున్నారు.

Kodi Ramakrishna interview gallery

సాజిద్‌ సపోర్ట్‌తోనే....
- `నాగభరణం` సినిమా ఇంత బాగా రావడానికి కారణం నిర్మాత సాజిద్‌గారే. ఎంతో హార్డ్‌వర్కర్‌, నేను ఓ సినిమాకు సంబంధించిన మ్యూజిక్‌ డిస్కషన్స్‌లో ఇళయరాజాగారితో కలసి ముంబైలో ఉన్నప్పుడు సాజిద్‌గారు ఫోన్‌ చేసి ముంబైలోని నిర్మాత గాఢాగారికి ఓ కథ చెప్పాలని అన్నారు. ఆయన్ను కలిసి ఓ కథను చెప్పాం. నేను చెప్పిన క‌థ ఆయ‌న‌కు న‌చ్చింది. అయితే గాఢాగారు ఓ సంవత్సరం తర్వాత సినిమా చేస్తానని అన్నారు. గాఢాగారిని కలవడానికి కంటే ముందు సాజిద్‌గారికి నార్మ‌ల్‌గా ఓ చిన్న క‌థ‌ చెప్పాను. ఆ కథ సాజిద్‌కి బాగా నచ్చింది. ఆ సినిమాను తను నిర్మిస్తానని, తన కోసం ఆ కథను డైరెక్ట్‌ చేసి పెట్టమని అడిగాడు. దానికి గ్రాఫిక్స్‌ను కూడా మిక్స్‌ చేసి చేయాలని కూడా అన్నాడు. నేను చాలా ఖర్చు అవుతుందని చెప్పాను. అయితే సాజిద్‌ ఎంత ఖర్చయినా పరావాలేదు..నేను ఆ సినిమాను నిర్మిస్తానని అన్నారు. అయితే తనకు కన్నడ ఇండస్ట్రీలో మంచి పరిచయం ఉండటం వల్ల సినిమాను కన్నడంలో చేసి పెట్టమని అప్పుడు రిలీజ్ ఈజీ అవుతుంద‌నడంతో నేను `నాగభరణం` సినిమాను కన్నడలో డైరెక్ట్‌ చేశాను.

పాముకథ...
-`నాగభరణం` ఓ పాము కథ. ఓ పాముకు గత జన్మలోని విరోధాన్ని ఈ జన్మలో ఎలా తీర్చుకుందనేదే కథ. చివర్లో ఓ రాక్షసుడు కారణంగా ఆ పాము ఓడిపోతుంది. అప్పుడు ఈశ్వరుడు..ఆ పాముకు సహాయం చేయడానికి ఓ శక్తిని, ఓ రూపంలో క్రియేట్‌ చేసి గెలిపిస్తాడు.

ప్రపంచంలో ఇదే తొలిసారి...
- విష్ణువర్ధన్‌గారు అప్ప‌ట్లో నేను డైరెక్ట్‌ చేసిన `భారత్‌ బంద్‌` సినిమా చూసి చాలా బాగా చేశానని అభినందించారు. అప్పటి నుండి మా మధ్య మంచి పరిచయం ఏర్పడింది. విష్ణువర్ధన్‌తో సినిమా చేయాలని.., ఓ పాయింట్‌ ఆయనకు వినిపించాను. ఆయనకు నచ్చడంతో ఆయన కూడా సినిమా చేస్తానని అన్నారు. నేను బ్యాంకాక్‌ వెళ్లి కథను డెవలప్‌ చేసుకుని వచ్చేటప్పటికి విష్ణువర్ధన్‌గారు చనిపోయారు. నేనెంతో బాధపడ్డాను. `నాగభరణం` సినిమా క్లైమాక్స్‌ చేసేటప్పుడు సాజిద్‌ నన్ను కలిసి సార్‌..చివర్లో శివుడు సృష్టించే శక్తి విష్ణువర్ధన్‌లా వస్తే ఎలా ఉంటుందని అడిగాడు. నేను ఆశ్చర్యపోయాను. తర్వాత సాజిద్‌ మాట్లాడుతూ..నేను మకుట గ్రాఫిక్స్‌ వారిని కలిశాను. వారు తమ గ్రాఫిక్స్‌తో విష్ణువర్ధన్‌గారిని క్రియేట్‌ చేస్తామని అనడంతో నేను కూడా సరేనన్నాను. మీకు చిన సర్‌ప్రైజ్‌ ఇద్దామని ఇప్పటి వరకు చెప్పలేదు అని అన్నాడు. దాంతో ఎంతో హ్యాపీగా ఫీలై సరేనన్నాను. అలా `నాగ‌భ‌ర‌ణం`లో విష్ణువ‌ర్ధ‌న్‌గారి పాత్ర క్రియేట్ అయ్యింది. ఈ సినిమాలో విష్ణువర్ధన్‌గారిని 15నిమిషాల పాటు గ్రాఫిక్స్‌లో క్రియేట్‌ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఇలా క్రియేట్‌ చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి. ఆయన చివరి సినిమా `ఆప్తమిత్ర`లో... నేను చనిపోయినా, కన్నడ సినిమా రంగంలోనే మళ్లీ పుడతానని అనే డైలాగ్‌ ఉంటుంది. `నాగభరణం` సినిమాలో విష్ణువ‌ర్ధ‌న్‌గారి పాత్ర చూస్తున్నంత సేపు నిజంగానే `ఆప్త‌మిత్ర` సినిమా తర్వాత ఆయన చనిపోయినా మా సినిమాతో మళ్లీ సినిమా రంగంలో ఇలా పుట్టారనిపించింది.

ట్రెండ్‌ను ఫాలో అవుతుంటాను....
- ప్రతి సినిమాను నేను చూస్తుంటాను. టెక్నికల్‌గా ఏదైనా కొత్త విషయం ఉన్న సినిమాలను చూసినప్పుడు నేను ఆ టెక్నాలజీని తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తాను. నేను `అమ్మోరు` సినిమాలో తొలిసారి గ్రాఫిక్స్‌ వాడినప్పుడు అందరూ థ్రిల్‌ ఫీలయ్యారు. నేను ఏదో గ్రాఫిక్స్‌ వాడాలని కాకుండా గ్రాఫిక్స్‌, కథలోని నెటివిటీకి కనెక్ట్‌ అయ్యేలా ఉందా అని చూసి దానికి తగిన విధంగా గ్రాఫిక్స్‌ చేస్తాను. అలాగే `దేవి` సినిమా, `దేవుళ్లు` సినిమా ఇలా ఏ సినిమా చేసినా అప్పటి ట్రెండ్‌ను బట్టే చేస్తాను. అయితే గ్రాఫిక్స్‌తోసినిమా చేయడమనేది టైం టేకింగ్‌ ప్రాసెస్‌. దాని గురించి దర్శక నిర్మాతలకే కాదు, డిస్ట్రిబ్యూటర్స్‌కు కూడా అవగాహన కలిగించాలి. `అంజి` సినిమా గ్రాఫిక్స్‌ చేసేటప్పుడు చాలా టైం తీసుకుంది. ముఖ్యంగా మెగాస్టార్‌ చిరంజీవి వంటి ఇమేజ్‌ ఉన్న వ్యక్తితో సినిమా చేస్తున్నప్పుడు గ్రాఫిక్స్‌ ఆ ఇమేజ్‌ను ఈక్వల్‌ చేసేలా ఉండాలి. అందుకు టైం తీసుకుంటుంది. ఈ విషయాన్ని సినిమా స్టార్టింగ్‌లోనే చిరంజీవిగారికి చెప్పాను. ఆయన నేను కొత్త హీరోలా చేస్తానండి..ఏం ప‌ర్లేదు అన్నారు. అన్నమాట ప్రకారమే ఆయన ఎన్నో రోజులు కాల్షీట్స్‌ కేటాయించి `అంజి` కోసం వర్క్‌ చేశారు.

నా నిర్మాతలే కారణం....
- నేను దాదాపు దర్శకుడిగా కెరీర్‌ స్టార్‌ చేసి మూడు దశాబ్దాలకు పైగా అయ్యింది. అయితే నేను ఇంకా సినిమాలు చేస్తున్నానంటే కారణం నేను చేసే ప్రతి సినిమాను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని చేస్తాను. అలాగే నా నిర్మాతలు కూడా నా స‌క్సెస్‌కు మరో కారణం. ఏ సినిమా చేసినా మన నిర్మాత సేఫ్‌ సైడ్‌ అయ్యేలా ఉన్నాడా అని చూసుకునే చేస్తాను. అందుకే కెరీర్ ప‌రంగా ఇంత లాంగ్‌రన్‌ చేయగలిగాను. చిరంజీవిగారితో `ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య`, బాలకృష్ణతో `మంగమ్మగారి మనవడు` సినిమాలు చేసి చాలా సంవత్సరాలయ్యాయి. కానీ నేను చిరంజీవిగారు, లేదా నేను, బాల‌కృష్ణ‌గారు క‌లిసిన‌ప్పుడు నిన్న మొన్ననే ఆ సినిమాలకు క్లాప్‌ కొట్టినట్లు ఫీల్‌ అవుతాం. నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే నిర్మాతలు మంచి కథలు కావాలని వస్తారు. వారికి నచ్చే విధంగా కథను తయారు చేస్తాను. వారికి నచ్చితేనే సినిమా చేస్తాను. అందుకే అన్నీ ర‌కాల‌ జోనర్స్ లో మూవీస్‌ చేయగలిగాను. నా ఇన్నేళ్ల కెరీర్‌ 15 సినిమాలు ఏడాది పాటు సక్సెస్‌ఫుల్‌గా ఆడాయి. దర్శకుడుగా నా సక్సెస్‌ రేట్‌ 80 శాతంపైగానే ఉంది. నేను ఇంత సాధించడానికి ఏకైక కారణం నిర్మాతలే. నేను సినిమా డైరెక్ట్‌ చేసేటప్పుడు నా నిర్మాత సెట్‌లో ఉండాలని కోరుకుంటాను. నిర్మాత లేని సెట్‌ దేవుడి లేని గుడిలాంటిదని నేను భావిస్తాను. నా సక్సెస్‌ఫుల్‌ జర్నీలో భాగమైన నా నిర్మాతలకు ఎప్పటికీ కృతజ్ఞతలు తెలుపుకుంటాను


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved