pizza
'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' విజయానికి కారణమైన ప్రేక్షకులకు థాంక్స్ - క్రాంతి మాధవ్
You are at idlebrain.com > news today >
Follow Us

09 February 2015
Hyderabad

'ఓనమాలు'తో దర్శకుడిగా సినీ ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ క్రాంతి మాధవ్ అందించిన మరో పొయెటిక్ లవ్ స్టోరీ 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు'. కె.యస్.రామారావు సమర్పణలో సి.సి.మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ లిమిటెడ్ బ్యానర్ పై కె.ఎ.వల్లభ నిర్మాతగా శర్వానంద్, నిత్యామీనన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న విడుదలై మంచి సక్సెస్ టాక్ తో రన్ అవుతుంది. ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు క్రాంతి మాధవ్ తో ఇంటర్వ్యూ....

సినిమా పెద్ద సక్సెస్ సాధించింది. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?
-చాలా హ్యపీగా ఉన్నాను. సినిమా కథ రాసుకునేటప్పుడు, సినిమా డైరెక్ట్ చేసేటప్పుడు సినిమా సక్సెస్ అవుతుందని ఛాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ఎందుకంటే ఇది ఒక ఎమోషనల్ స్టోరి. కచ్చితంగా ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటుందనే తెలుసు. మా అంచనా నిజమైంది. ఈ రోజు ప్రేక్షకుల వద్ద నుండి మంచి అప్లాజ్ వస్తుంది. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్.

ఇందులో శర్వానంద్, నిత్యామీనన్ వంటి యంగ్ హీరో హీరోయిన్ ని డాడీ, మమ్మీ అని పిలిపించారు కదా?
-రన్ రాజా రన్' వంటి సక్సెస్ తర్వాత శర్వానంద్ చేసిన సినిమా. తను యంగ్ హీరో అయినప్పటికీ డాడీ అని పిలిపించుకున్నాడంటే సినిమాలో తను ఇన్ వాల్వ్ అయ్యాడో తెలుస్తుంది. కదా అలాగే నిత్యామీనన్ కూడా. ఇద్దరూ కథ వినగానే చాలా ఇన్ స్పైర్ అయ్యారు. ఇన్ వాల్వ్ మెంట్ తో చేశారు. కథలో ఇమిడిపోయారు. వారి క్యారెక్టర్స్ కి జస్టిఫై చేశారు.

సినిమాలో సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ మంచి రెస్పాన్స్ వస్తుంది కదా.. డైలాగ్స్ పై ఎలా వర్కవుట్ చేశారు?
గతంలో కూడా సాయిమాధవ్ గారు కృష్ణం వందే జగద్గురుమ్, గోపాల గోపాల చిత్రాలకు డైలాగ్స్ రాశారు. వాటికి మంచి అప్లాజ్ వచ్చింది. ఇక మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమా విషయానికి వస్తే ఇది క్యూట్ లవ్ స్టోరి. లవ్ స్టోరిస్ ఎలా ఉంటాయనేది మనకు తెలుసు. ప్రతి ఎలిమెంట్ బావుంటేనే ప్రేక్షకుడికి రీచ్ అవుతుంది. అందుకని డైలాగ్స్ పైనే రెండు నెలలు పాటు పనిచేశాం. చాలా వెర్షన్స్ రాశాం. వాటిలో బెస్ట్ అనిపించిన దానికే ఫిక్స్ అయ్యాం.

లవ్ స్టోరీ చిత్రాల్లో మ్యూజిక్ కీ రోల్ పోషిస్తుంది. గోపిసుందర్ గారి మ్యూజిక్ ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది?
-ఈ సినిమాకి ముందుగా నేను మ్యూజిక్ డైరెక్టర్ గా గోపిసుందర్ నే అనుకున్నాను. తను మ్యూజిక్ ఇచ్చిన అన్వర్, ఉస్తాద్ హోటల్, బెంగళూర్ డేస్ చిత్రాలను చూశాను. ఈ సినిమాకి తను మ్యూజిక్ ఇస్తే బావుంటుందనిపించింది. అదే విషయాన్ని కె.యస్.రామారావుగారికి చెప్పాను. యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమేనని అయన అన్నారు. అయితే గోపిసుందర్ ఎమంటారో అని అనుకున్నాను. కథ విన్న గోపిసుందర్ తను ఈ సినిమా కచ్చితంగా చేస్తానని అన్నారు. ఎక్సలెంట్ మ్యూజిక్ , బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. మ్యూజిక్ కి ఆడియెన్స్ ను సూపర్ రెస్పాన్స్ వస్తుంది.

ఈ కథ రాసుకునేటప్పుడు ముందుగా హీరో హీరోయిన్లుగా ఎవరిని అనుకున్నారు?
-నిజానికి నేను కథ రాసుకునేటప్పుడు ఏ హీరో హీరోయిన్ ని అనుకోలేదు. స్టోరి మొత్తం రెడీ అయిన తర్వాత శర్వానంద్, నిత్యామీనన్ అయితే సరిపోతారని నాకు అనిపించింది. అదే విషయాన్ని కె.యస్.రామారావుగారికి చెప్పాను. ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

నిర్మాతలు ఇచ్చిన సపోర్ట్ గురించి?
-కె.యస్.రామారావుగారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. క్రియేటివ్ కమర్షియల్ లో ఎలాంటి చిత్రాలు వచ్చాయో మీకందరికీ తెలిసిందే. ఈ సినిమా విషయంలో ఆయన సహకారం మరువలేనిది. అలాగే నిర్మాత కె.ఎ.వల్లభగారు కూడా అన్నీ విషయాలు చాలా దగ్గరుండి చూసుకున్నారు. వారి సహకారం లేకుంటే సినిమా ఇంత బాగా వచ్చుండేది కాదు.

దర్శకుడిగా ఎలాంటి సినిమాలను ఇష్టపడతారు?
-మంచి స్టోరీ బేస్ ఉన్న సినిమాలంటే నాకు చాలా ఇష్టం. సాధారణంగా మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమాలన్నీ సక్సెస్ సాధించాయి.

నెక్స్ ట్ ప్రాజెక్ట్స్?
-ప్రస్తుతానికి ఇంకా ఏమీ అనుకోలేదు ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాను. . రెండు, మూడు కథలు సిద్ధంగానే ఉన్నాయి. అవి ఒక కొలిక్కి వచ్చిన తర్వాత చెబితే బావుంటుంది.

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved